iDreamPost
android-app
ios-app

రెచ్చిపోయిన దర్శన్ మరో అభిమాని.. కేంద్ర మంత్రిపై ఆరోపణలు చేస్తూ

  • Published Jun 21, 2024 | 5:17 PM Updated Updated Jun 21, 2024 | 5:17 PM

హీరోలకు అభిమానులు ఉండటం కామన్. కానీ అభిమానం కట్టలు తెంచుకుని హద్దులు మీరుతుంది. వారి వ్యక్తిగత జీవితంలోకి కూడా దూరిపోతున్నారు. చివరకు సమస్యలు తెచ్చుకుంటున్నారు. దర్శన్ విషయంలో ఇదే చోటుచేసుకుంది. ఇప్పుడు మరో మహిళా అభిమాని ఓవరాక్షన్ చేసింది.

హీరోలకు అభిమానులు ఉండటం కామన్. కానీ అభిమానం కట్టలు తెంచుకుని హద్దులు మీరుతుంది. వారి వ్యక్తిగత జీవితంలోకి కూడా దూరిపోతున్నారు. చివరకు సమస్యలు తెచ్చుకుంటున్నారు. దర్శన్ విషయంలో ఇదే చోటుచేసుకుంది. ఇప్పుడు మరో మహిళా అభిమాని ఓవరాక్షన్ చేసింది.

  • Published Jun 21, 2024 | 5:17 PMUpdated Jun 21, 2024 | 5:17 PM
రెచ్చిపోయిన దర్శన్ మరో అభిమాని..  కేంద్ర మంత్రిపై ఆరోపణలు చేస్తూ

హీరోలు, హీరోయిన్లపై అభిమానం ఉండొచ్చు కానీ అదీ హద్దులు మీరకూడదు. వాళ్లకంటూ ఓ ప్రైవేట్ స్పేస్ ఉందని మర్చిపోతున్నారు. కన్నడ నటుడు దర్శన్ విషయంలో అభిమానమే కొంప ముంచింది. ప్రియురాలితో తమ అభిమాన నటుడు రిలేషన్ షిప్‌లో ఉండటాన్ని తట్టుకోలేక పవిత్రగౌడకు అసభ్యకర మేసేజ్, సందేశాలు పంపించాడు రేణుకా స్వామి అనే ఫ్యాన్. ఈ విషయం హీరోకు తెలిసి అతడ్ని అత్యంత దారుణంగా కొట్టి చంపిన సంగతి విదితమే. ఈ కేసులో ప్రస్తుతం దర్శన్ పోలీసు కస్టడీలో ఉండగా.. పవిత్ర గౌడ బెంగళూరు పరప్పన్ జైలుకు వెళ్లింది. ఇదిలా ఉంటే..ఇప్పుడు దర్శన్ మరో మహిళా అభిమాని వివాదంలో చిక్కుకుంది. ఆమెపై రెండు ఫిర్యాదులు నమోదయ్యాయి. కన్నడ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగదీపకు మేల్ అభిమానులే..కాదు ఫీమేల్ ఫ్యాన్స్ కూడా ఎక్కువే.

అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అరెస్టు కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ ఫ్యాన్ సోషల్ మీడియా వేదికగా అనుచిత పదజాలంతో విరుచుకుపడుతుంది.  ఆమె ఓవరాక్షన్ చేయడంతో పోలీసులను ఆశ్రయించారు జేడీఎస్ కార్యకర్తలు. మాండ్యలోని కేఆర్ పేట్ టౌన్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ సెంట్రల్ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందాయి. దర్శన్ అరెస్టులో కేంద్ర మంత్రి, మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి ప్రమేయం ఉందని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమలత కారణంగానే మాండ్య సీటుకు పోటీ చేశారని, దర్శన్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు రూ. 150 ఇచ్చి మనుషుల్ని తీసుకువచ్చారంటూ ఈ కేంద్ర మంత్రిపై కించపరిచే పదజాలంతో ఆరోపణలు చేసింది. దీంంతో ఆమెపై ఫిర్యాదులు చేశారు జేడీఎస్ కార్యకర్తలు. ఆమెను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, అతడి ప్రియురాలు అరెస్టైన వివాదానికి దూరంగా ఉంటున్నారు హెచ్ డి కుమారస్వామి. ఎక్కడా స్పందించలేదు. అలాగే ఆయన కుమారుడు నిఖిల్ కూడా స్పందించేందుకు నిరాకరించాడు. ఈ విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారని మాత్రమే అన్నాడు. జూన్ 8న రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి.. బెంగళూరుకు తీసుకు వచ్చి షెడ్డులో అత్యంత హేయనీయంగా దాడి చేయడంతో మరణించిన సంగతి విదితమే. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో రోజుకొక్క కోణం వెలుగులోకి వస్తున్నాయి. దర్శన్ తో పాటు ఆరుగురి కస్టడీని పొడిగించగా.. పవిత్రతో పాటు మిగిలిన నిందితులకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio