iDreamPost

Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్.. ఏప్రిల్ 1 నుండి ఆ ట్రైన్స్ రద్దు! కొన్ని దారి మల్లింపు!

దేశంలో ఎక్కువ మంది ప్రయాణించే రవాణ వ్యవస్థల్లో రైల్వే శాఖ ఒకటి. దీని ద్వారా నిత్యం లక్షల మంది తమ గమ్య స్థానాలకు చేరుతుంటారు. ఈ క్రమంలోనే ఏపీలో రైల్వే ప్రయాణికులు ముఖ్య గమనికను రైల్వే అధికారులు తెలిపారు.

దేశంలో ఎక్కువ మంది ప్రయాణించే రవాణ వ్యవస్థల్లో రైల్వే శాఖ ఒకటి. దీని ద్వారా నిత్యం లక్షల మంది తమ గమ్య స్థానాలకు చేరుతుంటారు. ఈ క్రమంలోనే ఏపీలో రైల్వే ప్రయాణికులు ముఖ్య గమనికను రైల్వే అధికారులు తెలిపారు.

Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్.. ఏప్రిల్ 1 నుండి ఆ ట్రైన్స్ రద్దు! కొన్ని దారి మల్లింపు!

భారత దేశంలోని రవాణ వ్యవస్థలో అతి ముఖ్యమైనది రైల్వే వ్యవస్థ. అంతేకాక దేశంలోనే అతి పెద్ద వ్యవస్థ ఇది. ఇక రైళ్లల ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్య స్థానాలకు చేరుతుంటారు. టికెట్ ధర తక్కువగా ఉండటంతో రైళ్లలో ప్రయాణించేందుకు  ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ కీలక సమాచారం అందిస్తుంది. వివిధ కారణాలతో రద్దయ్యే రైళ్లు, దారి మళ్లీంచే రైళ్ల వివరాలను తెలియజేస్తుంది. తాజాగా ఏపీలోని రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక సమాచారం వెల్లడించింది. ఏప్రిల్ 1 తేదీ నుంచి కొన్ని ట్రైన్స్ రద్దుకాగా, మరికొన్నిటిని దారి మళ్లించనున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనికను రైల్వే అధికారులు తెలిపారు. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు  అధికారులు వెల్లడించారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ కారణం దృష్ట్యా ఏప్రిల్ 1 నుంచి 28 వరకూ విజయవాడ-విశాఖల మధ్య సామర్లకోట మీదుగా రాకపోకలు సాగించే  పలు రైళ్లను రద్దు చేసినట్లు, మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు, విశాఖ మధ్య నడిచే 22701, 22702 రద్దు చేశారు.  మచిలీపట్నం, విశాఖల మధ్య రాకపోకలు సాగించే 17219, 17220 ఎక్స్ ప్రెస్ రైళ్లను ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 29 వరకూ రద్దు చేశారు.

అలానే 13351  ధన బాద్ నుంచి అలపూజ మధ్య నడిచే బొకారో ఎక్స్ ప్రెస్ రైలు ఏప్రిల్ 1 నుంచి 28 వరకూ నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడ చేరుతుంది.  అలానే హతియా-బెంగుళూరు (12835)ల మధ్య రాకపోకలు సాగించే రైలు ఏప్రిల్‌ 2, 7, 9, 14, 16, 21, 23, 28 తేదీలలో విజయవాడకు చేరనుంది. హతియా-బెంగుళూరుల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు 18637ను ఏప్రిల్‌ 6, 13, 20, 27 తేదీల్లో నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడకు చేరుతుంది. హతియా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ 1, 8, 15, 22 తేదీల్లో భీమవరం, గుడివాడల మీదుగా బెజవాడకు వస్తుంది.

అలానే టాటానగర్, యశ్వంత్ పూర్ మధ్య నడిచే 18111 నెంబర్ ఎక్స్ ప్రెస్ రైలు ఏప్రిల్ 4, 11, 18, 25 తేదీలలో నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడకు వస్తుంది. ముంబై నుంచి భువనేశ్వర్‌ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ (11019) ఏప్రిల్‌ 1 నుంచి 27 తేదీ వరకు విజయవాడ, గుడివాడ, భీమవరం మీదుగా నిడదవోలు చేరుతుంది. టాటా నుంచి బెంగుళూరు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ (12889) రైలు ఏప్రిల్‌ 5, 12, 19, 26 తేదీలలో నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడకు వస్తుంది. అదే విధంగా ఎర్నాకుళం నుంచి పాట్నా  వెళ్లే పాట్నా ఎక్స్‌ప్రెస్‌ (22643) రైలు ఏప్రిల్‌ 8, 12,15, 22 తేదీలలో విజయవాడ, భీమవరంల మీదుగా నిడదవోలు చేరుతుంది. జాసిడ్‌-తాంబరమ్‌ ఎక్స్ ప్రెస్ (12376) రైలు ఏప్రిల్‌ 3, 10, 17, 24 తేదీలలో భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడకు  చేరుతుంది.

బెంగుళూరు నుంచి అస్సాం వెళ్లే గౌహతి ఎక్స్‌ప్రెస్‌ (12509) రైలు ఏప్రిల్‌ 3, 5, 10, 12, 17, 19, 24, 26 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరం మీదుగా నిడదవోలు చేరుతుంది. అలానే గుజరాత్ లోని భావనగర్‌ నుంచి కాకినాడ పోర్టు వెళ్లే కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ (12756) రైలు ఏప్రిల్‌ 6, 13, 20, 27 తేదీలలో విజయవాడ మీదుగా నిడదవోలు చేరుతుంది. ఇక పూర్తి సమాచారం కోసం రైల్వేశాఖ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించ వచ్చు. అంతేకాక దగ్గర్లో గల రైల్వే స్టేషన్‌ బుకింగ్‌ కార్యాలయ ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి