iDreamPost
android-app
ios-app

దేశంలో ఐదు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో ఐదు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఒక్కరోజులో 18,552 పాజిటివ్ కేసులు – 384 మరణాలు

కరోనా వైరస్ దేశంలో ఉగ్రరూపం దాలుస్తుంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 15 వేలకు పైగా కేసులు, 400 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 18,552 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,08,953 కి చేరింది.  అంతేకాకుండా మరణాల సంఖ్య 15,685 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.నిన్న ఒక్కరోజులో 384 మరణాలు సంభవించాయి.  ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది.  కరోనా వైరస్ బారినుండి 2,95,881 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1,97,387 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసుల నమోదు

మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడట్లేదు.నిన్న ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 5024 పాజిటివ్ కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.ఆ రాష్ట్రంలో కరోనా మహమ్మారి బారిన పడి తాజాగా 175 మంది మృతి చెందారు. అయితే వీరిలో 91 మంది గడిచిన 24 గంటలలో మరణించగా,మరో 84 మంది అంతకుముందు మరణించిన వారి వివరాలు శుక్రవారం (జూన్ 26) గణాంకాలలో వెల్లడించినట్లు మహారాష్ట్ర హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.నిన్నటి పాజిటివ్ కేసులతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,765 చేరింది.అలాగే మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్న ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,106 చేరింది.     

ప్రస్తుతం మహారాష్ట్రలో 65,829 వైరస్ యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు 79,815 మంది కరోనా మహమ్మారి  కోల్పోని డిశ్చార్జ్ అయ్యారు.ఆర్థిక రాజధాని ముంబైలో ప్రమాదకర స్థాయిలో వైరస్ వ్యాప్తి స్తుండటం ఆందోళన పరుస్తుంది.ఇక ఆసియాలోనే అత్యంత మురికివాడగా పేరు పొందిన ధారవిలో వైరస్ వ్యాప్తి అదుపులోకి రావటం ఒక్కటే ఉద్ధవ్ ప్రభుత్వానికి కాస్త ఊరటనిస్తుంది.

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 985 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 12349 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7346 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 4766 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 237 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 605 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 11489 మందికి కరోనా సోకగా 146 మంది మృత్యువాత పడ్డారు. 5196 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్  అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6147 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 9,906,585 మందికి కోవిడ్ 19 సోకగా 496,915 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 5,357,996 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 2,552,956 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 127,640 మంది మరణించారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş