iDreamPost

OTT Suggestions: మీకు డాక్యుమెంటరీస్ ఇష్టమా? అయితే..OTTలో ఉన్న దీన్ని అస్సలు మిస్ కావద్దు!

  • Published Apr 22, 2024 | 8:35 PMUpdated Apr 26, 2024 | 6:20 PM

ఓటీటీ లలో వచ్చే సినిమాలు, సిరీస్ లకు లభించే ఆదరణ ఒక రకంగా ఉంటే.. డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కు లభించే ఆదరణ మరోలా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

ఓటీటీ లలో వచ్చే సినిమాలు, సిరీస్ లకు లభించే ఆదరణ ఒక రకంగా ఉంటే.. డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కు లభించే ఆదరణ మరోలా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

  • Published Apr 22, 2024 | 8:35 PMUpdated Apr 26, 2024 | 6:20 PM
OTT Suggestions: మీకు డాక్యుమెంటరీస్ ఇష్టమా? అయితే..OTTలో ఉన్న దీన్ని అస్సలు  మిస్ కావద్దు!

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఉండే సినిమాలు, సిరీస్ లు అన్ని కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. అయితే వీటన్నిటితో పాటు కొన్ని డాక్యుమెంటరీస్ సిరీస్, మూవీస్ చూడడానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు. అలా ఇప్పటివరకు వచ్చిన ఎన్నో డాక్యుమెంటరీ ఫిల్మ్స్, సిరీస్ లను ప్రేక్షకులు ఆదరించారు. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే ఒక డాక్యుమెంటరీని మిస్ అయ్యి ఉంటె మాత్రం ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. ఈ స్టోరీ ప్లాట్ కామన్ అయినా కూడా.. ఇది రూపొందించిన తెరకెక్కించిన విధానం మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. మరి ఇంతకీ ఈ డాక్యుమెంటరీ దేనికి సంబంధించింది, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ డాక్యుమెంటరీ పేరు “టు కిల్ ఏ టైగర్”. ఈ డాక్యుమెంటరీ ఆస్కార్ నామినేషన్స్ లో కూడా సెలెక్ట్ అయింది, పైగా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కు ప్రముఖ నటి ప్రియాంక చోప్రా.. ఎక్సిక్యూటువే ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ మూవీ కి పహుజా దర్శకత్వం వహించారు. దీనిని కెనడాలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించారు. ఈ డాక్యుమెంటరీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. తమ కుమార్తెకు జరిగిన ఒక అన్యాయానికి.. న్యాయం జరిపించడానికి ఒక తండ్రి పడే ఆవేదన.. అతను చేసే పోరాటం ఎలా ఉంటుంది అనే కథాంశంతో.. తెరకెక్కించారు. ఈ సినిమాలో నిజంగా టైగర్ ఉంటుందా అంటే.. ఇక్కడ ఆ అన్యాయం చేసిన వారిని టైగెర్స్ గా భావించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో .. తెలుగు లాంగ్వేజ్ లో అందుబాటులో ఉంది.

ఒక సెన్సిటివ్ కంటెంట్ ను డీల్ చేసిన విధానం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పి తీరాలి. పైగా టు కిల్ ఏ టైగర్ డాక్యుమెంటరీ చిత్రం.. 96 వ ఆస్కార్ అవార్డ్స్ లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ నామినేషన్స్ కు కూడా సెలెక్ట్ అయింది. సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం.. ఓ మంచి సర్వైవల్ థ్రిల్లర్ మిస్ అయినట్లే.. సమాజంలో నిత్యం ఎంతో మంది ఆలపిల్లలు అన్యాయాలకు గురి అవుతున్నారు. వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అలాంటి వారందరి తరపున ఓ తండ్రి చేసిన పోరాటమే ఈ సినిమా.. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి