iDreamPost
android-app
ios-app

దర్శన్ కథ చివరికి.. విగ్గు పీకేసి ఆ పరీక్షలు చేపిస్తున్న పోలీసులు!

  • Published Jun 20, 2024 | 12:46 PM Updated Updated Jun 20, 2024 | 12:46 PM

Darshan Case: కన్నడ సినీ నటుడు దర్శన్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే కీలక సమాచారం బయటకు వచ్చింది.

Darshan Case: కన్నడ సినీ నటుడు దర్శన్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే కీలక సమాచారం బయటకు వచ్చింది.

  • Published Jun 20, 2024 | 12:46 PMUpdated Jun 20, 2024 | 12:46 PM
దర్శన్ కథ చివరికి.. విగ్గు  పీకేసి ఆ పరీక్షలు చేపిస్తున్న పోలీసులు!

ప్రముఖ కన్నడ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్  ఓ హత్య కేసులో అరెస్టైన సంగతి తెలిసింది. తన అభిమాని అయినా రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ నిందితులుగా ఉన్నారు. వీరి అరెస్ట్ జరిగి వారం గడుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి దర్శన్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఇదే సమయంలో పోలీసులు ఈ కేసులో అనేక కీలక ఆధారాలను సేకరించారు. ఇంకా మరింత సమాచారం కోసం దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇక కేసులో భాగంగా దర్శన్ పెట్టుకున్న విగ్గులను పోలీసులు తొలగించినట్లు తెలుస్తోంది. కొన్ని కీలక పరీక్షల నిమిత్తం మిగిలిన నిందితుల మాదిరిగానే దర్శన్ కి విగ్గు తొలగించినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కన్నడ సినీ నటుడు దర్శన్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన అభిమానిని చిత్ర హింసలకు గురిచేసి.. చంపించినట్లు దర్శన్ పై ఆరోపణలు ఉన్నాయి. తన ప్రియురాలు పవిత్ర గౌడతో కలసి రేణుకా స్వామిని హత్య చేయించినట్లు దర్శన్ పై ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఈ హత్య కేసు కన్నడ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు రీల్ హీరోగా ఉన్న దర్శన్ ఈ కేసుతో రియల్ విలన్ గా కనిపించాడు. ఈ కేసును పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాడు.

ఇప్పటికే క్యాబ్ డ్రైవర్ తో సహా 16 మందిని బెంగళూరు పోలీసు అరెస్టు చేశారు. అంతేకాక వారి నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నారు. నిందితుల విచారణ వివిధ రకాలుగా కొనసాగుతోందని, నిందితులకు కేసుకు సంబంధించిన  అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి నిందితులు అందరిని తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే దర్శన్ తలపై పెట్టుకున్న విగ్గును పోలీసులు తొలగించినట్లు సమాచారం. గత వారం రోజులుగా పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరచాల్సి ఉంది.

ఈ నేపథ్యంలేన ఏ-1 పవిత్రా గౌడ, ఏ2 దర్శన్ తో సహా అందిరికి తల వెంట్రుకల శాంపిల్ ను సేకరిస్తున్నారు. ఈక్రమంలనే దర్శన్ కి కూడా ఆయన ధరించిన విగ్ ను పోలీసులు తొలగించినట్లు సమాచారం. హీరో దర్శన్ రక్తం, వెంట్రుకల నమూనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఈ కేసుకు సంబంధించి నిందితులకు డీఎన్‌ఏ టెస్టులను ప్రారంభించారని తెలుస్తోంది. రేణుకాస్వామి డెడ్ బాడీ లభ్యమైన రోజు నుంచే కేసును సీరియస్‌గా తీసుకుని  పోలీసులు దర్యాప్తును చేశారు. ఇక డీఎన్ఏ టెస్టులకో కీలక సమాచారం బయటకి వచ్చే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio