iDreamPost

లాంగ్ వీకెండ్‌లో డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏ సినిమాలు వాచ్ చేయొచ్చు?

థియేట‌ర్ వ‌ద్ద‌నుకొంటే, మీరు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ చేయద‌గిన‌ సినిమాల లిస్ట్...మీ కోసం

థియేట‌ర్ వ‌ద్ద‌నుకొంటే, మీరు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ చేయద‌గిన‌ సినిమాల లిస్ట్...మీ కోసం

లాంగ్ వీకెండ్‌లో డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏ సినిమాలు వాచ్ చేయొచ్చు?

ఈ వీకెండ్ లో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అల్ రెడీ బింబిసార‌, సీతారామం సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్.  .

డే షిఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ Day Shift, Netflix
డే షిఫ్ట్ అనేది శాన్ ఫెర్నాండో వ్యాలీ ప్రాంతంలో పూల్ క్లీనర్‌గా, తన కూతురికి మంచి జీవితం అందించ‌డానికి అందించడానికి కష్టపడి పనిచేసే తండ్రి గురించిన యాక్షన్ అడ్వెంచర్ సినిమా. కాని అత‌నికి మంచి జీతం ఇచ్చే వేరే వృత్తి ఉంది. అత్యంత రహస్యమైన‌ అంతర్జాతీయ బృందంతో క‌ల‌సి రక్త పిశాచులను పరిశోధించడం, వేటాడడం.


ఫాస్ట్ ఫ్యూరియస్ 9: ది ఫాస్ట్ సాగా Fast Furious 9: The Fast Saga, Amazon Prime Video
2021లో తిరిగి థియేటర్లలో విడుదలైంది, ఫాస్ట్ & ఫ్యూరియస్: ది ఫాస్ట్ సాగా ఎట్టకేలకు ప్రైమ్ వీడియోలో వచ్చింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో, డోమ్ టోరెట్టో టీంను ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ యాక్షన్ సన్నివేశాల‌తో, పాత స్నేహితుల‌తో క‌ల‌సి కొత్త శత్రువును ఎదుర్కొంటాడు.

ది గ్రే మ్యాన్ The Gray Man, Netflix
ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్ ది గ్రే మ్యాన్ నటించిన యాక్షన్ సినిమా ఇది. CIAలో డేంజ‌ర‌స్ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. అత‌ను ఎక్క‌డివాడో ఎవ‌రికీ తెలియ‌దు. అనుకోకుండా చీకటి ఏజెన్సీ రహస్యాలు అత‌ని చేతిలోప‌డ‌తాయి. వాటికోసం మ‌రో ఏజెంట్ హీరో తలకు వెల‌క‌డ‌తాడు. అంతే…అంత‌ర్జాతీయంగా అత‌నికోసం వేట మొద‌ల‌వుతుంది.

రాకెట్రీ, Rocketry, Amazon Prime Video
రాకెట్రీ , భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థమాజీ శాస్త్రవేత్త, ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందించబడిన బ‌యోపిక్ డ్రామా. ఇస్రో గూఢచర్యం కేసులో ఇరుక్కొని, త‌ర్వాత‌ నిర్దోషిగా బైట‌కొస్తాడు. జూలై 26న సినిమా స్ట్రీమింగ్ కానుంది.
What movies to watch on Disney+ Hotstar, Netflix, Amazon Prime Video during the long weekend
కుంగ్ ఫూ పాండా: ది డ్రాగన్ నైట్, నెట్‌ఫ్లిక్స్ Kung Fu Panda: The Dragon Knight, Netflix
వీకెండ్ లో మంచి యానిమేషన్ మూవీని చూడాల‌న్న మూడ్‌లో ఉంటే Kung Fu Pand: The Dragon Knight స‌రైన ఛాయిస్. కుంగ్ ఫూ పాండా సిరీస్ నాలుగో పార్ట్ లో, మాయా ఆయుధాలను క‌నిపెట్టి రక్షించడానికి, త‌న‌పేరును నిల‌బెట్టుకోవ‌డానికి ఒక ఎలైట్ నైట్‌తో పో జట్టుకడ‌తాడు. ప్ర‌పంచాన్ని రక్షిస్తాడు.

గుడ్‌లక్ జెర్రీ Goodluck Jerry, Disney Plus Hotstar
ఇది కామెడీ క్రైమ్. తమిళ చిత్రం కొలమావు కోకిల రీమేక్, ఇది కొకైన్ స్మగ్లింగ్ లో చిక్కుకున్న ఒక అమాయక అమ్మాయి కథను చెబుతుంది. జాన్వీ కపూర్, దీపక్ డోబ్రియాల్, సాహిల్ మెహతాలాంటి స్టార్లుఉన్నారు.
Which movies can be watched on Amazon Prime Video
ఫెంటాస్టిక్ బీస్ట్స్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్డోర్ Fantastic Beasts: The Secrets of Dumbledore, Amazon Prime Video
ఏప్రిల్ 8న సినిమా థియేటర్లలో విడుదలైంది, ఇది ఫెంటాస్టిక్ బీస్ట్స్ సిరీస్‌లో మూడోది. ఈ సినిమాలో మాంత్రిక ప్రపంచంపై ప‌ట్టు సాధించాల‌నుకొనే ప‌వ‌ర్ ఫుల్, చీకటి మాంత్రికుడు గెల్లెర్ట్ గ్రిండెల్‌వాల్డ్ ప్ర‌య‌త్నాన్ని ఆప‌డానికి ప్రొఫెసర్ ఆల్బస్ డంబుల్‌డోర్ ప్ర‌య‌త్నిస్తాడు. ఒంటరిగా ఆపలేకపోతాడు. అందుకే మాంత్రికులు, మంత్రగత్తెల టీంకు నాయకత్వం వహించే బాధ్య‌త‌ను మాజిజులజిస్ట్ న్యూట్ స్కామాండర్‌కు అప్పగిస్తాడు.

జగ్ జగ్ జియో, Jug Jugg Jeeyo, Amazon Prime Video
జగ్ జగ్ జియో Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. రెండు త‌రాల‌కు చెందిన ఇద్ద‌రు క‌పుల్స్ పెళ్లి, విడాకులు, ఒక‌రిమీద మ‌రొక‌రికి న‌మ్మ‌కంలేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు.

లైట్ ఇయ‌ర్ Lightyear, Disney Plus Hotstar
Disney, Pixar’s Lightyear చివ‌ర‌కు Disney Plus Hotstarలో స్ట్రీమ్ అవుతోంది. లెజెండరీ స్పేస్ రేంజర్ బజ్ లైట్‌ఇయర్ ఇజ్జీ, మో, డార్బీ, అతని రోబోట్ సహచరుడు సాక్స్‌లతో కలిసి నక్షత్రమండలాల మద్య సాహసయాత్ర గురించిన సినిమా ఇది. తమిళం, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మలయాళంలో అందుబాటులో ఉంది. ఫ్యామిలీ మొత్తం క‌ల‌సి చూడాల్సిన సినిమా.

Dune, Amazon Prime Video
Amazon Prime Videoలో డ్యూన్ స్ట్రీమ్ అవుతోంది. ఇదో మోడ‌ర్న్ క్లాసిక్. గొప్ప ల‌క్ష్యం కోసం పుట్టిన ఒక కుర్రాడి గురించిన క‌థ ఇది. త‌న ప్ర‌జ‌ల బాగుకోసం ఈ విశ్వంలో దూరంలో ఉన్న ప్ర‌మాద‌క‌ర గ్ర‌హానికి వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. బెస్ట్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో స‌హా ప‌ది ఆస్కార్స్ ను గెల్చిన సినిమా ఇది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి