iDreamPost

OTT Suggestion: జీవితంలో గెలవాలనుకునే వారు ఖచ్చితంగా OTT లో ఉన్న ఈ సిరీస్ చూడండి..

  • Published Apr 26, 2024 | 7:51 PMUpdated Apr 26, 2024 | 8:13 PM

ఎప్పుడు లవ్ , రొమాన్స్, హర్రర్ చిత్రాలే కాకుండా కొన్ని వేరే జోనర్ మూవీస్ కూడా ఉంటూ ఉంటాయి. ఆ సినిమాలు ఖచ్చితంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే.

ఎప్పుడు లవ్ , రొమాన్స్, హర్రర్ చిత్రాలే కాకుండా కొన్ని వేరే జోనర్ మూవీస్ కూడా ఉంటూ ఉంటాయి. ఆ సినిమాలు ఖచ్చితంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే.

  • Published Apr 26, 2024 | 7:51 PMUpdated Apr 26, 2024 | 8:13 PM
OTT Suggestion: జీవితంలో గెలవాలనుకునే వారు ఖచ్చితంగా OTT లో ఉన్న ఈ సిరీస్ చూడండి..

తెలుగులో అనేక సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కానీ కొన్ని కారణాల వలన ఆయా సినిమాలకు అంత బజ్ క్రియేట్ అవ్వదు. దీనితో మూవీ లవర్స్ కూడా ఈ సినిమాలను, సిరీస్ లను లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆ సినిమాలను చూస్తే మాత్రం ఈ సినిమాలనా మనం మిస్ చేసింది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ను మిస్ చేస్తే మాత్రం.. ఒక మంచి ఇన్స్పిరేషనల్ వెబ్ సిరీస్ మిస్ అయినట్లే.. అందులోను ఈ వెబ్ సిరీస్ తెలుగులో ఉంది. అసలే ఇప్పుడు అంతా వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుంది. మరి ఇంతకీ ఆ సిరీస్ ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాల గురించి చూసేద్దాం.

ఈ వెబ్ సిరీస్ పేరు “లూసర్”. ఇది తెలుగులో వచ్చిన మంచి వెబ్ సిరీస్ లలో ఒకటి. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్స్ గా వచ్చింది. ఈ సిరీస్ లో ప్రియదర్శి , శశాంక్, కల్పిక, అన్ని ప్రధాన పాత్రలో నటించాడు. ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్లు కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ లను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. గెలుపు ఓటములను ఏ విధంగా స్వీకరించాలి. అసలు ఓడిపోతే ఎలా నెగ్గుకురావాలి అనే విషయాలను ఈ వెబ్ సిరీస్ లో ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించారు మేకర్స్. జీవితంలో ఓడిపోతున్నాం అని బాధపడే ప్రతి ఒక్కరు చూడాల్సిన సిరీస్ ఇది. తెలుగులో వచ్చిన సిరీస్ లలో ఒక వర్త్ వాచింగ్ సిరీస్ అని చెప్పి తీరాలి.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. ఈ సిరీస్ కథ మొత్తం కూడా .. ప్రియదర్శి , శశాంక్, కల్పిక, అన్ని ఈ నలుగురు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రియదర్శి పెయింటింగ్ చూస్తూ డబ్బు డబ్బు దాచుకుని.. షూటింగ్ లో నేషనల్స్ గెలవాలని అనుకుంటాడు. శశాంక్ ఒక క్రికెటర్ కానీ తనకున్న యాటిట్యూడ్ కారణంగా ఒక కోచ్ గా మిగిలిపోతాడు. ఇక మిగిలిన ఇద్దరు కూడా బ్యాట్మెంటన్ ప్లేయర్స్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ, బ్యాంక్ జాబ్ చేస్తూ బ్రతికేస్తారు. వీళ్లంతా వారి వారి జీవితంలో అనుకున్నది ఎలా సాధించారు అనేది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. జీవితంలో గెలవాలని అనుకునే వారికి ఖచ్చితంగా స్ఫూర్తిని ఇస్తుంది ఈ సిరీస్. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి