iDreamPost

విషాదం.. గుండెపోటుతో పదోతరగతి విద్యార్థి మృతి

పదోతరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర కలకలంరేగింది. అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

పదోతరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర కలకలంరేగింది. అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

విషాదం.. గుండెపోటుతో పదోతరగతి విద్యార్థి మృతి

ప్రస్తుతం గుండెపోటు మరణాలు హడలెత్తిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన వారు ఒక్కసారిగి కుప్పకూలి తుది శ్వాస విడుస్తున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు గుండెపోటు భారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. రోజూ వ్యాయామం చేసే వారు, ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారు కూడా గుండె పోటుకు బాధితులవుతున్నారు. గుండెపోటు మరణాలతో కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఓ జిల్లాలో పదోతరగతి విద్యార్థి గుండెపోటుకు గురై మృతి చెందాడు. విద్యార్థి మృతితో గిరిజన గురుకుల పాఠశాలలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది.

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థి శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందారు. అప్పటి వరకు విద్యార్థులతో కలిసి ఉన్న శ్రీకాంత్.. ఉన్నట్టుండీ గుండెపోటుతో క్లాస్‌ రూమ్‌ ముందే కుప్పకూలి.. కన్నుమూశారు. హన్వాడ మండలం బుడుమ తండాకు చెందిన శ్రీకాంత్ (15) ధన్వాడ గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత శ్రీకాంత్ క్లాసులకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడే ఉన్న విద్యార్థులు ఇది గమనించి పాఠశాల సిబ్బందికి సమాచారం అందించారు.

వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆ విద్యార్థిని ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే జిల్లా ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే ఆ విద్యార్థి మరణించినట్లు వెల్లడించారు. గుండె పోటు కారణంగానే శ్రీకాంత్‌ కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కొడుకు హఠాన్మరణంతో తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాగా చదువుకుని భవిష్యత్ లో తమకు అండగా ఉంటాడని భావించిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. శ్రీకాంత్‌ మృతితో బుడుమలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరి గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి మరణించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి