iDreamPost

అల్లు అర్జున్ బర్త్ డే రోజు పుష్ప 2 గ్లింప్స్?

  • Published Mar 14, 2024 | 8:59 PMUpdated Mar 14, 2024 | 8:59 PM

అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం పుష్ప 2 కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడు వారాల్లో రానున్న ఐకాన్ స్టార్ బర్త్ డే రోజున పుష్ప 2 టీమ్ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నట్లు గట్టి టాక్ వినిపిస్తుంది.

అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం పుష్ప 2 కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడు వారాల్లో రానున్న ఐకాన్ స్టార్ బర్త్ డే రోజున పుష్ప 2 టీమ్ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నట్లు గట్టి టాక్ వినిపిస్తుంది.

  • Published Mar 14, 2024 | 8:59 PMUpdated Mar 14, 2024 | 8:59 PM
అల్లు అర్జున్ బర్త్ డే రోజు పుష్ప 2 గ్లింప్స్?

ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో సీక్వెల్ సినిమాలకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం పుష్ప 2 కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ వార్తల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లకు పైగానే ఉంటుందట. ఇంతటి భారీ బడ్జెట్‌తో దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో కష్టపడి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నారు. కాగా మరో మూడు వారాల్లో రానున్న ఐకాన్ స్టార్ బర్త్ డే రోజున పుష్ప 2 టీమ్ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నట్లు గట్టి టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం ఎలాంటి ఆటంకం లేకుండా పుష్ప 2 చిత్రీకరణ కొనసాగుతోంది. ఏమాత్రం ఆలస్యం జరిగినా సినిమా వాయిదా పడే అవకాశం ఉందని చాలా పుకార్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. కానీ అలాంటి వార్తలకు ఆపేందుకు పుష్ప: ది రూల్ నిర్మాణ సంస్థ ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ పోస్టర్లను విడుదల చేస్తూ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ గా మారుతుంది. మొదటి భాగం కంటే రెండో భాగంలో బలమైన పాత్రలతో పాటు కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని అంటున్నారు. ఒక పుష్ప పార్ట్ 1 లో ఊ అంటావా మావా అంటూ సాగిన ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్ట్ 2 లో కూడా అలాటి ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ఉంటుంది. మొదటి భాగంలో సమంత నటించగా సీక్వెల్ లో స్పెషల్ సాంగ్ కోసం కూడా సమంతతో పాటు తమన్నా, శ్రీ లీలను కూడా సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ యాక్టర్ ఫాహాద్ ఫాజిల్ ఈ సినిమాలో షేకావత్ పాత్రను కొనసాగిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. కాగా పుష్పరాజ్ ను ఎదుర్కునే ఇంటర్ నేషనల్ డాన్ గా సంజయ్ దత్ కనిపిస్తారని అంటున్నారు.

పైన చెప్పుకున్న విధంగా ‘పుష్ప 2’ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించే అవకాశం ఉన్న ఈ సినిమా మేకింగ్ లో నిర్మాతలు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రంలోని మొదటి పాట,లేదా సినిమాకి సంబందించిన చిన్న గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కాబట్టి, ఆ రోజే పుష్ప 2 నుంచి స్పెషల్ అప్‌డేట్ విడుదలయ్యే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి