iDreamPost

హైదరాబాద్‌లో దారుణం! 16 ఏళ్ల బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం!

Cell Phone.. Hyderabad: చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఉండే ఆయుధంగా మారింది సెల్ ఫోన్. ఇది లేకుంటే పూట గడవడం కష్టంగా మారింది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు దీనికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. దీంతో పెరేంట్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది.

Cell Phone.. Hyderabad: చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఉండే ఆయుధంగా మారింది సెల్ ఫోన్. ఇది లేకుంటే పూట గడవడం కష్టంగా మారింది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు దీనికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. దీంతో పెరేంట్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది.

హైదరాబాద్‌లో దారుణం! 16 ఏళ్ల బాలికపై  ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం!

పొద్దున లేస్తూనే ఫోన్. అర్థరాత్రి వరకు ఆ మాయ పేటికలోనే సమయం గడిపేస్తున్నారు పిల్లలు, పెద్దలు. ముఖ్యంగా టీనేజ్, యూత్ యువతీ యువకులు అందులో తలమునకలు అయిపోతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు హెల్ప్ చేయకుండా అస్తమాను ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. అంతే కాకుండా వయస్సుకు మించి వ్యవహారాలను ఫోనులో చక్కబెడుతున్నారు. నిండా 18 సంవత్సరాలు నిండని అమ్మాయిలు, అబ్బాయిలు.. సెల్ ఫోనులో చాటింగ్, ఫోన్స్ అంటూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు మందలిస్తుంటారు. తల్లిదండ్రులు కోప్పడడటం ఆలస్యం అన్నం మీద అలిగి కూర్చుంటారు కొంత మంది పిల్లలు. మరికొంత మంది అయితే ఇంట్లో నుండి కోపంతో వెళ్లిపోతుంటారు. వీరిని వెతికి వెతికి పట్టుకొస్తుంటారు పెరేంట్స్. అరవమని, కోప్పడమని సర్ది చెబితే తిరిగి వస్తుంటారు. అలా ఇంట్లో నుండి వెళ్లిపోయిన అనేక మంది పిల్లలు అనాధలుగా బతుకుతుంటారు.

మగ పిల్లలది ఒక దారైతే.. ఆడ పిల్లల పరిస్థితి అధ్వానం. అందులోనూ ఈడొచ్చిన ఆడ పిల్ల బయటకు వెళితే పరిస్థితి ఊహించని పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుంది. తాజాగా సికింద్రాబాద్‌లో ఈ తరహా ఘటనే వెలుగు చూసింది. గంటల తరబడి ఫోనులో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలించడంతో సికింద్రాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక ఇంట్లో నుండి పారిపోయింది. బయటకు వెళ్లాక.. ఆమెకు ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆమె వివరాలు తెలుసుకున్న సందీప్.. ఇదే అదునుగా భావించి.. ఆమెకు మాయ మాటలు చెప్పాడు. రోడ్డు మీద ఉండటం మంచిది కాదంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు.

అతడి దురుద్దేశం తెలియని బాలిక.. సందీప్‌తో కలిసి లాడ్జికి వెళ్లింది. అక్కడకు వెళ్లాక ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు సందీప్. దీంతో ఆమె ఏడ్చుకుంటూ తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె పేరెంట్స్. పోలీసులు సందీప్ రెడ్డిని అదుపులోకి తీసకుని విచారిస్తున్నారు. అతడిపై పోక్సోతో పాటు పలు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘనటలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. టీనేజీ అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి వారిని లొంగదీసుకుని జీవితం నాశనం చేసిన ఘటనలు చూస్తున్నా.. చాలా మంది తొందరపాటుతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

గమనిక:

ఈ ఘటనకు సంబంధించి ర్యాపిడో సంస్థ తమ వివరణ ఇచ్చింది. అలాగే వారి సంస్థకు ఈ ఘనటకు ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని స్పష్టం చేసింది. ఆ అఘాయిత్యం జరిగిన సమయంలో సందీప్ రెడ్డి డ్యూటీలో లేడని వెల్లడించింది. అలాగే ఆ అమ్మాయి నుంచి ఎలాంటి రైడ్ కూడా బుక్ కాలేదు అనే విషయాన్ని తెలియజేసింది. తమ ప్రయాణికుల రక్షణ విషయంలో ర్యాపిడో సంస్థ అస్సలు నిర్లక్ష్యం వహించదు అనే విషయాన్ని స్పష్టం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి