iDreamPost

OTT Best Movie Suggestion: OTTలో ఓ ఇంటర్వ్యూ చుట్టూ సూపర్ సినిమా! ఇది ఒకే ఒక్కడు మూవీని మించి!

  • Published May 28, 2024 | 6:12 PMUpdated May 28, 2024 | 6:12 PM

కొన్ని వెబ్ సిరీస్ లు కానీ సినిమాలు కానీ ఎవరైనా సజ్జెస్ట్ చేసినప్పుడు .. అర్రే ఇలాంటి కంటెంట్ ఎలా మిస్ చేశాము అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమానే . మరి ఈ సిరీస్ మీరు మిస్ చేసిన వాటిలో ఉందేమో ఓ లుక్ వేసేయండి.

కొన్ని వెబ్ సిరీస్ లు కానీ సినిమాలు కానీ ఎవరైనా సజ్జెస్ట్ చేసినప్పుడు .. అర్రే ఇలాంటి కంటెంట్ ఎలా మిస్ చేశాము అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమానే . మరి ఈ సిరీస్ మీరు మిస్ చేసిన వాటిలో ఉందేమో ఓ లుక్ వేసేయండి.

  • Published May 28, 2024 | 6:12 PMUpdated May 28, 2024 | 6:12 PM
OTT Best Movie Suggestion: OTTలో ఓ ఇంటర్వ్యూ చుట్టూ సూపర్ సినిమా! ఇది ఒకే ఒక్కడు మూవీని మించి!

ఓటీటీ వరల్డ్ లో లెక్క లేనంత కంటెంట్ ఉంది. దీనితో ఒక్కోసారి ప్రేక్షకులు కొన్ని సినిమాలను, సిరీస్ లను మిస్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతా ఆ సినిమాకు లేదా సిరీస్ కు సంబంధించిన సీన్స్ సోషల్ మీడియాలో ఎక్కడైనా చూసినప్పుడు.. దాని గురించి సెర్చ్ చేసేస్తూ ఉంటారు. లేదాయే కొన్ని వెబ్ వెబ్ సిరీస్ లు కానీ సినిమాలు కానీ ఎవరైనా సజ్జెస్ట్ చేసినప్పుడు .. అర్రే ఇలాంటి కంటెంట్ ఎలా మిస్ చేశాము అని ఫీల్ అవుతూ ఉంటారు. వెంటనే వాటి గురించి కూడా ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ఉన్నాయా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ వెబ్ సిరీస్ ఏ. మరి ఈ సినిమా ఏంటో ఏ ఓటీటీ లో ఉందో.. మీరు మిస్ చేసిన లిస్ట్ లో ఈ వెబ్ సిరీస్ ఉందో లేదో ఓ లుక్ వేసేయండి.

ఇది ఒక యదార్ధ సంఘటన.. 2019 నాటి ఓ బ్రిటిష్ బ్రాడ్ క్యాస్టింగ్ కార్పొరేషన్ (BBC) ఇంటర్వ్యూని ఆధారంగా తీసుకుని.. విడుదలైన మూవీ ఇది. 2010 లో న్యూయార్క్ సిటీలో డ్యూక్ ఆఫ్ యార్క్ ప్రిన్స్ ఆండ్రు, జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే అతనితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నపుడు ఓ ఫోటోగ్రాఫర్ వెంటపడి మరి ఫోటోలు తీస్తాడు. డ్యూక్ ఆఫ్ యార్క్ అనేది బ్రిటన్ ప్రభువుల బిరుదు. కట్ చేస్తే 2019 లండన్ లో BBC లో న్యూస్ నైట్ ప్రోగ్రాం ఎడిటర్ సామ్ మెక్ అలిస్టర్.. పేపర్ లో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ప్రిన్స్ ఆండ్రూ స్పాన్సర్ చేసిన.. యంగ్ ఎంట్రప్రెన్యూవర్స్ ఈవెంట్ లోని ఫొటోస్ పక్కన.. 2010 లో తీసిన ఆ ఫోటోను చూస్తుంది. జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే వ్యక్తి న్యూయార్క్ లో ఒక సె*క్స్ ట్రాఫికర్.. దానికోసం అందమైన అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉంటాడు, ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తాడు. పైగా అమెరికాలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులలో అతను ఒకడు.

దీనితో అతనిపై అన్ని నేరాలు, కేసులు నమోదు అయినా కానీ.. వారు చాలా కాలం పాటు స్నేహితులుగా ఉన్నట్లు.. ఆ ఫోటో ద్వారా సామ్ కు అర్ధమౌతుంది. దీనితో కష్టపడి ఆ ఫోటోగ్రాఫర్ ను కాంటాక్ట్ అయ్యి.. జెఫ్రీ ఎప్‌స్టీన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు రాబడుతుంది. ఈ క్రమంలో ఆమెకు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఇంటికి వస్తూ పోతు ఉన్న చాలా మంది మైనర్ బాలికల ఫోటోలు దొరుకుతాయి. దీనితో ఎలాగైనా ప్రిన్స్ ఆండ్రుని ఈ విషయంపైన ఇంటర్వ్యూ చేయాలనీ అనుకుంటూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కోసం ప్రిన్స్ ను అడుగగా అతను ఆ ఇంటర్వ్యూకి అంగీకరించడు. కట్ చేస్తే.. అటు న్యూయార్క్ లో జెఫ్రీ ఎప్‌స్టీన్ అరెస్ట్ అవ్వడం.. జైల్లో అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోతాయి.

దీనితో అతనికి సంబంధించిన విషయాలతో పాటు.. ప్రిన్స్ ఆండ్రు కు సంబంధించిన రహస్యాలు కూడా బయటపడతాయి. వర్జీనియా అనే ఓ అమ్మాయి ప్రిన్స్ తనను వేధించారని విషయాన్నీ బయటపెడుతోంది. దీనితో ప్రిన్స్ ఆండ్రు సామ్ కి ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఇంటర్వ్యూ లో ఆండ్రు ఏం చెప్పాడు ? 2010 లో జెఫ్రీ ఎప్‌స్టీన్ ను ఎందుకు కలిసాడు ? వర్జీనియా చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందించాడు ? ఆ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత అతని పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే “స్కూప్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పైగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి