iDreamPost

ఉద్యోగానికి వెళ్లొచ్చిన అమ్మ.. కూతుర్ని బాత్రూంలో అలా చూసి

రోజులానే తల్లి విధులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఎదురు తలుపు తాళం వేసి ఉండగా.. వెనక నుండి డోర్ తీసి ఉండటాన్ని గమనించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. కూతురు బాత్రూమ్‌లో

రోజులానే తల్లి విధులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఎదురు తలుపు తాళం వేసి ఉండగా.. వెనక నుండి డోర్ తీసి ఉండటాన్ని గమనించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. కూతురు బాత్రూమ్‌లో

ఉద్యోగానికి వెళ్లొచ్చిన అమ్మ.. కూతుర్ని బాత్రూంలో అలా చూసి

చేతి కొచ్చిన పిల్లలు కళ్ల ముందే కనుమరుగౌతుంటే.. ఆ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం. వారిని ఉన్నత చదువులు చదివించి, ప్రయోజకులు అయితే చూడాలనుకుంటారు పేరెంట్స్. కానీ తమ చేతులతోనే చితికి నిప్పుపెట్టాల్సి వస్తే మాత్రం ఆ హృదయాలు తట్టుకోలేవు. ప్రబుద్ధ విషయంలో ఇదే జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు ఇంట్లోనే రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని చూసి హతులయ్యింది కన్నతల్లి. బాత్రూమ్‌లో కూతురు గొంతు, మణికట్టు తెగి.. రక్తమోడుతున్న స్థితిలో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. తొలుత దీన్ని ఆత్మహత్య అని భావించారు పోలీసులు. అయితే తల్లి మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తుంది. ఉద్యోగానికి వెళ్లి వచ్చేలోపు కూతురు కానరాలి లోకాలకు వెళ్లడాన్ని తట్టుకోలేకపోతుంది.

ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 20 ఏళ్ల ప్రబుద్ద దక్షిణ బెంగళూరులోని ఓ ప్రైవేట్ మహిళా కళాశాలలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈ నెల 15న రోజులానే ఆ రోజు కూడా తల్లి ఉద్యోగానికి వెళ్లింది. రాత్రి 7.30 నుండి 8.00 మధ్య తల్లి ఇంటికి వచ్చే సరికి ముందు తలుపు తాళం వేసి ఉండగా, వెనుక తలుపు తెరచి ఉండటంతో వెళ్లి చూడగా.. బాత్రూమ్‌లో ధారలై పారుతున్న రక్తంలో కూతుర్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు .. అక్కడ చిన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రబుద్ద గొంతు, మణికట్టును కోసుకుని ఆత్మహత్య చేసుకుందని భావించారు.

కాగా, ఇంట్లో ఎలాంటి వస్తువలు దొంగతనానికి గురి కావపోవడంతో దీన్ని సూసైట్ కింద కేసు నమోదు చేశారు. అయితే తల్లి మాత్రం ఇది హత్యేనని ఫిర్యాదు చేసింది. పోలీసులకు దొరికిన కత్తితో చేయి, మెడ కోసి తన కూతుర్ని హత్య చేశారని పేర్కొంది. ముఖం, తల వెనుక భాగంలో బలంగా కొట్టిన ఆనవాళ్లున్నాయని చెబుతుంది. ఆ రోజు తాను బయటకు వెళ్లేంత వరకు అంటే మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రబుద్ద బాగానే ఉందని తెలిపింది. అప్పటి వరకు ఆమె సోదరుడు ఇంట్లోనే ఉన్నాడని, బయటకు వెళ్లాక ఈ హత్య జరిగిందని అనుమానం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం 1.30 గంటలకు తన కుమార్తెతో ఫోనులో మాట్లాడినట్లు వెల్లడించింది. కాగా, పోలీసులు మాత్రం డెట్ నోట్ దొరికిందని, ఆమె సూసైట్ చేసుకున్న కత్తిని స్వాధీనం చేసుకున్నామని, విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. హత్య కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. ఇది హత్య, ఆత్మహత్య  తేలాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి