iDreamPost

Hyderabad: మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం..

  • Published Jan 23, 2024 | 7:36 AMUpdated Jan 23, 2024 | 7:36 AM

సోమవారం రాత్రి మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ వివరాలు..

సోమవారం రాత్రి మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ వివరాలు..

  • Published Jan 23, 2024 | 7:36 AMUpdated Jan 23, 2024 | 7:36 AM
Hyderabad: మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం..

సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకలతో దేశవ్యాప్తంగా పండగ వాతావారణం నెలకొంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఈ వేడుక జరుపుకున్నారు. రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్‌లో చూస్తూ.. తమ తమ ఇంటి వద్దే ఆ రామయ్యకు పూజలు చేశారు. ఇక సాయంత్రం పూట దేశవ్యాప్తంగా ప్రజలు టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే దేశమంతా అయోధ్య మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో పండగ చేసుకుంటుంటే.. మాదాపూర్‌లో మాత్రం విషాద వాతారణం నెలకొంది. సోమవారం రాత్రి భారీ మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ వివరాలు..

హైదరాబాద్‌ మాదాపుర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీజ్ చేసిన గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మరి పోలీస్‌ స్టేషన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ ఎందుకుంది అంటే.. హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేసినప్పుడు సిలిండర్లను కూడా సీజ్‌ చేస్తారు. అలా తీసుకువచ్చిన గ్యాస్‌ సిలిండర్‌లను పోలీస్ స్టేషన్ వెనుక ప్రదేశంలో ఉంచారు. అయితే సోమవారం నాడు అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగడంతో జనమంతా రాత్రి సమయంలో రామ దీపాలు వెలిగించి దీపావళి జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

fire accident in madapur police station

దాంతో భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఇక కొంత మందైతే ఆనందంతో బాణాసంచా కూడా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే.. పోలీస్ స్టేషన్ సమీపంలో బాణాసంచా పేల్చగా.. వాటి నిప్పు రవ్వలు ఎగిసిపడి సీజ్ చేసిన స్క్రాప్‌పై పడటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. స్క్రాప్‌లో సిలిండర్లు కూడా ఉండగా..నిప్పు రవ్వలు పడటం వల్ల అవి పేలి పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో.. పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది బయటకు పరుగులు తీశారు.

అగ్ని ప్రమాదం కారణంగా.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదాన్ని గమనించిన వెంటనే పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే సిలిండర్లు వరుసగా పేలటంతో.. ప్రమాద తీవ్రత పెరిగింది. చిరవకు ఎన్నో గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

పోలీస్ స్టేషన్ పక్కనే దేవాలయం, మరోవైపు నివాస భవనాలు కూడా ఉండటంతో.. ఆ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ కూడా ప్రధాన రోడ్డుకు దగ్గరే ఉండటంతో.. మంటల ప్రభావానికి వాహనదారులు కూడా వెళ్లేందుకు భయపడ్డారు. సిలిండర్లు పేలిన శబ్దాలతో భయబ్రాంతులకు గురైన స్థానికులు.. ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అదృష్టం కొద్ది ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి