iDreamPost
android-app
ios-app

Dhoomam OTT: ఏడాది తర్వాత OTT లోకి ఫహద్ ఫాజిల్ మూవీ.. అది కూడా ఫ్రీగా !

  • Published May 29, 2024 | 11:16 AMUpdated May 29, 2024 | 11:16 AM

ఓటీటీ లోకి కొన్ని సినిమాలు రాడానికి చాలా సమయం తీసుకుంటూ ఉంటాయి. పైగా అవన్నీ కూడా ఫేమస్ హీరోల సినిమాలే అవ్వడం విశేషం. ఈ క్రమంలో ఆలస్యంగా ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్న సినిమాల లిస్ట్ లో మరొక సినిమా యాడ్ అయింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీ లోకి కొన్ని సినిమాలు రాడానికి చాలా సమయం తీసుకుంటూ ఉంటాయి. పైగా అవన్నీ కూడా ఫేమస్ హీరోల సినిమాలే అవ్వడం విశేషం. ఈ క్రమంలో ఆలస్యంగా ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్న సినిమాల లిస్ట్ లో మరొక సినిమా యాడ్ అయింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published May 29, 2024 | 11:16 AMUpdated May 29, 2024 | 11:16 AM
Dhoomam OTT: ఏడాది తర్వాత OTT లోకి ఫహద్ ఫాజిల్ మూవీ.. అది కూడా ఫ్రీగా !

ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు నెల, వారం తిరగకముందే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. దీనితో మూవీ లవర్స్ ఖుషి అయిపోతున్నారు. ఇలా కొన్ని సినిమాలు ఇంత ఫాస్ట్ గా ఉంటె.. కొన్ని సినిమాలు మాత్రం నెలలు, సంవత్సరాలు గడిచిన ఓటీటీ ఎంట్రీకి నోచుకోవు. ఇలా రెండు రకాల పరిస్థితులు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాము. ఏదేమైనా ఆయా సినిమాలు త్వరగా వచ్చినా లేదా ఆలస్యంగా వచ్చినా కానీ ఆయా సినిమాల కథను బట్టి.. ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఆలస్యంగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సినిమాల లిస్ట్ లోకి మరొక సినిమా యాడ్ అయిపొయింది. అది కూడా ఓ ఫేమస్ హీరో సినిమా. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు. ఫహద్ ఫాజిల్ నటించిన.. మలయాళ సినిమా “ధూమమ్”. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది సమయం కావొస్తుంది. భారీ అంచనాల మధ్యన ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేసినా కానీ.. బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం హిట్ సాధించలేకపోయింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఏడాది తర్వాత ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటివరకు ఈ సినిమా ఆపిల్ టీవీ ప్లస్ లో ఉంది కానీ పెద్దగా ఎవరికి తెలీదు. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఇప్పుడు ఫ్రీ గా స్ట్రీమింగ్ చేయనున్నారు. అది కూడా యూట్యూబ్ లో.. స్మోకింగ్ వలన కలిగే అనర్ధాలను ఓ యాక్షన్ థ్రిల్లర్ ద్వారా చూపించిన సినిమా ఇది. కాబట్టి.. మే 31 న వరల్డ్ నో టొబాకో డే సందర్బంగా ఈ సినిమాను.. హోంబలే ఫిల్మ్స్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఎలాగూ ఎటువంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు కాబట్టి.. ఎంచక్కా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేయండి.

ఇక ధూమమ్ మూవీ ప్లాట్ విషయానికొస్తే.. సిగరేట్, పొగాకు తయారు చేసే వ్యాపారాలు చేసే వారు టెర్రరిస్ట్ లతో సమానం అని, వారి వలన సొసైటీకి ఎంతో నష్టం ఉందని.. ఈ సినిమాలో చూపించారు. ఆ వ్యాపారాల వలన కేవలం లాభనష్టాలు మాత్రమే ఉంటాయని.. ఇంకా ఏ ప్రయోజనాలు ఉండవని ఈ సినిమాలో.. యధార్థ సంఘటనలకు అనుగుణంగా చూపించారు. అలాగే ఓ వైపు లాభాల కోసం సిగరెట్ కంపెనీలు వేసే ఎత్తులు ఎలా ఉంటాయో చూపిస్తూనే.. మరో వైపు ఆ ట్రాప్ లో పడిన యూత్ ఎలా బయటపడేందుకు ప్రయత్నం చేశారు అనేది కూడా ఈ సినిమాలో చూపించారు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి