iDreamPost
android-app
ios-app

పొలిటికల్ ఎంట్రీపై ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎక్కడైనా గెలుస్తానంటూ..!

  • Author singhj Published - 07:57 PM, Sat - 29 July 23
  • Author singhj Published - 07:57 PM, Sat - 29 July 23
పొలిటికల్ ఎంట్రీపై ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎక్కడైనా గెలుస్తానంటూ..!

సినిమా అంటే మెయిన్ ఫేస్ హీరోదే కనిపిస్తుంది. కథానాయకుడి పేరు, క్రేజ్ మీదే మూవీ బిజినెస్ జరుగుతుంది. ఆయన్ను చూసే ఆడియెన్స్​ థియేటర్లకు వస్తారు. కానీ మూవీ మేకింగ్​లో ఎంతో మంది పనిచేస్తారు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ దగ్గర నుంచి ఎంతో మంది టెక్నీషియన్ల కష్టం ఇందులో ఉంటుంది. ఒక సినిమా పట్టాలెక్కడానికి హీరో ఓకే చెబితే చాలు. కానీ ప్రొడ్యూసర్ లేకపోతే ప్రాజెక్టు కార్యరూపమే దాల్చదు. సినిమాలపై ఉన్న అభిమానంతో మంచి అభిరుచితో చిత్రాలు తీసి డబ్బులతో పాటు పేరు, ప్రఖ్యాతులు సంపాదించిన నిర్మాతలు చాలా మందే ఉన్నారు.

ఇష్టంతో సినిమాలు తీసే నిర్మాతలు క్రమంగా కనుమరుగవుతున్న దశలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు దిల్ రాజు. ‘దిల్’ దగ్గర నుంచి ‘బలగం’ వరకు ఆయన ప్రొడక్షన్ హౌస్​లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. నిర్మాతగా ఎంతో పేరు గడించిన దిల్ రాజు త్వరలో జరగనున్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అధ్యక్ష పదవి కోసం సి. కల్యాణ్​తో దిల్ రాజు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఎన్నికలు జరగనుండగా.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల మాదిరిగానే ఇప్పుడూ దిల్ రాజు, సి.కల్యాణ్ వరుస ప్రెస్​మీట్లు పెడుతూ ఎలక్షన్ హీట్​ను పెంచుతున్నారు.

తాజాగా నిర్వహించిన ఒక ప్రెస్​మీట్​లో దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఛాంబర్​కు తాను ప్రెసిడెంట్​గా ఉంటే ఇండస్ట్రీకి ఉపయోగపడుతుందని అనుకుంటే దానికే ప్రయారిటీ ఇస్తానన్నారు. ఛాంబర్ బాధ్యతలపై మరింత బలంగా ఫోకస్ చేస్తానని.. ఎక్కువ టైమ్ కేటాయిస్తానన్నారు దిల్ రాజు. ఈ సందర్భంగా రిపోర్టర్లు దిల్ రాజును ఆయన పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు. దీనికి ఆయన జవాబిస్తూ.. ‘రాజకీయాల్లోకి వస్తానని నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ అది జరుగుతుంది. తర్వాత ఏం అవుతుందనేది ఇప్పుడే ఎలా చెబుతాం? కానీ పాలిటిక్స్​లోకి వెళ్తే ఏ పార్టీ అయినా సరే ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో సీటు ఇవ్వొచ్చు. నేను గెలవొచ్చు కూడా. కానీ రాజకీయాలు, ఇండస్ట్రీ వేర్వేరు. రాజకీయాలా? ప్రొడ్యూసర్ కౌన్సిలా? అంటే నాకు ఇదే ఇంపార్టెంట్’ అని దిల్ రాజు స్పష్టం చేశారు.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet