iDreamPost

వీడియో: కరోనాలో మొదలైన ప్రేమ కథ.. చివరకు అలా కంచికి

కరోనా సమయంలో ఆ ప్రేమకు పునాది పడింది. లాక్ డౌన్ ఎత్తివేశాక.. ఉద్యోగాల నిమిత్తం.. బయట ప్రపంచంలోకి అడుగుపెట్టారు ప్రియుడు, ప్రియురాలు. ఇద్దరి కలిసి ఉద్యోగానికి బస్సులో వెళ్లేవారు. బంధం మరింత బలపడింది. అలా నాలుగేళ్లు గడిచిపోయాయి.

కరోనా సమయంలో ఆ ప్రేమకు పునాది పడింది. లాక్ డౌన్ ఎత్తివేశాక.. ఉద్యోగాల నిమిత్తం.. బయట ప్రపంచంలోకి అడుగుపెట్టారు ప్రియుడు, ప్రియురాలు. ఇద్దరి కలిసి ఉద్యోగానికి బస్సులో వెళ్లేవారు. బంధం మరింత బలపడింది. అలా నాలుగేళ్లు గడిచిపోయాయి.

వీడియో: కరోనాలో మొదలైన ప్రేమ కథ.. చివరకు అలా కంచికి

ప్రేమను అంగీకరించడం లేదని, పెళ్లికి తిరస్కరించిందని, బ్రేకప్ చెప్పిందని ప్రియుడు.. ప్రాణంగా ప్రేమించామని చెప్పుకుంటున్న అమ్మాయిల ప్రాణాలు తీసుకుంటున్నారు. వెంట పడి, వేధించి.. కాదంటే.. కర్కశంగా, అతి కిరాతకంగా నడి రోడ్డుపై జనాలు చూస్తుండగానే తెగబడుతున్నారు. మొన్నటి మొన్న కర్ణాటకలో లవ్ ప్రపోజ్ చేస్తే.. తిరస్కరించిందన్న అక్కసుతో కాలేజీ క్యాంపస్‌లోనే యువతిపై ప్రియుడు కత్తి దూసిన సంగతి విదితమే. ఇప్పుడు మరో ప్రేమికుడు.. పట్టపగలు ప్రియురాలిపై కత్తితో దాడి చేసి రక్తపుటేరులు పారించాడు. అంతే కాదు తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై కూడా దాడి చేశాడు. ప్రేయసి తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందన్న కారణంతో ఆమె అంతు చూశాడు.

ప్రియురాల్ని నడిరోడ్డుపై వెంటాడుతూ నరికి చంపిన ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.  ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మృతురాలు మొరిండా పట్టణానికి సమీపంలోని ఫతేపూర్ జట్టన్ గ్రామానికి చెందిన బల్జిందర్ కౌర్‌గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..లూథియానా జిల్లాలోని సమ్రాలా పట్టణానికి సమీపంలోని ఖిర్నియా గ్రామానికి చెందిన సుక్‌చైన్ సింగ్.. బాధితురాలు బల్జిందర్ కౌర్ కు 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో పరిచయం ఏర్పడింది. కోవిడ్ ఆంక్షల తర్వాత ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లే సమయంలో బస్సులో ప్రయాణించేవారు. అలా వారి మధ్య బంధం మరింత బలపడింది. ఆమె గత తొమ్మిదేళ్లుగా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ VIIలోని కాల్ సెంటర్‌లో పనిచేస్తుంది. ప్రియుడు పెట్రోల్ బంకులో పనిచేసేవాడు.

 అలా నాలుగేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. డబ్బు విషయంలో కూడా వివాదం నెలకొనడంతో.. గత డిసెంబర్‌లో ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది ప్రియురాలు. ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాడు సుక్‌చైన్ సింగ్. ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడ్డాడు. ఆమె కాదనడంతో అక్కసు పెంచుకున్న ప్రేమికుడు.. శనివారం ఉద్యోగం నిమిత్తం ఇంటి నుండి బయలు దేరింది బల్జిందర్ కౌర్. ఆమె వెళ్లే దారిలో కాపు కాచి.. వెంట తెచ్చిన కత్తితో దాడి చేశాడు. ప్రియుడి దాడిని చూసిన ప్రియురాలు..వెంటనే పరుగులు పెట్టినప్పటికీ.. ఆమెను వెంటాడుతూ కత్తితో దాడి చేశాడు. ఆమె రోడ్డుపై పడిపోగానే.. పలుమార్లు దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో దర్శనమిస్తున్నాయి. కాగా, సమాచారం అందుకున్నపోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. వారిని కూడా గాయపరిచాడు సుక్‌చైన్ సింగ్. ఎట్టకేలకు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి