iDreamPost

మలయాళ ఇండస్ట్రీ మెరుపులు.. 4 వారాల్లో 4 హిట్స్!

  • Published Feb 23, 2024 | 2:14 PMUpdated Feb 23, 2024 | 2:14 PM

సినీ ప్రియులకు ఈ ఏడాది సంక్రాతి తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేకపోవడంతో మాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆ లోటును తీర్చేసింది. ఈ క్రమంలోనే వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ దూసుకుపోతున్నాయి. ఇంతకి ఆ సినిమాలేవంటే..

సినీ ప్రియులకు ఈ ఏడాది సంక్రాతి తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేకపోవడంతో మాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆ లోటును తీర్చేసింది. ఈ క్రమంలోనే వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ దూసుకుపోతున్నాయి. ఇంతకి ఆ సినిమాలేవంటే..

  • Published Feb 23, 2024 | 2:14 PMUpdated Feb 23, 2024 | 2:14 PM
మలయాళ ఇండస్ట్రీ మెరుపులు.. 4 వారాల్లో 4 హిట్స్!

టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాతి తర్వాత పెద్ద హిట్ అయిన సినిమాలు అంటూ ఏవీ రాలేదు. అలాగే కోలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితిలు నెలకొన్నాయి. దీంతో మూవీ లవర్స్ కు కొత్తదనం ఏమిలేక సినిమాల విషయంలో కొంచెం అసంతృప్తితో ఉన్నారు. అసలే, ఫిబ్రవరి అంటే అన్ సీజన్. ఈ సమయంలో స్టార్ హీరో సినిమాలేవి రిలీజ్ కావు. పైగా చిన్న స్థాయి హీరోల సినిమాలు థియేటర్లలో అలరించిన.. వాటిలో భారీ విజయం సాధించనవి చాలా తక్కువగా ఉంటాయి. మరి ఇలాంటి సీజన్ లో వరుస బ్లాక్ బస్లర్ హిట్ లను అందిస్తూ అందరి దృష్టిని తమ వైపు తిప్పుకుంటుంది మలయాళ చిత్ర పరిశ్రమ. ఒక్కొక్క సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఇంతకి ఆ సినిమాలు ఏంటో చూద్దం.

మాలయళ చిత్ర పరిశ్రమలో ఒక సినిమాకు తలపించి మరొక సినిమా అన్నట్లుగా ప్రేక్షకులను అలారిస్తున్నారు మాలీవుడ్ స్టార్స్. దీంతో అటూ టాలీవుడ్, కోలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవడంతో అందరి దృష్టి మాలీవుడ్ పై ఆకర్షిస్తుంది. ఈ క్రమంలోనే.. ఈ నెల మొదటి వారంలో టొవినో థామస్‌ థ్రిల్లర్‌ మూవీ ‘అన్వేషిప్పిన్‌ కండేదుం’ రిలీజై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మంచి సూపర్ హిట్ అందుకున్న దిశగా అడుగులేస్తున తరుణంలో.. రెండో వారంలోనే ‘ప్రేమలు’ అనే మూవీ థియేటర్లలో విడుదలైంది. లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమా.. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇక ప్రేమలు సినిమా ప్రేక్షకులను ఆకట్టకొని థియేటర్లు హౌస్‌ ఫుల్స్‌తో రన్‌ అవుతున్నాయి. అలాగే ఈ సినిమా హైదరాబాద్‌ లాంటి చోట్ల కూడా బాగా అలారిస్తుంది.

ఇక దీని తర్వాత మూడో వారంలో మాలయళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమా ‘భ్రమయుగం’ రిలీజై బ్లాక్‌బస్టర్‌ హిట్ టాక్‌ ను తెచ్చుకుంది. ఆ సినిమాకు కూడా హౌస్‌ ఫుల్స్‌ తో అలరించడమే కాకుండా కలెక్షన్స్ తో దూసుకుపోయింది. ఇప్పుడు ఈ మూడు చిత్రాలు బాగా అడుతున్న సమయంలో..ఇప్పుడు ఇంకో సినిమా మలయాళ ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ సినిమానే ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’. అయితే ఇందులో బాగా పేరున్న హీరోలెవరూ లేరు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నటులు అందరూ ఎక్కువ శాతం కొత్త వాళ్లే కావడం గమన్హారం.

కాగా, గురవారం రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్‌ మూవీకి అదిరిపోయే టాక్‌ వచ్చింది. దీంతో ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ దిశగా సాగుతుంది. ఇప్పటికే ఇది వంద కోట్ల సినిమాగా చెబుతున్నారు. ఇక మొత్తనికి ఈ అన్ సీజన్ సమయంలో మూవీ లవర్స్ కు మంచి హిట్ సినిమాలను అందిస్తూ మాలీవుడ్ పరిశ్రమ తగిన న్యాయమే చేసింది. అయితే ఒకే భాషలో నాలుగు  బ్లాక్ బస్టర్లు అందుకోవడం పై  నిజంగా చాలా అరుదైన ఘనత అంటూ సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. మరి, ఈ నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి