iDreamPost

151.2 kmph బాల్‌ను రోహిత్‌ ఫేస్‌కు విసిరిన మార్క్‌ వుడ్‌! రోహిత్‌ ఏం చేశాడంటే..?

  • Published Mar 07, 2024 | 5:50 PMUpdated Mar 08, 2024 | 1:58 PM

Rohit Sharma, Mark Wood: రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ స్టైల్‌ గురించి అందరికి తెలిసిందే. కానీ, ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌.. రోహిత్‌ ఫేస్‌ని టార్గెట్‌ చేస్తూ.. 151.2 కేఎంపీహెచ్‌తో బాల్‌ వేశాడు. కానీ, దాని రిజల్ట్‌ ఏమైందో మీరే చదవండి.

Rohit Sharma, Mark Wood: రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ స్టైల్‌ గురించి అందరికి తెలిసిందే. కానీ, ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌.. రోహిత్‌ ఫేస్‌ని టార్గెట్‌ చేస్తూ.. 151.2 కేఎంపీహెచ్‌తో బాల్‌ వేశాడు. కానీ, దాని రిజల్ట్‌ ఏమైందో మీరే చదవండి.

  • Published Mar 07, 2024 | 5:50 PMUpdated Mar 08, 2024 | 1:58 PM
151.2 kmph బాల్‌ను రోహిత్‌ ఫేస్‌కు విసిరిన మార్క్‌ వుడ్‌! రోహిత్‌ ఏం చేశాడంటే..?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో టీమిండియా తొలి రోజు ఆధిపత్యం చెలాయించింది. ధర్మశాల వేదికగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వారికి మంచి స్టార్ట్‌ లభించినా.. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ చెలరేగడంతో 218 పరుగులకే కుప్పకూలింది. అయితే.. తొలి ఇన్నింగ్స్‌ కోసం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లను ఇంగ్లండ్‌ పేసర్లు కాస్త ఇబ్బంది పెడదామని చూశారు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ అయితే.. ఏకంగా రోహిత్‌ శర్మను టార్గెట్‌ చేసుకుని బౌలింగ్‌ వేశాడు.

ఈ క్రమంలోనే అత్యంత వేగంగా రోహిత్‌ ముఖాన్ని టార్గెట్‌ చేసుకుని ఓ బాల్‌ వేశాడు. వేరే బ్యాటర్లు అయితే ఆ బాల్‌ చూసి వణికిపోయి.. కిందకి కూర్చోని వదిలే వాళ్లు. కానీ, అక్కడుంది రోహిత్‌ శర్మ కాబట్టి రిజల్ట్‌ వేరేలా వచ్చింది. మార్క్‌ వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో రోహిత్‌ శర్మ వరుసగా మూడు బంతులకు పరుగులేమీ చేయలేకపోయాడు. దీంతో రోహిత్‌ను మరింత ఇబ్బంది పెట్టాలని, అతనితో గాల్లోకి షాట్‌ ఆడించి అవుట్‌ చేద్దామనే ప్లాన్‌తో మార్క్‌ వుడ్‌ నాలుగో బంతని షార్ట్‌ బాల్‌గా వేసి.. ముఖాన్ని టార్గెట్‌ చేస్తూ.. గంటకు 151.2 కిలో మీటర్ల వేగంతో బాల్‌ విసిరాడు. అంత వేగంతో వచ్చే బాల్‌ను మరే క్రికెటర్‌ అయినా కిందకి వంగి కీపర్‌కి వదిలేసి వాడే.. కానీ, రోహిత్‌ శర్మ డిఫరెంట్‌ కదా.

ఆ బాల్‌ను అద్భుతంగా పుల్‌షాట్‌ ఆడిన రోహిత్‌ శర్మ.. సిక్స్‌తో మార్క్‌ వుడ్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు. రోహిత్‌ శర్మ ఫేవరేట్‌ షాట్‌ ఏంటో అందరికీ తెలిసిందే. పుల్‌షాట్‌ను రోహిత్‌ ఆడినంత అద్భుతంగా మరెవరూ ఆడలేరు. అలాంటి ప్లేయర్‌కు షార్ట్‌ బాల్‌ వేసే వదులుతాడు. అది ఎంత వేగంగా వచ్చినా.. రోహిత్‌ ముందు జుజుబీనే. అదే విషయాన్ని మార్క్‌ వుడ్‌కు అర్థమయ్యేలా.. అతను 151.2 కిలో మీటర్ల వేగంతో వేసిన బాల్‌ను దాన్ని మించిన వేగంతో సిక్స్‌కు పంపించాడు. అంతేనే.. ఆ తర్వాతి బాల్‌కు బౌండరీ బాది. ఇక్కడుంది.. రోహిత్‌ శర్మ రా బాబు అనిపించేలా చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రోహిత్‌ శర్మ 83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. మరి రెండో రోజు కూడా రోహిత్‌ ఇదే జోరును కొనసాగిస్తాడో లేదో చూడాలి. మరి గంటకు 150 కిలో మీటర్ల కంటే వేగంగా బౌలింగ్‌ వేసిన భయపెడదాం అనుకున్న మార్క్‌ వుడ్‌కు రోహిత్‌ ఇచ్చిన షాక్‌పై మీ అభ్రిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి