iDreamPost

విద్యార్థులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. నేడు వారి ఖాతాల్లోకి డబ్బులు!

విద్యార్థులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. నేడు వారి ఖాతాల్లోకి డబ్బులు!

రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌తో పాటు మరికొన్ని కోర్సుల ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఏ త్రైమాసికానికి సంబంధించి ఆ త్రైమాసికంలో నిధులు విడుదల చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 11,317 కోట్లు ఖర్చు చేసింది.

26,98,728 మంది పేద విద్యార్థులు లబ్ది పొందారు. ఇ‍క, ఏప్రిల్- జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి ప్రభుత్వం నేడు నిధులను విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో బటన్‌ నొక్కి 680 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. దాదాపు 9,32,235 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేడు నేరుగా ఫీజు రియంబర్స్‌మెంట్‌ డబ్బులు పడనున్నాయి. మరో వైపు ఐటీఐ రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఇస్తోంది.

 సీఎం జగన్‌ విద్యపై ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతోంది. ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి కింది ఇప్పటి వరకు మొత్తం రూ. 26,067 కోట్లు ఖర్చు చేసింది. 44,48,865 మంది లబ్ధిపొందారు. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 4,276 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. 25,17,245 మంది లబ్ధిపొందారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద దాదాపు 175 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా..  1,925 మంది లబ్ధి పొందారు. మరి, ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టిన ఈ అద్భుతమైన పథకాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి