iDreamPost

సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా.. త్వరలోనే హీరోగా!

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన బాల నటులు.. ఇప్పుడు హీరోలుగా మారుతున్న సంగతి విదితమే. అలాగే సూర్యవంశంతో ఆకట్టుకున్న ఈ నటుడు.. ఇప్పుడు ఎంతలా మారిపోయాడో తెలుసా.. త్వరలో ఇతగాడు కూడా

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన బాల నటులు.. ఇప్పుడు హీరోలుగా మారుతున్న సంగతి విదితమే. అలాగే సూర్యవంశంతో ఆకట్టుకున్న ఈ నటుడు.. ఇప్పుడు ఎంతలా మారిపోయాడో తెలుసా.. త్వరలో ఇతగాడు కూడా

సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా.. త్వరలోనే హీరోగా!

ఒకప్పడు వెండితెరపై మెరిసిన చైల్డ్ ఆర్టిస్టులంతా నేడు హీరోగా మారుతున్న సంగతి విదితమే. ‘నేనున్నాను నాయనమ్మ’ అంటూ ఇంద్రలో మెప్పించిన తేజ సజ్జా.. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. సీనియర్ హీరోలకు కూడా అందని రేర్ ఫీట్.. 300 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టాడు. అలాగే గంగ్రోతి మూవీతో అలరించిన కావ్య కళ్యాణ్ రామ్ సైతం ఇప్పుడు హీరోయిన్‌గా సత్తా చాటుతుంది. మసూద, బలగం వంటి వరుస విజయాలతో దూసుకెళుతుంది. అలాగే దేవీ మూవీ చైల్డ్ ఆర్టిస్టు కూడా..కోలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాగే మరో చైల్డ్ ఆర్టిస్టు కూడా హీరోగా మారేందుకు సిద్ధమయ్యాడు. అతడు సినిమాల్లో నటిస్తుండగా.. ఇంకా విడుదలకే నోచుకోవడం లేదు.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లాడు గుర్తున్నాడు కదా. జగపతి బాబు, సౌందర్య, మహేశ్వరి హీరో హీరోయిన్లుగా వచ్చిన ప్రియరాగాలు మూవీలో నటించాడు. అందులో జగపతి బాబు కొడుకుగా నటించి ఆకట్టుకున్నాడు. అతడే ఆనంద్ హర్షవర్దన్. అతడు బ్యాగ్రౌండ్ మామాలుగా లేదు. ఆనంద్ వర్దన్.. ప్రముఖ కంపోజర్, ప్లే బ్యాక్ సింగర్ పిబీ శ్రీనివాస్ మనవడు. ఇతడు జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం మూవీలో వాల్మికీ, బాల హనుమాన్ పాత్రలు పోషించాడు. ప్రేమించుకుందాం రా మూవీలో వెంకటేష్ మేనల్లుడిగా నటించి.. ఆ తర్వాత అదే వెంకటేష్‌తో కొడుకుగా యాక్ట్ చేశాడు. సూర్య వంశంలో వెంకటేశ్ (ద్విపాత్రాభినయం)కు కొడుకుగా, మనవడిగా కనిపించి అలరించాడు. ఆ తర్వాత మావిడాకులు చిత్రంలో మెరిశాడు.

పెళ్లి పీటలు, ప్రేయసి రావే, తిరుమల తిరుపతి వెంకటేశ, మనసంతా నువ్వే, ఇంద్ర, తొలి చూపులోనే, నేనున్నాను వంటి చిత్రాల్లో మెరిశాడు ఆనంద్ వర్థన్. హిందీ, కన్నడలో ఒక్కో చిత్రం చేశాడు. ఆ తర్వాత చదువు నిమిత్తం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్టుగా 25 పైగా సినిమాలు చేశాడు. హైదరాబాద్ సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చేసిన ఆనంద్.. ఇప్పడు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. సుమారు చాలా గ్యాప్ తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆన్ ది వే సినిమా ఎనౌన్స్ చేశాడు. కానీ ఇంకా విడుదల కాలేదు. దీంతో పాటు నిదురించు జహాపన అనే మూవీని కూడా చేస్తున్నాడు. ఈ మూవీ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమాకి అనూపర్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. గత రెండేళ్ల నుండి హీరోగా లాంచ్ అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మరీ ఈ కుర్రాడు త్వరలోనే హీరోగా అలరించబోతున్నాడన్నమాట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి