iDreamPost

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన దిల్ మూవీ హీరోయిన్..!

టీవీల్లో మూవీస్ చూస్తున్న సమయంలో అరే ఈ హీరోయిన్ ఏమైపోయిందబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆమె ఏం చేస్తుంది, ఎక్కడ ఉందన్న ప్రశ్నలు మొదలౌతుంటాయి. తెలుసుకోవాలన్న ఆసక్తి నెలకొంటుంది. ఆ నటే దిల్ మూవీ హీరోయిన్..

టీవీల్లో మూవీస్ చూస్తున్న సమయంలో అరే ఈ హీరోయిన్ ఏమైపోయిందబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆమె ఏం చేస్తుంది, ఎక్కడ ఉందన్న ప్రశ్నలు మొదలౌతుంటాయి. తెలుసుకోవాలన్న ఆసక్తి నెలకొంటుంది. ఆ నటే దిల్ మూవీ హీరోయిన్..

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన దిల్ మూవీ హీరోయిన్..!

కొంత మంది హీరోయిన్లు ఇట్టే మనస్సును కట్టిపడేస్తుంటారు. చేసినవి కొన్ని సినిమాలే అయినా.. గుర్తిండిపోయే పాత్రలు చేస్తుంటారు. ఆ తరువాత అవకాశాలు రాకో లేదా ఇతర కారణాలతో వెండి తెరకు దూరమౌ.. బుల్లితెరపై మెరుస్తుంటారు. మరికొంత మంది ఉన్నత చదువుల కోసం వెళ్లిపోవడమో లేకుంటే వివాహ జీవితంలోకి అడుగుపెడుతుంటారు. అప్పుడప్పుడు వాళ్లు నటించిన సినిమాలు టీవీల్లో చూసినప్పుడు.. అరే ఈ నటిని మిస్ అయ్యామే అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అయితే వాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారని తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. ఆ కోవలోకి వస్తుంది దిల్ మూవీ హీరోయిన్ నేహా బాంబ్. ఆ మూవీ ఎంతటి విజయాన్ని సంపాదించిందో చెప్పనవసరం లేదు.

ఈ మూవీతోనే వెంకట రమణ రెడ్డి అనే వ్యక్తి దిల్ రాజు అయ్యాడు. సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా ఎదిగాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సృష్టించి.. ఓ సక్సెస్ ఫుల్ బ్యాన‌ర్‌ను నడిపిస్తున్నాడు. ఇక ఈ పిక్చర్ దర్శకుడు వినాయక్ గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఇప్పుడంటే సినిమాల టేకింగ్ లో విషయం తగ్గింది కానీ.. ఒకప్పుడు.. ఆ దర్శకుడు మూవీస్ వస్తున్నాయంటే యమ క్రేజ్. బాక్సాఫీసులు దద్దరిల్లాల్సిందే. ఆది బ్లాక్ బస్టర్ హిట్, చెన్న కేశవ రెడ్డి మిక్స్ టాక్ తో ఉన్న రోజుల్లో.. దిల్ మూవీ అతడి క్రేజ్‌ను అమాంతం పెంచేసిందనే చెప్పవచ్చు. ఈ మూవీ విడుదలై 20 ఏళ్లు అవుతుంది. ఈ చిత్రం నితిన్ ఇమేజ్‌ను నిలబెట్టింది. ఇందులోనే నందిని పాత్రలో మెప్పించింది నేహా. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అతడే సైన్యం, దోస్త్ మూవీస్‌లో హీరోయిన్ గా నటించింది.

ఆ మూవీస్ ఆశించిన విధంగా హిట్ బాట పట్టకపోవడంతో.. మెయిన్ రోల్స్ నుండి.. గెస్ట్ అప్పియరెన్స్, సెకండ్ హీరోయిన్ పాత్రలు వచ్చాయి. బొమ్మరిల్లు, దుబాయ్ శీనులో కనిపించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో.. బుల్లితెరకు షిఫ్ట్ అయిపోయింది. హిందీలో పలు సీరియల్స్ చేసింది ఈ అమ్మడు. 2007లో తాబ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. టోటల్‌గా చిత్ర పరిశ్రమ నుండి దూరం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఇప్పుడు పూర్తి సమయాన్ని వారికే కేటాయిస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ.. తన పిల్లల ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే అందంగా కనిపిస్తూ మెస్మరేజ్ చేస్తున్నారు.  అయితే గుర్తు పట్టేందుకు కాస్త సమయం పడుతోంది అనుకోండి.  గత హీరోయిన్లను వెతికి పట్టుకుని సెకండ్ ఛాన్స్ ఇస్తున్న దర్శకులకు మరీ ఈ భామ ఎప్పుడు కనిపిస్తుందో వేచి చూడాలి.. ఏమంటారు..?

 

View this post on Instagram

 

A post shared by Neha Goragandhi (@nehabambgandhi)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి