iDreamPost
android-app
ios-app

రేణుకా స్వామి హత్య తర్వాత భార్య ఇంట్లో దర్శన్ పూజలు..!

అభిమానిని చంపి పోలీసులు అదుపులో ఉన్న శాండిల్ వుడ్ ఛాలెంజింగ్ స్టార్ విచారణ ఎదుర్కొంటున్నాడు. కాగా, ఈ కేసులో కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి. తాజాగా చేపట్టిన సోదాల్లో..

అభిమానిని చంపి పోలీసులు అదుపులో ఉన్న శాండిల్ వుడ్ ఛాలెంజింగ్ స్టార్ విచారణ ఎదుర్కొంటున్నాడు. కాగా, ఈ కేసులో కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి. తాజాగా చేపట్టిన సోదాల్లో..

రేణుకా స్వామి హత్య తర్వాత భార్య ఇంట్లో దర్శన్ పూజలు..!

రేణుకా స్వామి అనే వ్యక్తిని చంపాడన్న ఆరోపణలపై కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగదీప, ప్రియురాలు పవిత్రగౌడతో పాటు 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పవిత్రగౌడకు అసభ్యకర సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి.. షెడ్డులో పడేసి విచక్షణా రహితంగా తన్నడంతో అతడు మృతి చెందిన సంగతి విదితమే. ఇదిలా ఉంటే ఈ కేసులో ఒక్కొక్కటిగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే నిందితుల ఇంట్లో సోదాలు చేపడుతున్న సంగతి విదితమే. పవిత్రగౌడ ఇంట్లో చేపట్టిన సోదాల్లో ఆమె దుస్తులు, చెప్పులు సీజ్ చేశారు. హత్య సమయంలో దర్శన్ వినియోగించిన లోఫర్స్‌ను ఆయన భార్య విజయలక్ష్మీ ఫ్లాట్ వద్ద తాజాగా గుర్తించారు పోలీసులు.

వీటి రికవరీతో ఈ కేసులో కీలక ఆధారాలు పోలీసులకు లభించినట్లయ్యింది. ఈ నెల 9న రేణుకాస్వామి హత్య జరగ్గా.. మృతదేహాన్ని పారేసి హోస్కెరహల్లిలోని భార్య విజయలక్ష్మీ ఫ్లాట్‌కు వెళ్లాడు దర్శన్. అక్కడి నుండి మైసూర్ వెళ్లే మసయంలో ఇంట్లో పూజలు చేశాడు. ఈ నేపథ్యంలో దర్శన్ భార్య విజయలక్ష్మీకి కూడా పోలీసులు సమన్లు జారీ చేసి బుధవారం ఐదు గంటల పాటు విచారించారు. అంతేకాదు.. లోఫర్స్‪ను ఎవరైనా కడిగారేమోనని అడిగి తెలుసుకున్నారు. ఈ హత్య అనంతరం కొన్ని దుస్తులు, ఫుట్ వేర్‌ను దర్శన్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ రాజు తెచ్చి హీరో భార్యకు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆమెను సాక్షిగా చేర్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే.. తొలిసారి ఈ హత్య ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది భార్య విజయలక్ష్మీ.

హత్య జరిగిన ఇన్ని రోజుల తర్వాత ఆమె మౌనం వీడింది. తొలుత రేణుకాస్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన దర్శన్ భార్య.. బాధితుడు కుటుంబ సభ్యులకు అతడి లేడన్న విషయాన్ని తట్టుకునే శక్తి భగవంతుడివ్వాలని వేడుకుంది.‘దర్శన్ కోసం గత కొన్ని రోజులుగా నేను, నా కొడుకు, దర్శన్ స్నేహితులు, కుటుంబం, అభిమానులందరూ వేదనతో ఉన్నాం. ఆ బాధను వర్ణించలేను. న్యాయస్థానం నుండి ఉత్తర్వులు వచ్చేంత వరకు మీడియా, సోషల్ మీడియా సైట్లలో ఎటువంటి తప్పుడు లేదా అనధికారిక సమాచారాన్ని ప్రచురించవద్దని అభ్యర్థిస్తన్నారు. తల్లి చాముండేశ్వరి, న్యాయ వ్యవస్థపైనా నాకు పూర్తి నమ్మకం ఉంది. సత్యం గెలుస్తుంది’ అంటూ హత్య కేసుపై అనధికారిక సమాచారాన్ని ప్రచురించకుండా మీడియా సంస్థలపై సెషన్స్ కోర్టు జారీ చేసిన నిషేధాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Vijayalakshmi darshan (@viji.darshan)