iDreamPost

OTTలోకి టీనేజ్ డ్రామా.. యూత్ అస్సలు మిస్ అవ్వకూడదు..

  • Published Apr 16, 2024 | 6:12 PMUpdated Apr 16, 2024 | 6:12 PM

ఎన్నో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు, సినిమాల తో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ నటి.. అనుష్క సేన్ నటించిన.. దిల్ దోస్తీ డైలమా వెబ్ సిరీస్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది.

ఎన్నో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు, సినిమాల తో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ నటి.. అనుష్క సేన్ నటించిన.. దిల్ దోస్తీ డైలమా వెబ్ సిరీస్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది.

  • Published Apr 16, 2024 | 6:12 PMUpdated Apr 16, 2024 | 6:12 PM
OTTలోకి టీనేజ్ డ్రామా.. యూత్ అస్సలు మిస్ అవ్వకూడదు..

లాంగ్వేజ్ ఏదైనా కానీ.. సినిమా, సిరీస్ కాన్సెప్ట్ ను బట్టి.. ఆయా సినిమాలు, సిరీస్ లకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో మంచి వ్యూవర్ షిప్ దక్కుతోంది. ముఖ్యంగా సిరీస్ లకు లభించే ఆదరణ అంతా ఇంతా కాదు. ఎక్కువమంది ఈ వెబ్ సిరీస్ లను చూసేందుకు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఓటీటీ లలో ఎన్నో సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను ఎంటెర్టైన్ చేశాయి, ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటి అనుష్క సేన్ లీడ్ రోల్ లో నటించిన “దిల్ దోస్తీ డైలమా” సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సిరీస్ స్ట్రీమింగ్ వివరాలను కూడా వెల్లడించారు మేకర్స్. మరి ఈ సిరీస్ ఎలా ఉందో.. ఏ ప్లాట్ఫార్మ్ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతోందనే వివరాలను చూసేద్దాం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

“దిల్ దోస్తీ డైలమా” వెబ్ సిరీస్ కు.. డెబ్బీ రావ్ దర్శకత్వం వహించారు. అనుష్క సేన్‍తో పాటు ఖుష్ జోత్వానీ, తన్వీ అజ్మి, శిశిర్ శర్మ, సుహాసినీ ములాయ్, ఎలిషా మేయర్, రేవతి పిళ్లై ముఖ్య పాత్రలు పోషించారు. అందలీబ్ వాజిద్ రచించిన అస్మారాస్ సమ్మర్ బుక్ ను ఆధారంగా తీసుకుని ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. కెనడా వెళ్ళాలి అనుకుని.. కోరుకున్న ఒక అమ్మాయి.. నార్త్ ఇండియాలో ఒక చిన్న టౌన్ కు వెళ్లి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే కాన్సెప్ట్ పైన ఈ సిరీస్ స్టోరీ ఉండబోతుంది. ఏప్రిల్ 16 న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో .. ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఒక టీనేజ్ అమ్మాయి.. తన తండ్రిని పాకెట్ మనీ ఇవ్వాలని అడగడంతో ఈ సిరీస్ ట్రైలర్ ను స్టార్ట్ చేశారు. తన తండ్రి ఇవ్వనని చెప్పడంతో.. టీనేజర్స్ కు చాలా ఖర్చులు ఉంటాయని.. చెప్పుకొస్తుంది. అయితే ఆమెకు కెనడా వెళ్లి బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటుంది కానీ, అనుకోకుండా ఒక చిన్న పట్టణానికి ఆమె వెళ్లాల్సి వస్తుంది. కానీ, ఆమె తన స్నేహితులకు మాత్రం కెనడా వెళ్లానంటూ అబద్దం చెబుతుంది. ఇక వెళ్లిన ఊరిలో ఆమె ఎలాంటి ఇబ్బందులు పడుతుంది. చివరికి ఆమె తన కుటుంబాన్ని అర్ధం చేసుకుంటుందా లేదా అనేది అంతా ట్రైలర్ లో ఎంతో ఆసక్తి కరంగా చూపించారు. ముఖ్యంగా టీనేజ్ ఆడపిల్లలకు ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుందని చెప్పి తీరాలి. మరి, ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి