iDreamPost

అనిమల్ పై దిల్ రాజు స్పెషల్ ఫోకస్! వెనుక మరో లాభం ఉందట!

రణ్‌బీర్‌ కపూర్‌-సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కిన ‘అనిమల్‌’ సినిమా వచ్చే నెల డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉ‍న్నాయి.

రణ్‌బీర్‌ కపూర్‌-సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కిన ‘అనిమల్‌’ సినిమా వచ్చే నెల డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉ‍న్నాయి.

అనిమల్ పై దిల్ రాజు స్పెషల్ ఫోకస్! వెనుక మరో లాభం ఉందట!

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ‘అనిమల్‌’ మేనియా నడుస్తోంది. సగటు సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. రణ్‌బీర్‌ కపూర్‌- సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అనిమల్‌ నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్‌ ఆ అంచనాలను పెంచుతూ పోయింది. తాజాగా, రిలీజైన ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక, ఈ మూవీ డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో సినిమా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ భారీగా జరిగింది. థియెట్రికల్‌, ఓటీటీ, ఆడియో ఇలా అన్ని హక్కులు కలుపుకుని వందల కోట్ల బిజినెస్‌ జరిగింది. ఇక, ఈ సినిమాను ఆయా భాషల్లో పేరున్న నిర్మాతలే విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్‌ రాజు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారని టాక్‌. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అనిమల్‌ విడుదలను పెద్ద ఎత్తున ప్లాన్‌ చేస్తున్నారట.

రణ్‌బీర్‌తో దిల్‌రాజు సినిమా?

దిల్‌రాజు.. రణ్‌బీర్‌ కపూర్‌తో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారట. రణ్‌బీర్‌ కోసం ఓ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల పేర్లు అనుకుంటూ ఉన్నారట. అయితే, డైరెక్టర​, స్క్రీప్ట్‌తో పాటు మిగిలిన విషయాలపై తుది నిర్ణయం రణ్‌బీర్‌ తీసుకోనున్నారట. అందుకే దిల్‌ రాజు.. రణ్‌బీర్‌ ‘అనిమల్‌’ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈ చిత్రానికి తెలుగులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసి, రణ్‌బీర్‌తో సినిమాకు లైన్‌ క్లియర్‌ చేసుకోవాలనుకుంటున్నారట. అయితే, ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. దిల్‌ రాజునుంచి కానీ, దిల్‌ రాజు టీంనుంచి కానీ, ఓ అధికారిక ప్రకటన రావాల్సిందే.

కాగా, ఈ సినిమా తండ్రీకొడుకుల అనుబంధమే ప్రధానంగా సాగనుంది. తండ్రిని చంపటానికి చూసిన శత్రువులపై కొడుకు ఎలా పగ తీర్చుకున్నాడనేదే స్టోరీ. ట్రైలర్‌లో ఈ విషయాన్ని దర్శకుడు సందీప్‌ చెప్పేశాడు. అంచనాలను అటు ఇటు చేయకుండా.. ట్రైలర్‌ను కట్‌ చేసి వదిలాడు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కు జంటగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న నటించారు. అనిల్‌ కపూర్‌.. రణ్‌బీర్‌ కపూర్‌ తండ్రిగా కనిపించనున్నారు. బాబీ డియోల్‌ విలన్‌గా తన విశ్వరూపాన్ని చూపించనున్నారు. అనిమల్‌ సినిమా నిడివి 3 గంటలు పైనే ఉండటం రణ్‌బీర్‌ ఫ్యాన్స్‌ను ఇబ్బందుల్లో పడేస్తోంది. తేడా కొడితే పరిస్థితి ఏంటని అల్లాడుతున్నారు. మరి, రణ్‌బీర్‌ కపూర్‌తో దిల్‌ రాజు సినిమా చేయబోతున్నారని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి