iDreamPost
android-app
ios-app

OTT Best Series Suggestion: బిల్ గేట్స్‌ కు బాగా నచ్చిన వెబ్ సిరీస్! ఈ స్పై థ్రిల్లర్ ఏ OTTలో ఉందంటే?

  • Published May 28, 2024 | 2:08 PMUpdated May 28, 2024 | 2:08 PM

Bill Gates Recommended Series In OTT: కొన్ని సినిమాలు కానీ సిరీస్ లు కానీ కొంతమంది సజ్జెస్ట్ చేసేవరకు తెలియదు వాటిలో అంత మంచి కంటెంట్ ఉంటుందని. ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. పైగా ఈ వెబ్ సిరీస్ ప్రపంచ కుభేరుడు బిల్ గేట్స్ సజెస్ట్ చేశారట. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటో చూసేద్దాం.

ఇప్పుడు ఎలాగూ సమ్మర్.. బయట థియేటర్స్ లో పెద్దగా సినిమాలు ఏమి లేవు.. ఇక ఎండలు కూడా మండి పోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్న ఒకే ఒక్క ప్లాట్ ఫార్మ్ ఓటీటీ. ఇక ఇప్పుడు ఏ ఏ సినిమాలు , సిరీస్ లు ఎప్పుడెప్పుడు వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. కొన్ని సినిమాలు కానీ సిరీస్ లు కానీ కొంతమంది సజ్జెస్ట్ చేసేవరకు తెలియదు వాటిలో అంత మంచి కంటెంట్ ఉంటుందని. ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. పైగా ఈ వెబ్ సిరీస్ ప్రపంచ కుభేరుడు బిల్ గేట్స్ సజెస్ట్ చేశారట. మరి బిల్ గేట్స్ ను మెప్పించిన ఆ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

బిల్ గేట్స్ తన పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే.. బుక్స్ చదవడం, మంచి మంచి సినిమాలు, సిరీస్ లు చూడడం మాత్రం అసలు మిస్ చేయరు. పైగా కేవలం తానూ చదివి ఊరుకోవడమే కాకుండా.. ప్రతి ఏటా సమ్మర్ లో ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలాంటి మూవీస్, వెబ్ సిరీస్ చూడాలి అనే సజ్జెషన్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా బిల్ గేట్స్ ఓ వెబ్ సిరీస్ ను చూడాలని రికమెండ్ చేశారు. ఆ వెబ్ సిరీస్ మరేదో కాదు “స్లో హార్సెస్”. ఇదొక బ్రిటిష్ వెబ్ సిరీస్.. ఇప్పుడు ఎలాగూ అన్ని భాషల చిత్రాలను, వెబ్ సిరీస్ లను ఆదరిస్తూనే ఉన్నారు కాబట్టి.. ఈ వెబ్ సిరీస్ చూసేందుకు లాంగ్వేజ్ పెద్ద ప్రాబ్లమ్ కాదు, ఈ సిరీస్ ప్రస్తుతం ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ లో చూసేందుకు అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

మరి ఏకంగా ప్రపంచ కుభేరుడు బిల్ గేట్స్ నే మెప్పించిన ఈ సిరీస్ కథేంటి అని విషయానికొస్తే.. ఇప్పటివరకు ఎన్నో స్పై థ్రిల్లర్స్ చూసి ఉంటారు. ఇది కూడా ఓ రకంగా ఆ కోవకు చెందిన సిరీస్ ఏ. బ్రిటన్ సీక్రెట్ ఏజెన్సీ MI5 లో ఉన్నట్లు చూపించిన ఓ కల్పితమైన స్లేవ్ హౌస్ లో పని చేసే కొందరు అండర్ కవర్ ఏజెంట్స్ చుట్టూ ఈ సిరీస్ కథ కొనసాగుతూ ఉంటుంది. స్పై థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ బాగా నచ్చేస్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సిరీస్ ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. పైగా బిల్ గేట్స్ రికమెండ్ చేశారు కాబట్టి.. అసలు మిస్ చేయొద్దు. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి