iDreamPost

OTT Movie Suggestion: పాకిస్థాన్ రెడ్ లైట్ ఏరియాలోని వేశ్యల కథ హీరామండి! OTTని షేక్ చేస్తున్న బో*ల్డ్ సిరీస్!

  • Published May 09, 2024 | 7:00 PMUpdated May 09, 2024 | 9:33 PM

ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు , సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సిరీస్ మాత్రం ఓటీటీ లో సంచలనం సృష్టిస్తుందని చెప్పి తీరాలి.. ఈ సిరీస్ ను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.

ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు , సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సిరీస్ మాత్రం ఓటీటీ లో సంచలనం సృష్టిస్తుందని చెప్పి తీరాలి.. ఈ సిరీస్ ను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.

  • Published May 09, 2024 | 7:00 PMUpdated May 09, 2024 | 9:33 PM
OTT Movie Suggestion: పాకిస్థాన్ రెడ్ లైట్ ఏరియాలోని వేశ్యల కథ హీరామండి!  OTTని షేక్ చేస్తున్న బో*ల్డ్ సిరీస్!

ఇప్పుడు సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో.. సిరీస్ లకు అంత కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే సిరీస్ లను కొన్ని ఎపిసోడ్స్ గా తీస్తూ ఉండడంతో.. ప్రతి ఎపిసోడ్ లోను ఆ తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ అందరికి నెలకుంటుంది. దీనితో ఈ మధ్య అందరు వెబ్ సిరీస్ లను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు ఓటీటీ లోకి వచ్చిన వెబ్ సిరీస్ లన్నీ ఓ ఎత్తైతే.. రీసెంట్ గా ఓటీటీ లోకి వచ్చిన వెబ్ సిరీస్ మరొక ఎత్తని చెప్పి తీరాలి. ఎందుకంటే ఓ భారీ బడ్జెట్ సినిమాకు కేటాయించినంత బడ్జెట్ తో ఈ సిరీస్ ను రూపొందించారు.. ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు. ఈ సిరీస్ ను మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక వర్త్ వాచింగ్ సిరీస్ ను మిస్ అయినట్లే. మరి ఆ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సిరీస్ పేరు మరేదో కాదు.. “హీరమండి :ది డైమండ్ బజార్“. మొదటి సారి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఓ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ కు ఎప్పుడు లేనట్లుగా.. భారీ బడ్జెట్ ను కేటాయించారు. సాధారణంగా సంజయ్ సినిమాలలో ఉండే సెట్స్ ఏ అందరిని ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. వెండితెరపైన అతని మ్యాజిక్ ను చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు బుల్లి తెరపై ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేశాడో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ను ఖచ్చితంగా చూడాల్సిందే. ప్రతి ఎపిసోడ్.. ప్రతి సీన్ కూడా ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ఏ ఒక్క ఎపిసోడ్ మిస్ అయినా కూడా ఖచ్చితంగా కథ మొత్తం మిస్ అయినట్లే. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అసలు ఏంటి ఈ హీరమండి.. ఎందుకు ఈ సిరీస్ చూడాలి అనే విషయానికొస్తే..

Heeramandi

హీరమండి కథ విషయానికొస్తే.. మల్లికా జాన్ అనే విలాసవంతమైన వేశ్య జీవితం చుట్టూ ఈ హిరామండి కథ కొనసాగుతుంది. ఇక్కడ షాహీ మహల్‌(వేశ్య గృహం)కు పెద్ద మల్లికా జాన్‌. వహీదా ఆమె సోదరి. మల్లికా జాన్‌‌కు ఇద్దరు కుమార్తెలు బిబోజాన్‌ , ఆలంజేబు. హిరామండిలోని మరో వేశ్య మహల్ ఖ్వాభాగ్ ఉంటుంది. దానికి ఫరీదాన్ పెద్ద. మల్లికా జాన్‌, ఫరీదాన్‌కు అస్సలు పడదు. అయితే మల్లికా జాన్‌ తన చిన్న కూతురు ఆలంజేబును వేశ్య వృత్తిలోకి దింపాలని చూస్తుంది. కానీ ఇందుకు కూతురు ఒప్పుకోదు. ఎందుకంటే ఆమె మరో నవాబ్ తో ప్రేమలో ఉంటుంది. ఈ విషయం ఇద్దరి ఇళ్లలో తెలుస్తుంది. ఇదంతా గమనిస్తున్న వహీదా తన అక్కకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటుంది.

అందుకోసం మల్లికా జాన్ శత్రువైన ఫరిదాన్ తో చేతులు కలుపుతుంది. ఇది ఇలా కొనసాగుతుంటే.. మరోవైపు మల్లికా జాన్ కూతురు బిబోజాన్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా.. స్వతంత్ర పోరాటంలో పనిచేస్తూ ఉంటుంది. అధికారులతో మంచి సంబంధం ఉన్న ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంటుంది. అతని సహాయంతో బ్రిటీషర్స్ రహస్యాలను తెలుసుకుని భారత స్వాతంత్య్ర ఉద్యమ నాయకులకు చేరవేస్తుంటుంది. వహీదా సాయంతో షాహీ మహల్‌కు కూడా పెద్ద కావడానికి ఫరీదాన్‌ పన్నిన కుట్రలేంటి? వాటిని మల్లికా జాన్ ఎలా తిప్పికొట్టింది? బిబోజాన్‌ గూఢచారి అని తెలుసుకున్న బ్రిటీషర్స్ ఆమెను ఏం చేశారు! ఆలంజేబు నవాబుతో ప్రేమాయణం ఎంతవరకు కొనసాగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి