iDreamPost

ఏపీలో పింఛన్లు ఎప్పుడు? ఎలా? ఈ గందరగోళానికి కారణం ఏంటి?

Details About AP Pension Distribution: ఏపీలో ప్రస్తుతం వాలంటీర్లు ఎలాంటి నగదు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆస్కారం లేదు. ఎన్నికల సంఘం అందుకు తగిన ఆంక్షలు విధించింది. మరి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్లు ఎలా పంపిణీ చేస్తారు?

Details About AP Pension Distribution: ఏపీలో ప్రస్తుతం వాలంటీర్లు ఎలాంటి నగదు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆస్కారం లేదు. ఎన్నికల సంఘం అందుకు తగిన ఆంక్షలు విధించింది. మరి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్లు ఎలా పంపిణీ చేస్తారు?

ఏపీలో పింఛన్లు ఎప్పుడు? ఎలా? ఈ గందరగోళానికి కారణం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో ఒక ప్రశ్న ఇప్పుడు మెదులుతూ ఉంది. మొన్నటివరకు అయితే ఒకటో తేదీ రాగానే వాలంటీర్లు ఇంటికి వచ్చి అవ్వతాతలు, దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేసేవాళ్లు. కానీ, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు వాలంటీర్లు పింఛన్లు, ప్రభుత్వ పథకాల పంపిణీలో భాగం కాకూడదు. వారి వద్దనున్న ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణం అంటూ అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజల్లో పింఛను ఎప్పుడు ఇస్తారు? ఎలా ఇస్తారు? ఎవరు ఇస్తారు? అనే ప్రశ్నలు మెదులుతున్నాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు ఎలాంటి నగదు పంపిణీ కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదు అంటూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వారి వద్దనున్న ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ప్రభుత్వానికి హ్యాండోవర్ చేశారు. నిమ్మగడ్డ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదే ఈ పరిస్థితికి కారణం. ఈ ఫిర్యాదు వెనుక అసలు సూత్రదారుడు చంద్రబాబు అంటున్నారు. ఆయన ప్రోత్బలంతోనే నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు అంటూ అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో పింఛన్లు మాత్రం ఆగిపోయాయి. ఎవరు ఇస్తారు అనే విషయంపై ప్రజలకు క్లారిటీ లేకుండా పోయింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల్లో ఆన్ లైన్ ట్రాన్సర్ ద్వారానైనా లేదా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సంక్షేమ పథకాల అమలు జరిగేలా చూసుకోవాలంటూ స్పష్టం చేశారు. పథకాలు ఎలా ఇవ్వాలి అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. ఈ విషయంపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కలెక్టర్లు పలు సూచనలు చేశారు. పింఛన్ల పంపిణీకి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను వినిపించారు.

కలెక్టర్ల సూచనలు:

ఈ సావేశంలో పాల్గొన్న కలెక్టర్లలో ఎక్కువ మంది ఇంటింటికి తిరిగి పింఛన్ పంపిణీ చేసేందుకే మొగ్గు చూపారు. అలా ఇంటింటికి తిరిగి వారంలోగా పింఛను పంపిణీ పూర్తి చేయచ్చు అని చెప్పుకొచ్చారు. అయితే ఇలా పంపిణీ చేసేందుకు గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శలను వినియోగించుకోవచ్చని చెప్పారు. అయితే పల్లెల్లో ఇంటింటికి పింఛన్ పంపిణీ సులభంగానే ఉంటుంది. కానీ పట్టణాలు, నగరాల్లో మాత్రం ఇలా ఇంటింటికి పింఛను పంపిణీ చేయడం కాస్త కష్టం అంటూ అభిప్రాయపడ్డారు. పట్టణాలు, నగరాల్లో పింఛను పంపిణీని గ్రామ/వార్డు సచివాలయాల వద్ద చేయాలి అనుకుంటే దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పుడు వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేసేందుకు వీలు లేదు. చంద్రబాబు కుట్ర నేపథ్యంలో అందిన ఫిర్యాదు ద్వారానే ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీని ఇంటింటికి తిరిగి సచివాలయ ఉద్యోగులు చేస్తారా? గతంలో మాదిరి ఒకే దగ్గర లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తారా? అనే విషయాలపై పూర్తిస్థాయి స్పష్టత రావాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. కలెక్టర్లతో సమావేశం అనతంరం పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏపీ సీఎస్ మార్గదర్శకాలను ఇవాళ రాత్రికి సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. కాబట్టి మంగళవారం ఉదయానికి పింఛన్ల పంపిణీపై స్పష్టత వస్తుంది. పూర్తిస్థాయి వివరాలు అందుతాయని చెప్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి