iDreamPost

OTT Movie: శాడిస్ట్ భర్త ఉన్న ప్రతి భార్య చూడాల్సిన సినిమా! OTTని దున్నేస్తుంది!

  • Published Apr 17, 2024 | 5:32 PMUpdated Apr 26, 2024 | 6:27 PM

ఓటీటీలోకి వచ్చే సినిమాలంటిలో ఏ సినిమా చూడడం బెస్ట్ అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం ఈ మూవీ సజ్జెషన్. ఓటీటీ మంచి మలయాళీ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అయిపోతుంది. ఆ సినిమా వివరాలేంటో చూసేద్దాం.

ఓటీటీలోకి వచ్చే సినిమాలంటిలో ఏ సినిమా చూడడం బెస్ట్ అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం ఈ మూవీ సజ్జెషన్. ఓటీటీ మంచి మలయాళీ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అయిపోతుంది. ఆ సినిమా వివరాలేంటో చూసేద్దాం.

  • Published Apr 17, 2024 | 5:32 PMUpdated Apr 26, 2024 | 6:27 PM
OTT Movie: శాడిస్ట్ భర్త ఉన్న ప్రతి భార్య చూడాల్సిన సినిమా! OTTని దున్నేస్తుంది!

వందల కొద్దీ సినిమాలు, సిరీస్ లు ఉన్న ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఏ సినిమా బావుంటుందో.. ఏ సినిమా చూస్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతామో అనే డైలమాలో ఉంటూ.. ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది మాత్రం జస్ట్ ట్రైలర్ కానీ, పోస్టర్ కానీ చూసేసి ఈ సినిమాలో ఏముందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ, ఆ సినిమాను పూర్తిగా చూస్తే తప్ప అర్ధం కాదు. ఆ సినిమా వర్త్ వాచింగ్ అని. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఇలా చాలా మంది చాలా సినిమాలను మిస్ చేసి ఉంటారు. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా మీరు మిస్ చేసిన లిస్ట్ లో ఉన్నట్లయితే .. ఆలస్యం చేయకుండా వెంటనే చూడాల్సిందే. అది ఒక మలయాళీ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి ఆ సినిమా ఏంటో.. ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందో.. అసలు వర్త్ వాచింగ్ అవునా కదా అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ఎంత కాదు అనుకున్న మలయాళీ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో ఎన్నో మలయాళీ సినిమాలకు ఫిదా అయిన తెలుగు సినీ ప్రియులు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాకు కూడా ఫిదా అయిపోతారు. ఆ సినిమా మరేదో కాదు “జయ జయ జయ జయ హే”. ఈ సినిమాకు విపిన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువతి జయ. ఆమె తన చదువును పూర్తి చేసుకుని.. స్వతంత్రంగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటుంది.అలానే ఇంటర్ లో మంచి మార్కులు తెచ్చుకుని.. మంచి కాలేజ్ లో సీట్ వచ్చినా కానీ.. ఇంట్లో తల్లిదండ్రులు నిరాకరించడంతో ఊరిలో ఉండే ఒక కాలేజ్ లోనే జాయిన్ అవుతుంది. ఈ క్రమంలో అదే కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్న ఒక అతినిని ప్రేమిస్తుంది. కానీ అతను ,మాత్రం అయిన దానికి కానీ దానికి జయను అనుమానిస్తూ.. అవమానిస్తూ ఉండేవాడు. ఇంతలో ఈ విషయం కాస్త జయ ఇంట్లో తెలిసిపోతుంది.

దీనితో జయ తల్లిదండ్రులు ఆమెకు వెంటనే ఒక వ్యక్తితో వివాహం నిశ్చయిస్తారు. అతను మొదట్లో జయను బాగానే చూసుకున్నా కానీ.. రోజులు గడిచే కొద్దీ.. ఆమెపై చేయి చేసుకోటం.. తిట్టడం లాంటివి చేస్తూ ఉండేవాడు. అటు తల్లిదండ్రులకు తన ఇబ్బందులను చెప్పినా కూడా.. ఆమెను సర్దుకుపొమ్మని సలహా ఇచ్చేవారు. అయితే ఈ సినిమాలో ట్విస్ట్ ఏంటంటే.. ఉన్నట్టుండి ఒక రోజు జయ తన భర్తకు ఎదురుతిరిగి కొడుతుంది. అప్పటివరకు సైలెంట్ గా ఉన్న అమ్మాయి.. ఒకేసారి ఇంత బలంగా ఎలా కొట్టిందన్న సంగతి అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతను కూడా ఎలాగైనా సరే భార్యపై రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు. అసలు జయ ఇంత స్ట్రాంగ్ గా మారడానికి గల కారణం, ఏమై ఉంటుంది ! ఆమె భర్త ఆగడాల నుంచి తనను తానూ ఎలా రక్షించుకుంది ! ఆమె భర్త కూడా ఆమెపై రివెంజ్ తీర్చుకున్నాడా లేదా ! చివరికి వీరు కలిసి ఉన్నారా లేదా విడిపోయారా ! ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం.. ఒక వర్త్ వాచింగ్ ఫిల్మ్ మిస్ అయినట్లే. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి