iDreamPost
android-app
ios-app

NTR చావుకు కారణమైన వాళ్లే ఆయన ఫోటోకు దండం పెడుతున్నారు: CM జగన్

NTR చావుకు కారణమైన వాళ్లే ఆయన ఫోటోకు దండం పెడుతున్నారు: CM జగన్

ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా నగరిలో సోమవారం పర్యటించారు. నగరిలో బటన్ నొక్కి ‘జగనన్న దీవెన’ ఏప్రిల్ -జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,35,235 మంది విద్యార్థులకు పూర్తిగా  ఫీజు రీయింబర్స్ మెంట్ ను అందించారు. సోమవారం బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో  నేరుగా  జమ చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో  సీఎం జగన్ ప్రసంగించారు. అలానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల పై విరుచకు పడ్డారు.  సొంత కొడుకుపై నమ్మకం లేక దత్త పుత్రుడికి ప్యాకేజ్ ఇచ్చారని చంద్రబాబుపై సీఎం జగన్ ధ్వజమెత్తారు.  చంద్రబాబు రాజకీయం చరిత్ర అంతా వెన్నుపోట్లు, కుట్రలు, మోసాలు, అబద్దాలేనని మండి పడ్డారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వాళ్లు ఆయన ఫోటోకు దండం పెడతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ రోజు రాష్ట్రపతి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు ఫోటోతో రూ.100ల నాణెం విడుల చేశారు.  ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. లక్ష్మీపార్వతీ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్  వంటి వారు మాత్రం హాజరు కాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ కార్యక్రమంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అలానే  చంద్రబాబుపై తీవ్ర స్థాయి ధ్వజమెత్తారు. కుట్రలు, మోసాలు, అబద్దాలతోనే చంద్రాబు జీవితమంత సాగిందని సీఎం  జగన్ అన్నారు.

అలానే ఎన్టీఆర్ చావుకు కారణమైన వాళ్లు కూడా ఆయన ఫోటోకు దండేసి దండం పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లనిచ్చిన మామనే వెన్ను పోటు పొడిచిన ఘనడు చంద్రబాబు అని, ఆయన చావుకు కూడా వాళ్లే కారణమని సీఎం జగన్ అన్నారు. అయినా ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణేం విడుదల చేసే కార్యక్రమంలో నిస్సిగ్గుగా పాల్గొన్నాడని సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఇచ్చిన మా  నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు అని సీఎం జగన్ విమర్శించారు. అధికారం కోసం బాబు ఎంతకైన తెగిస్తాడని , చంద్రబాబు ప్రతి అడుగు కుట్రలు, కుతంత్రాలేనని మండి పడ్డారు.

ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ..”చంద్రబాబు 28 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడు. మూడు సార్లు సీఎం అయినా  చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయిన కనిపిస్తుందా?. పుంగనూరులో  అల్లర్లు సృష్టించి.. పోలీసులపై దాడి చేశారని సీఎం దయ్యబట్టారు.  రాష్ట్రంలోని దొంగ ఓట్లను తొలగిస్తుంటే దుష్ర్పచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సొంత బలం మీద గానీ, సొంత కొడుకు మీద గానీ నమ్మకం లేదు. ఈ మధ్య కాలంలో ఈయన గానీ, కొడుకు గానీ, దత్తపుత్రుడు గానీ సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న భాషను చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ల అబ్ధలాను ప్రచారం చేసేందుకు ఎల్లో మీడియా రెడీగా ఉంటుంది. ఏదైనా టీవీల్లో న్యూస్ వస్తే నిజమేమో అనుకొనే పరిస్థితులు పోయాయి.  ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పే  గత చరిత్ర ఏదీ లేదు. కాబట్టే వీళ్లందరూ అబద్దాలం మీద, కుట్రలు, కుతంత్రాలు, వెన్ను పోట్ల మీద జీవిత ఆశయంగా మార్చుకొని రాజకీయాలు చేస్తున్నారు”  అని చంద్రబాబుపై సీఎం జగన్ మండిపడ్డారు

ఇదీ చదవండి: విద్యార్థులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. నేడు వారి ఖాతాల్లోకి డబ్బులు!