iDreamPost
android-app
ios-app

ఐకాన్ ఆగింది! ‘తమ్ముడు’ లాంచ్ తో కన్ఫర్మ్ చేశారుగా..

  • Author ajaykrishna Updated - 10:33 AM, Mon - 28 August 23
  • Author ajaykrishna Updated - 10:33 AM, Mon - 28 August 23
ఐకాన్ ఆగింది! ‘తమ్ముడు’ లాంచ్ తో కన్ఫర్మ్ చేశారుగా..

ఇండస్ట్రీలో ఎంతో ప్రెస్టిజియస్ గా అనుకున్న ప్రాజెక్టులు ఒక్కోసారి ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తావో తెలియదు. అసలు లాస్ట్ వరకు ఎవరి చేతికి చేరుకుంటాయో కూడా అంచనా వేయలేము. అలాంటి సందర్భాలు కూడా ఎదురవుతుంటాయి. ఒక హీరోతో ప్లాన్ చేసిన సినిమా.. వేరే హీరో చేతికి వెళ్లడం చూస్తుంటాం. కానీ.. ముందు ఏ హీరోని అనుకున్నారో.. అదే హీరో ఊహించని విధంగా సినిమా చేయాలని రేంజ్ కి మారిపోతే ఏం చేయలేని పరిస్థితి నెలకొంటుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ – ప్రొడ్యూసర్ దిల్ రాజుల కాంబినేషన్ కి అలాంటి పరిస్థితి ఎదురైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వీరి కాంబినేషన్ లో ఐకాన్ అనే సినిమా అనౌన్స్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

కట్ చేస్తే.. సినిమా అనౌన్స్ మెంట్ జరిగి ఏళ్లు గడుస్తున్నాయి. కానీ.. ఇప్పటిదాకా ఆ మూవీకి సంబంధించి ఎలాంటి మూమెంట్ కనిపించలేదు. ఇంతలో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇటీవల ఏకంగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. దాదాపు పుష్ప తర్వాత బన్నీ క్రేజ్, ఇమేజ్ అమాంతం అలా పెరిగిపోయాయి. ఇప్పుడు పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక ఏ హీరో అయినా.. కెరీర్ ని ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారని తెలుసు కదా! అందుకే ఇప్పట్లో ఐకాన్ కి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

ఇంతలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ – దిల్ రాజు కాంబో.. నితిన్ హీరోగా ‘తమ్ముడు’ అనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం కూడా పూర్తయింది. దీంతో బన్నీతో ఐకాన్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కన పెట్టేసారని అర్ధమవుతుంది. మరి ఫ్యూచర్ లో ఉంటుందా లేదా అనేది తెలియదు. కానీ.. ఇప్పట్లో అయితే ఉండకపోవచ్చు అని టాక్ నడుస్తోంది. ఆల్రెడీ ఐకాన్ అనౌన్స్ చేసి చాలా ఏళ్లు అయ్యింది. అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడని.. వేణు మధ్యలో వకీల్ సాబ్ మూవీ చేశాడు. అది వచ్చి.. రెండేళ్లు అవుతోంది. అయినా.. ఐకాన్ కోసం వెయిటింగ్ తప్పలేదు. ఆఖరికి నితిన్ తో కొత్తగా తమ్ముడు లైన్ చేశాడు. మరి చూడాలి ఈసారి నితిన్ – వేణు కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేయనుందో!

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobetcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom