iDreamPost

వలంటీర్లపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఈసీ!

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మార్చి 17 నుంచి ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మార్చి 17 నుంచి ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

వలంటీర్లపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఈసీ!

లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయటంతో శనివారం, మార్చి 17 నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని ఎలక్షన్ కమీషన్ అమలు చేస్తున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి జూన్ 6న పూర్తవుతుంది. ఈ లేక్కన దాదాపు 80 రోజుల పాటు ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయి. ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాల్లో పలు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఏపీలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే వలంటీర్లపై ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

ఏపీలో రాజకీయాలు బాగా హీట్ మీద ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైఎస్సాఆర్‌సీపీ తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో మాత్రం ఇంకా సీట్ల సర్ధుబాటు విషయంలో తర్జనభర్జన కొనసాగుతుంది. ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలల్లో మరోసారి తమ సత్తా చాటాలని అధికార పార్టీ గట్టి పట్టుమీదే ఉంది. ఏపీలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు పూర్తయి.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్నారని గ్రామ వలంటీర్లపై ఫిర్యాదుల వచ్చాయని.. ప్రచారంలో ఎవరైనా వలంటీర్లు కనిపిస్తే ఎన్నికల సంఘానికి వాట్సాప్ చేయాలంటూ ఓ ప్రకటన చక్కర్లు కొడుతుంది.

వలంటీర్ల ఫోటో తీసి వారి పేరు, ఊరు పేరు చెప్పాలని ప్రకటనలో సారాంశం. ఇందులో ఎన్నికల కమిషనర్ పేరుతో ఓ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారుర. ఈ నెంబర్ కి వలంటీర్ల పై ఫిర్యాదు చేయవొచ్చని పేర్కొన్నారు. తాజాతగా ఈ ప్రకటనపై ఎన్నికల సంఘటం సీరియస్ అయ్యింది. తాము ఏ ప్రకటన చేయలేదని.. ఎన్నికల కమిషనర్ సీఈవో పేరుతో ఎవరో తప్పుడు ప్రచారం చేశారని తెలిపింది, అంతేకాదు 9676692888 అనే నెంబర్ సీఈఓ వాట్సాప్ గా వైరల్ అవుతున్న నెంబర్ ఫేక్ అని స్పష్టం చేసింది. ఆ న్యూస్ అంతా పుకార్లు.. ఎవరూ నమ్మవొద్దని తెలిపింది. ఈ విషయంపై ఏపీ ఎన్నికల ప్రధాన అలధికారి ముఖేష్ కుమార్ మీనా సీరియస్ అయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి