iDreamPost
android-app
ios-app

Raayan OTT: ధనుష్ రాయన్ మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Jul 26, 2024 | 1:57 PMUpdated Jul 26, 2024 | 1:57 PM

కొత్త సినిమాలు థియేటర్స్ కు రావడం ఆలస్యం.. ఆ సినిమాలకు సంబంధించిన ఓటీటీ అప్ డేట్స్ వెంటనే వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ధనుష్ నటించిన రాయన్ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్ డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్త సినిమాలు థియేటర్స్ కు రావడం ఆలస్యం.. ఆ సినిమాలకు సంబంధించిన ఓటీటీ అప్ డేట్స్ వెంటనే వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ధనుష్ నటించిన రాయన్ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్ డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 26, 2024 | 1:57 PMUpdated Jul 26, 2024 | 1:57 PM
Raayan OTT: ధనుష్ రాయన్ మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఓటీటీ క్రేజ్ ఇప్పుడు ఎంత పెరిగిందంటే.. కొన్ని సినిమాలు ఇంకా థియేటర్స్ లో రిలీజ్ కాకముందే డిజిటల్ స్ట్రీమింగ్ డీల్ లో క్లోజ్ చేసుకుంటున్నాయి. ఇక కొన్ని సినిమాలు ఇలా థియేటర్స్ లోకి రావడం ఆలస్యం వెంటనే ఆ సినిమాలకు సంబంధించిన ఓటీటీ అప్ డేట్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ధనుష్ నటించిన ‘రాయన్’ మూవీ జూలై 26న తమిళంతో పాటు.. తెలుగులోనూ థియేటర్స్ లో రిలీజ్ అయింది. తెలుగులో ఈ మూవీ దాదాపు 550 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక సినిమా అలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ వచ్చేశాయి. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

ధనుష్ కెరీర్ లోనే ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇన్ని థియేటర్స్ లో రిలీజ్ అవ్వలేదు. ప్రస్తుతం అయితే, ఈ సినిమాలో ధనుష్ యాక్టింగ్ , డైరెక్షన్ తో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ కు కూడా మంచి మంచి మార్కులే పడుతున్నాయి. రివెంజ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ సన్ నెక్ట్ , నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, మలయాళం , కన్నడ , హిందీ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసురానున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్ లో రిలీజ్ అయినా.. నాలుగు నుంచి ఆరు వారల లోపు ఏ సినిమా అయినా.. ఓటీటీ లోకి వస్తుంది. ఈ సినిమా కూడా థియేట్రికల్ రన్ ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రాయాన్ సినిమా విషయానికొస్తే.. ధనుష్ కెరీర్ లో ఈ మూవీ 50 వ మూవీగా తెరకెక్కడం విశేషం. కాగా ఈ సినిమాలో ధనుష్ తో పాటు.. సందీప్‌కిష‌న్‌, ఎస్‌జే సూర్య‌, ప్ర‌కాష్ రాజ్, అప‌ర్ణ బాల‌ముర‌ళి లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. తన ఫ్యామిలీ మరణానికి కారణం అయినా వారిపై.. రాయన్ , అతని తమ్ముళ్లు ఎలా రివెంజ్ తీర్చుకున్నారు అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మరి రాయన్ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి