iDreamPost

రేణుకా స్వామి హత్య కేసులో కీలక మలుపు.. పవిత్ర గౌడ ఇంట్లో సోదాలు

కన్నడ నాట సంచలనం కలిగించింది రేణుకా స్వామి హత్య. ప్రియురాలు పవిత్రగౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని హత్య చేయించాడు కన్నడ నటుడు దర్శన్. కాగా, ఈ కేసులో ఒక్కొక్క నిజాలు మెల్లిగా వెలుగులోకి వస్తున్నాయి.

కన్నడ నాట సంచలనం కలిగించింది రేణుకా స్వామి హత్య. ప్రియురాలు పవిత్రగౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని హత్య చేయించాడు కన్నడ నటుడు దర్శన్. కాగా, ఈ కేసులో ఒక్కొక్క నిజాలు మెల్లిగా వెలుగులోకి వస్తున్నాయి.

రేణుకా స్వామి హత్య కేసులో కీలక మలుపు.. పవిత్ర గౌడ ఇంట్లో సోదాలు

కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శన్- పవిత్రగౌడల వ్యవహారం రచ్చ రచ్చ అయిన సంగతి విదితమే. ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడన్న కోపంతో శాండిల్ వుడ్ స్టార్ హీరో దర్శన్.. రేణుకా స్వామి అనే వ్యక్తిని ఓ షెడ్డులోకి తీసుకెళ్లి అంతర్భాగాలలో కొట్టడంతో చనిపోయాడు. ఈ కేసులో కన్నడ స్టార్ నటుడు దర్శన్.. ప్రేయసి కమ్ నటి పవిత్ర గౌడను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తోన్న సంగతి విదితమే. మొత్తం ఈ కేసులో పదహారు మంది అరెస్టు అయ్యారు. అయితే ఈ కేసులో రోజుకొక్క కోణం వెలుగులోకి వస్తుంది. రేణుకా స్వామి చనిపోవడానికి ముందు కరెంట్ షాక్ పెట్టి చిత్ర హింసలకు గురి చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అంతేకాకుండా కర్రలు, పైపులు, బెల్టులతో కొట్టడంతో తీవ్ర రక్తస్త్రావమై చనిపోయినట్లు తేలింది.

ఇదిలా ఉంటే.. ఈ హత్య కేసులోసహ నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడతో పాటు ఇతర నిందితుల పోలీసు కస్టడీని 20 వరకు పొడిగించి కోర్టు. రేణుకా స్వామిపై తొలి దాడి చేసింది పవిత్రనే అనే తెలినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె పోలీసుల విచారణలో ఉంది. ఇదిలా ఉంటే. పవిత్ర గౌడ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. దర్యాప్తులో భాగంగా.. ఆర్‌ఆర్‌ నగరలో ఉన్న పవిత్రగౌడ ఇంటికి ఆమెను, ఆమె అనుచరుడు పవన్‌ను తీసుకెళ్లారు. హత్య జరిగిన సమయంలో ఆమె వినియోగించిన దుస్తులు.. చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ హత్యకు సహకరించిన పవిత్రగౌడ మేనేజర్ దేవరాజును కూడా అరెస్ట్ చేశారు. రేణుకా స్వామి ఉంగరం, చైన్ వంటి వస్తువులను నిందితులు లాక్కున్నట్లు తెలుస్తుంది.

ఈ నెల 8న రేణుకా స్వామి హత్య చేయగా.. మరుసటి రోజు అతడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డొంకంతా కదిలింది. ఇందులో కన్నడ ఛాలెంజింగ్ స్టార్ హస్తం ఉందని తెలిసే సరికి విస్తుపోయింది శాండిల్ వుడ్ ఇండస్ట్రీ. రూ. 30 లక్షలు సుపారీ మాట్లాడి.. రేణుకా స్వామిని చిత్ర వధ చేసి చంపినట్లు తేలింది. ఇదిలా ఉంటే..బాధితుడు మృతదేహం లభించగానే లొంగిపోవాలని సుపారీ తీసుకున్న వ్యక్తులు యోచించారు. లొంగిపోవాలా, లేక కొన్ని రోజులు వేచి చూడాలా అనే మీమాంసలో పడిపోయారు. దీనిపై మైసూరులో ఒక హోటల్‌లో ఉన్న దర్శన్‌ వద్దకు వెళ్లి చర్చించారని విచారణలో తేలింది. ఆ సమయంలోనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇదిలా ఉంటే.. దర్శన్ అరెస్టుపై కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి