iDreamPost
android-app
ios-app

RCBకి బిగ్ షాక్.. IPLకు దినేశ్ కార్తిక్ గుడ్ బై!

  • Published Mar 07, 2024 | 6:28 PM Updated Updated Mar 07, 2024 | 6:28 PM

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీకు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీకు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

RCBకి బిగ్ షాక్.. IPLకు దినేశ్ కార్తిక్ గుడ్ బై!

క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ జాతర మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పటికే టీమ్స్ తమ తమ ప్లాన్స్ తో బరిలోకి దిగడానికి రెడీగా ఉన్నాయి. ఇక ఆటగాళ్లు సైతం ఐపీఎల్ టోర్నీకి ముందు ఆడుతున్న సిరీస్ ల్లో సత్తాచాటుతూ.. యాజమాన్యాలకు టైటిల్ పై ఆశలు రేకెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే గత 16 సీజన్లుగా టైటిల్ ను ముద్దాడాలని చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ షాక్ తగిలింది. 2024 ఐపీఎల్ 17వ సీజన్ తర్వాత ఆర్సీబీ స్టార్ బ్యాటర్, ఫినిషర్ దినేశ్ కార్తీక్ తన ఐపీఎల్ కెరీర్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

దినేశ్ కార్తీక్.. ఐపీఎల్ టోర్నీలోనే కాదు, టీమిండియాలో కూడా బెస్ట్ ఫినిషర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చివర్లో వచ్చి దంచికొట్టడంలో డీకే సిద్ధహస్తుడు. అలా ఎన్నో సంచలన ఇన్నింగ్స్ లు ఆడి.. భారత్ కు అద్భుతమైన విజయాలను అందించాడు. ఇక ఐపీఎల్ స్పెషలిస్ట్ బ్యాటర్లలో ఒకడిగా ముద్రపడ్డ డీకే.. తనదైన బ్యాటింగ్ తో అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే 2024 ఐపీఎల్ సీజన్ డీకే కెరీర్ లో ఆఖరిది కానుంది. ఈ సీజన్ తర్వాత తన కెరీర్ ను ముగించబోతున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటిఐ(PTI) తెలిపింది.

కాగా.. గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటూ వస్తున్న డీకే ఈ ఐపీఎల్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశాలు కొట్టిపారేయలేం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. నివేదికలు మాత్రం గట్టిగానే చెబుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. బెంగళూరు టీమ్ కు భారీ ఎదురుదెబ్బనే చెప్పాలి. గత 16 సీజన్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది ఆర్సీబీ. ఈ నేపథ్యంలో ఇలాంటి వార్త వైరల్ గా మారడం.. డీకే, ఆర్సీబీ ఫ్యాన్స్ ను ఒక్కింత ఆందోళనకు గురిచేస్తోంది.

ఇదిలా ఉండగా.. దినేశ్ కార్తీక్ ఇప్పటి వరకు ఆరు ఫ్రాంచైజీల తరఫున 242 మ్యాచ్ లు ఆడాడు. ఈ మెగాటోర్నీలో 4516 పరుగులు చేసి.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్ట్ లో 10వ ప్లేస్ లో ఉన్నాడు. దీంతో పాటుగా ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ తర్వాత ఎక్కువ మ్యాచ్ లు ఆడిన రికార్డు డీకే పేరిట ఉంది. అయితే గత సీజన్ లో ఇతడు విఫలం అయినప్పటికీ.. బెంగళూరు యాజమాన్యం అతడిపై మాత్రం నమ్మకాన్ని వదులుకోలేదు. డీకేపై నమ్మకముంచి.. జట్టులో కొనసాగిస్తోంది. మరి డీకే వీడ్కోలు విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: 151.2 kmph బాల్‌ను రోహిత్‌ ఫేస్‌కు విసిరిన మార్క్‌ వుడ్‌! రోహిత్‌ ఏం చేశాడంటే..?