iDreamPost

‘అనిత ఓ అనిత’ పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగరాజు.. ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?

  • Published Jun 10, 2024 | 10:40 PMUpdated Jun 10, 2024 | 10:40 PM

Anitha Singer Nagaraju: అనితా ఓ అనితా అంటూ తన పాటతో యావత్ యువతను కన్నీటి సముద్రంలో ముంచేసిన సింగర్ కమ్ లిరిక్ రైటర్ నాగరాజు ఇప్పుడు ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో తెలుసా?

Anitha Singer Nagaraju: అనితా ఓ అనితా అంటూ తన పాటతో యావత్ యువతను కన్నీటి సముద్రంలో ముంచేసిన సింగర్ కమ్ లిరిక్ రైటర్ నాగరాజు ఇప్పుడు ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో తెలుసా?

  • Published Jun 10, 2024 | 10:40 PMUpdated Jun 10, 2024 | 10:40 PM
‘అనిత ఓ అనిత’ పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగరాజు.. ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?

‘నా ప్రాణమా నను వీడిపోకుమా.. నీ ప్రేమలో నను కరగనీకుమా.. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది. వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది.. అనిత ఓ వనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా బీద ప్రేమ పైన’ అంటూ అప్పట్లో గుండెల్ని పిండేసే పాట ఒకటి తెగ వైరల్ అయ్యింది. లవ్ ఫెయిలైన ప్రతీ అబ్బాయి ఈ పాటనే తెగ వినేవారు. ఆ పాటను చాలా ఓన్ చేసుకున్నారు. పాట విని ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతలా తన గాత్రంతో ఏడిపించిన సింగర్ నాగరాజు మాత్రం సరైన అవకాశాలు లేక అక్కడిదే ఉండిపోయారు. కచ్చా బాదం అంటూ వచ్చే వాళ్ళకి బ్రేక్ ఇచ్చిన ఈ సోషల్ మీడియా ఈయనకు మాత్రం ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఇండస్ట్రీ కూడా సరిగా గుర్తించలేదు. మోస్ట్ అండర్ రేటెడ్ సింగర్ గా ఉండిపోయారు.

చిన్న చిన్న అవకాశాలు అయితే వస్తున్నాయి. పాట వచ్చిన పదేళ్ల వరకూ అనిత పాట పాడిన సింగర్ ఎలా ఉన్నారో ఏమైపోయారో ఎవరికీ తెలియదు. ఆ పాట తర్వాత మళ్ళీ నాగరాజు పేరు వినిపించలేదు. దాదాపు పదేళ్ల తర్వాత ఆయన మళ్ళీ తెరపైకి వచ్చారు. ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక తన జీవితంలో ఎదురైన విషయాలను పంచుకున్నారు. అనిత పాటకు స్ఫూర్తి తన లవ్ ఫెయిల్యూర్ అని చెప్తూ కంటతడి పెట్టుకున్నారు. అనిత అనే అమ్మాయిని ప్రేమించానని.. కానీ ఆ అమ్మాయి ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో దూరమయ్యామని అన్నారు. ఆ బాధతోనే అనిత పాట రాసి పాడానని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ పాట రాయడానికి ఆయనకు నెల రోజులు సమయం పట్టిందని అన్నారు.

ఈ పాట రాయడానికి ముందు ఆర్కెస్ట్రాలో పని చేశారు. బ్రేకప్ తర్వాత దేవిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఇద్దరి అబ్బాయిలు ఉన్నారు. పెద్ద కొడుకుకి మూగ, చెవుడు. కొంతకాలం పాన్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించిన నాగరాజు.. ఆ తర్వాత అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అనిత పాట హిట్ తర్వాత చాలా మంది అనిత 2 సాంగ్ కోసం రిక్వెస్ట్ లు రావడంతో ఆ పాటను విడుదల చేశారు. నీవే లోకమని అనే పాట కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఒక సినిమా ఆఫర్ వచ్చినట్లు ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ప్రైవేట్ సాంగ్స్ రాసి పాడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Anitha Nagaraju (@anitha_nagaraju_offical)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి