iDreamPost

గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబమంతా మృతి

రెక్కల కష్టంతో పిలల్ల్ని చదివించాడు తండ్రి. కొడుకులు కూడా చేతికి అందివచ్చారు. ఆర్థిక సమస్యలు మెల్లిగా తీరుతున్నాయి అనుకున్న సమయంలో కుటుంబం మొత్తంపై పగబట్టింది విధి. ఒకేసారి వీరి జీవితాలతో ఆటలాడింది.

రెక్కల కష్టంతో పిలల్ల్ని చదివించాడు తండ్రి. కొడుకులు కూడా చేతికి అందివచ్చారు. ఆర్థిక సమస్యలు మెల్లిగా తీరుతున్నాయి అనుకున్న సమయంలో కుటుంబం మొత్తంపై పగబట్టింది విధి. ఒకేసారి వీరి జీవితాలతో ఆటలాడింది.

గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబమంతా మృతి

ఓ విధి విచిత్రాల నిధి అని ఫేమస్ సీరియల్ సాంగ్ ఉంటుంది. నిజంగానే అది చేసే చిత్ర, విచిత్ర విన్యాసాల గురించి లెక్కలు వేయలేం. వేసినా తారుమారు చేసే నైజం కేవలం విధికే చెల్లుతుంది. ఎప్పుడు ఎవ్వరి జీవితాలతో ఎలా ఆడలాడుతుందో చెప్పలేం. ఒక్క ఇన్సిడెంట్ టోటల్ లైఫ్ ఛేంజ్ చేసేస్తుంది. కోలుకోలేని దెబ్బ కూడా వేస్తుంది. కొన్ని సార్లు ప్రాణాలు బలితీసుకుంటుంది. ఈ కుటుంబంలో అదే జరిగింది. ఒక్కరు కాదూ నలుగుర్ని ఓ ప్రమాదం కబళించింది. కొన్ని గంటల్లోనే ఒక కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసి.. పాశనంగా మారిపోయింది విధి. కుటుంబంలోని నలుగురు చనిపోవడంతో మానవత్వాన్ని ప్రదర్శించి.. అంత్యక్రియలు నిర్వహించారు స్థానికులు.

వివరాల్లోకి వెళితే.. విశాఖ పట్నంలోని ఆనందపురానికి చెందిన బాలరాజు, చిన్ని భార్యా భర్తలు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న బాలరాజు.. విశాఖ నగరానికి వచ్చి అక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు గిరి (23), కార్తీక్ (21). తన కాయ కష్టంతోనే కుటుంబాన్ని లాక్కొచ్చారు బాలరాజు. పిల్లలు చేతికి రావడంతో కాస్త ఆర్థిక కష్టాలు తీరుతున్నాయి. ఈ క్రమంలో తండ్రి, కొడుకులు మాల ధారణ చేశారు. ఈ నెల 24న తెల్లవారు జామున నిద్రలేచి, పూజకు సిద్దమవుతున్నారు. అదే సమయంలో వంట గ్యాస్ అయిపోవడంతో భర్తకు చెప్పింది భార్య. అంతలో కుమారులు.. దీపారాధన చేస్తున్నారు. భర్తకు సిలిండర్ మారుస్తుండగా.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఆ నలుగురు హాహాకారాలు చేశారు.

ఇంట్లో నుండి పొగ, కేకలు వినిపించడంతో వెంటనే స్థానికులు.. ఇంటి వద్దకు వెళ్లి.. నలుగుర్ని బయటకు తీసుకువచ్చి..  కేజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మూడు రోజుల అనంతరం..కుమారుల్లో ఒకరు మరణించారు. మరుసటి రోజు మరో కుమారుడు కన్నుమూశాడు. వీరికి స్థానికులే అంత్యక్రియలు పూర్తి చేశారు. చేతికొచ్చిన కొడుకులు చనిపోయారన్న వార్త.. తల్లిదండ్రుల్ని మరింత కుంగదీసింది. ఆ మరణవార్త తట్టుకోలేక.. దీనికి తోడు కాలిన గాయాలతో భార్యా భర్తలు కూడా ప్రాణాలు విడిచారు. అయితే ఈ ప్రమాదానికి కారణం గ్యాస్ లీకని చెబుతున్నారు పోలీసులు. గ్యాస్ బండ మార్చే క్రమంలో వాయువు లీక్ అయ్యి ఉంటుందని, ఆ క్రమంలోనే దీపారాధన చేసి ఉండటం వల్ల.. మంటలు అలముకుని.. సిలిండర్ పేలిందని చెబుతున్నారు. కుటుంబంలోని నలుగురు చనిపోవడంతో కన్నీరు మున్నీరు అయ్యారు స్థానికులు. నలుగురికి అన్నీ తామై అయ్యి అంత్యక్రియలు నిర్వహించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి