iDreamPost

OTTలో బెస్ట్ కొరియన్ థ్రిల్లర్! టెన్షన్ తట్టుకోలేని వాళ్ళు అస్సలు చూడకండి!

OTT Suggestions- Best Korean Thriller: ఓటీటీలో ఇప్పుడు చాలామంది కొరియన్ డ్రామాలకు బాగా అలవాటు పడ్డారు. అలాంటి వాళ్లు దాదాపు లవ్ స్టోరీలు చూస్తున్నారు. కానీ, ఈ థ్రిల్లర్ ఒకసారి చూస్తే వావ్ అంటారు.

OTT Suggestions- Best Korean Thriller: ఓటీటీలో ఇప్పుడు చాలామంది కొరియన్ డ్రామాలకు బాగా అలవాటు పడ్డారు. అలాంటి వాళ్లు దాదాపు లవ్ స్టోరీలు చూస్తున్నారు. కానీ, ఈ థ్రిల్లర్ ఒకసారి చూస్తే వావ్ అంటారు.

OTTలో బెస్ట్ కొరియన్ థ్రిల్లర్! టెన్షన్ తట్టుకోలేని వాళ్ళు అస్సలు చూడకండి!

ప్రస్తుతం ఓటీటీల ప్రభావం పెరిగిన తర్వాత అంతా కూడా కొరియన్ డ్రామాలు చూసేందుకు తెగ ఇష్టపడుతున్నారు. లవ్ కావచ్చు, డ్రామా కావచ్చు, క్రైమ్ థ్రిల్లర్స్ కావచ్చు.. జానర్ ఏదైనా కూడా కొరియన్ కథలు, సినిమాలకు బాగా అలవాటు పడ్డారు. చాలామంది తెలుగు వర్షన్, హిందీ వర్షన్ లేకపోయినా కూడా కొరియన్ ల్యాంగ్వేజ్ లోనే చూసేస్తున్నారు. చాలా మంది కొరియన్ డైలాగులు కూడా చెప్పేస్తున్నారు. మన ఆడియన్స్ కి కొరియన్ సినిమాలు అంతగా ఎక్కేస్తున్నాయి. అలాంటి ఆడియన్స్ కోసం ఓటీటీ సజీషన్స్ లో భాగంగా ఒక అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఈ మూవీని మీరు ఇప్పటి వరకు చూడ కపోతే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ ని మిస్ అయినవాళ్లు అవుతారు.

సాధారణంగా కొరియన్ సినిమా అనగానే అలవాటు పడిన వాళ్లు మన భాషలో ఉన్నా లోకపోయినా చూసేస్తూ ఉంటారు. కానీ, ఇప్పుడు చెప్పుకునే ఈ కొరియన్ మూవీ, ఇంగ్లీష్ లో మాత్రమే కాదు.. తెలుగు, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి కొరియన్ మూవీ లవర్స్ కి ఇది సూపర్ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ మూవీ పేరు ‘మిడ్ నైట్’. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. సబ్ స్క్రిప్షన్ లేకపోతే యూట్యూబ్ లో బై/రెంట్ బేసిస్ లో కూడా చూడచ్చు. తల్లీ కూతురు, అన్నాచెల్లెళ్లు ఈ నలుగురి జీవితాల్లో జరిగే కథే ఈ మిడ్ నైట్ మూవీ.

Mid night

నిజానికి ఇది పెద్ద కథ కాదు. ఒక రాత్రి పూట ఈ నలుగురి జీవితాల్లో ఏం జరిగిందో చాలా చక్కగా.. అద్భుతంగా తెరకెక్కించారు. సాఫీగా సాగిపోతున్న వీళ్ల జీవితాల్లోకి ఒక సీరియల్ కిల్లర్ ఎంటర్ అవుతాడు. అసలు అతనికి వీళ్లకి ఉన్న పగ ఏంటి? అతను వీళ్లని ఎందుకు టార్గెట్ చేశాడు. వీళ్లని చంపాలి అనే కక్ష ఎందుకు ఏర్పడింది? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్తారు. ఈ మూవీలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. తల్లీకూతుళ్లు ఇద్దరికీ మాటలు రావు, చెవులు వినిపించవు. కానీ, ఒక సీరియల్ కిల్లర్ ని ఎదిరించి వారి ప్రాణాలను కాపాడుకునే సీన్స్ మెప్పిస్తాయి.

మాటలు రాకపోయినా.. చెవులు వినిపించకపోయినా వాళ్లిద్దరు పోరాడే తీరు అందరినీ మెప్పిస్తుంది. అలాగే అన్నాచెల్లెళ్లు, తల్లీకూతుళ్లు మధ్య బాండింగ్ కూడా ఆకట్టుకుంటుంది. కాస్త ఎమోషనల్ కూడా చేస్తుంది. ఈ మూవీలో ఉండే మెయిన్ పాయింట్ క్రైమ్.. ఒక సీరియల్ కిల్లర్ యథేచ్చగా హత్యలు చేస్తుండటం కాస్త కంగారు పెట్టే అంశమే. అలా నిర్దాక్షిణ్యంగా హత్యలు చేసే స్మార్ట్ కుర్రాడితో ఈ నలుగురు చేసే పోరాటాన్ని మాత్రం తప్పక చూడాల్సిందే. ముఖ్యంగా ఈ మూవీ స్క్రీన్ ప్లే మీకు బాగా నచ్చుతుంది. పెద్ద కథ కూడా కాదు. ఒక రాత్రి జరిగిన విషయాలను, వారి జీవితాలను, వారి కోరికలను, వారు కన్న కలలను చాలా సింపుల్ వేలో చూపిస్తూ వెళ్లిపోయారు. మలయాళం డ్రామాలు ఇష్టపడే వారికి ఈ మిడ్ నైట్ మూవీ విపరీతంగా నచ్చుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి