iDreamPost

వేసవికాలంలో ట్యాంక్‌ ఫుల్‌ చేస్తే బైక్‌ పేలుతుందా.? ఇందులో నిజమెంత

  • Published Mar 30, 2024 | 4:35 PMUpdated Mar 30, 2024 | 4:35 PM

సోషల్ మీడియా అనేది అందుబాటులో ఉండటంతో.. ఎక్కడ ఏ వింతలైన క్షణాల్లో వైరల్ అయిపోతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా వేసవి కాలంలో పెట్రోల్ ఫుల్‌ ట్యాంక్‌ చేసుకుంటే ప్రమాదమని ఓ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.

సోషల్ మీడియా అనేది అందుబాటులో ఉండటంతో.. ఎక్కడ ఏ వింతలైన క్షణాల్లో వైరల్ అయిపోతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా వేసవి కాలంలో పెట్రోల్ ఫుల్‌ ట్యాంక్‌ చేసుకుంటే ప్రమాదమని ఓ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.

  • Published Mar 30, 2024 | 4:35 PMUpdated Mar 30, 2024 | 4:35 PM
వేసవికాలంలో ట్యాంక్‌ ఫుల్‌ చేస్తే బైక్‌ పేలుతుందా.? ఇందులో నిజమెంత

ప్రస్తుతం సోషల్ మీడియా అనేది అందుబాటులో ఉండటంతో.. దీని విస్తృతి కూడా బాగా పేరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్న క్షణాల్లో ఆప్డేట్ అయిపోతుంది. అలాగే ఎక్కడ కని, విని ఏరగని వింతలు, విడ్డూరాలను కూడా రోజుకొకటి ఈ సోషల్ మీడియా అనేది మోసుకొస్తుంది. అయితే వీటిలో ఎంత వరకు ఏది నిజమో.. ఏది అబద్దమో కూడా తెలియడం లేదు. కానీ, కొంతమంది మాత్రం ఈ సోషల్ మీడియాలో వచ్చిన పుకారులను గుడ్డిగా నమ్మేస్తుంటారు. అయితే మరి కొందరూ మాత్రం వైరల్ అవుతున్న విషయాల్లో ఎంతవరకు వాస్తవమైనది కాదని కొట్టి పారేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో వార్త పుట్టుకొచ్చి.. నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అది ఏమిటంటే.. వేసవి కాలంలో పెట్రోల్ ఫుల్‌ ట్యాంక్‌ చేసుకుంటే ప్రమాదమని ఓ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.

సాధారణంగా చాలామంది ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. లేక ముందస్తు జాగ్రత్తగా పెట్రోల్ ను ఫుల్‌ ట్యాంక్‌ చేస్తుంటారు. కానీ ఈ వేసవి కాలంలో మాత్రం బైక్‌లో ట్యాంక్‌ ఫుల్‌ చేస్తే ట్యాంక్‌లో పేలుడు సంభవించే అవకాశం ఉంటుందని వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుంది. అంతేకాకుండా..ఇండియన్‌ ఆయిల్ పేరుతో ఓ నోటీస్‌ సర్క్యూలేట్ అవుతోంది. పైగా అందులో బైక్‌లో పెట్రోల్‌ ఫుల్‌ ట్యాంక్‌ చేసుకుంటే ప్రమాదమని.. అందుకనే సగం ట్యాంక్‌ను మాత్రమే నింపాలని అందులో పేర్కాన్నారు.అలాగే పెట్రోల్‌ ట్యాంక్‌లో ఉన్న గ్యాస్‌ అనేది బయటకు వెళ్లేందుకు.. అప్పుడప్పుడు పెట్రోల్‌ ట్యాంక్‌ క్యాప్‌ను ఓపెన్ చేసి ఉంచాలంటూ ఆ నోటీస్ లో తెలిపారు. కాగా, ఇప్పటి వరకు బైక్ లో పెట్రోల్‌ ను పరిమితికి మించి నింపడం వల్ల ఐదు ప్రమాదాలు జరిగాయని, కాబట్టి ఈ సందేశాన్ని అందరికీ షేర్‌ చేయండి అంటూ సదరు మెసేజ్‌లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీస్ అనేది ఇండియన్ ఆయిల్‌ లోగోతో ఉండడంతో.. అంతా నిజమే అనుకుంటూ వెంటనే వాట్సాప్‌ గ్రూప్‌లలో ఫార్వర్డ్‌ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Does the bike explode if the tank is full

అయితే ఈ విషయం పై ఇండియన్‌ ఆయిల్ అధికారికంగా స్పందించింది. అలాగే ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ.. ఈ పుకారులను ఖండిస్తూ ఓ ప్రటకన విడుదల చేసింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇండియన్ ఆయిల్ సంస్థ తేల్చి చెప్పేసింది. అంతేకాకుండా.. బైక్స్‌లో పెట్రోల్‌ నింపే విషయంలో ఎలాంటి నిబంధనలు లేవని స్పష్టం చేసింది. అలాగే బైక్ లో పెట్రోల్ ను ఫుల్‌ ట్యాంక్‌ చేయడంలో వేసవి, వింటర్ అని సీజన్స్ తో తేడా లేదని తెలిపారు. ఇక పెట్రోల్ ను ఫుల్‌ ట్యాంక్‌ చేయడం వల్ల ఎలాంటి నష్టం జరగదని కాబట్టి నెట్టింట వైరల్ అవుతోన్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం లేదని, కనుక వాటిని ఎవ్వరూ గుడ్డిగా నమ్మవద్దంటూ తెలిపారు. మరి, సోషల్ మీడియాలో పెట్రోల్ ఫుల్‌ ట్యాంక్‌ చేసుకుంటే ప్రమాదమని పుకార్లు వైరల్ అవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి