iDreamPost

ఈ ఫోటోలో ఉన్న కుర్రాడ్ని గుర్తుపట్టారా? యాక్టింగ్‌లో తోపు!

  • Published Jun 18, 2024 | 11:03 AMUpdated Jun 18, 2024 | 11:03 AM

Did You Recognize: ఈ ఫోటోలో నవ్వుతూ అమాయకంగా కనిపిస్తున్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? ఇప్పుడీ కుర్రాడు ఒక తోపు హీరోగా ఎదిగిపోయారు. చిన్న సినిమాల్లో చిన్న వేషం దొరికితే చాలనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు పెద్ద సినిమాల్లో చిన్న వేషం వేసినా సరే విశ్వరూపం ప్రదర్శించే స్థాయికి ఎదిగిపోయారు. ఆయన ఎవరంటే?

Did You Recognize: ఈ ఫోటోలో నవ్వుతూ అమాయకంగా కనిపిస్తున్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? ఇప్పుడీ కుర్రాడు ఒక తోపు హీరోగా ఎదిగిపోయారు. చిన్న సినిమాల్లో చిన్న వేషం దొరికితే చాలనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు పెద్ద సినిమాల్లో చిన్న వేషం వేసినా సరే విశ్వరూపం ప్రదర్శించే స్థాయికి ఎదిగిపోయారు. ఆయన ఎవరంటే?

  • Published Jun 18, 2024 | 11:03 AMUpdated Jun 18, 2024 | 11:03 AM
ఈ ఫోటోలో ఉన్న కుర్రాడ్ని గుర్తుపట్టారా? యాక్టింగ్‌లో తోపు!

హీరోలు, హీరోయిన్ల సినిమాలు రిలీజైతే వారికి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రోబ్యాక్ ఫోటోలు, వింటేజ్ ఫోటోలు మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ హీరో ఫోటో కూడా వైరల్ అవుతోంది. తాజాగా ఆ హీరో నటించిన సినిమా క్లాసిక్ హిట్ గా నిలవడంతో అతని ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఈ కే కుర్రాడ్ని గుర్తుపట్టారా? ఒక్కో మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఎదిగారు. గుర్తింపు లేని చిన్న వేషం వేసి.. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో నటించి.. ఆ తర్వాత చిన్న సినిమాలో హీరోగా వచ్చి.. ఇవాళ నటనలో ఒక విధ్వంసం సృష్టిస్తున్నారు. 1996లో పేరు కూడా వేయని సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. మూడు సినిమాల్లో చిన్న  క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత వరుసగా సపోర్టింగ్ రోల్స్ చేసే స్థాయికి ఎదిగారు. ధనుష్, కార్తి వంటి స్టార్స్ సినిమాల్లో నటించారు.

ఆ తర్వాత హీరోగా అవకాశం వచ్చింది. అంతే అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. హీరోగా చేసి విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఆ సినిమాకి బెస్ట్ విలన్ గా అవార్డు కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత అందరూ ఎంతో ఇష్టంగా తినే జంక్ ఫుడ్ ఐటమ్ పేరుతో ఒక స్మాల్ బడ్జెట్ మూవీలో హీరోగా చేశారు. ఆ మూవీ పెద్ద హిట్ అయ్యింది. దీంతో అతని దశ తిరిగిపోయింది. అప్పటి నుంచి వరుసపెట్టి మంచి మంచి కథలతో అలరించడం మొదలుపెట్టారు. ఈ హీరో సినిమాలంటే కంటెంట్ ఉంటుంది.. అంతకు మించి ఇతని యాక్టింగ్ ఉంటుంది అని జనాలు ఫిక్స్ అయ్యేలా తనను తాను మలచుకున్నారు. ఇతను తెలుగులో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ మెగా ఫ్యామిలీ హీరో సినిమాలో నటించారు.

అందులో నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆ సినిమాలో ఆ హీరో నటనకు జనాలు ఫిదా అయిపోయారు. అదొక్కటే కాదు.. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన సినిమాలో సంతానం పాత్రలో అల్లాడించారు. హిందీలో షారుక్ ఖాన్, అట్లీ కాంబోలో వచ్చిన సినిమాలో విలన్ గా చేసి మెప్పించారు. హీరోగా చేస్తూనే విలన్ గా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ ఔరా అనిపిస్తున్నారు. పేరుకి కోలీవుడ్ నటుడు అయినా గానీ టాలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని భాషల్లోనూ ఈయనకు అభిమానులు ఉన్నారు. పుష్ప మూవీలో ఫహద్ ఫాజిల్ చేసిన విలన్ రోల్ ఫస్ట్ ఈయనకే వచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల మిస్ అయ్యింది. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు ఆ హీరో. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా? అతనెవరో కాదు.. విజయ్ సేతుపతి. తాజాగా ఈయన నటించిన మహారాజా సినిమా తెలుగులోనూ మంచి టాక్ సంపాదించుకుంది. క్లాసిక్ హిట్ అంటూ సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి