iDreamPost

పవన్ పై క్రిమినల్ కేసు నమోదు.. కోర్టుకు రావాలంటూ ఆదేశాలు!

Criminal Case On Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ షాక్.. కోర్టు డైరెక్షన్ తో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Criminal Case On Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ షాక్.. కోర్టు డైరెక్షన్ తో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

పవన్ పై క్రిమినల్ కేసు నమోదు.. కోర్టుకు రావాలంటూ ఆదేశాలు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. గుంటూరులో పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. మార్చి 25న కోర్టులో హాజరు కావాలంటూ జిల్లా జడ్జి శరత్ బాబు నోటీసులు ఇచ్చారు. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ వాలంటీర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు డైరెక్షన్ తో ఐపీసీ సెక్షన్ 499, 500 కింద పవన్ కల్యాణ్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. జులై 3న ఏలూరులో జరిగిన వారాహియాత్రలో పవన్ కల్యాణ్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

గతంలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాల్లో అండగా ఉంటున్న వాలంటీర్ వ్యవస్థను కించ పరుస్తూ పవన్ వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర దుమారం రేగింది. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని రాష్ట్ర ప్రజల గుమ్మం వద్దకే తీసుకెళ్తూ.. విపత్తుల సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్న ఒక గొప్ప వ్యవస్థ మీద పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు అంటూ రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కూడా కారణం అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఒంటరి మహిళలు, నిరుపేద మహిళల వివరాలు సంఘవిద్రోహ శక్తులకు చేరుతున్నాయంటూ పవన్ వ్యాఖ్యానించారు.

వాలంటీర్లు అంతా పవన్ వ్యాఖ్యలను ఖండించిన విషయం తెలిసిందే. తీవ్ర నిరసనలు కూడా చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. ప్రభుత్వం కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. వాలంటీర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే మార్చి 25న తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ జిల్లా నాలుగో అదనపు జడ్జి శరత్ బాబు నోటీసుల్లో పేర్కొన్నారు. మరి.. పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి