iDreamPost

Garuda Purana OTT: OTTలో గరుడ పురాణ పేరుతో సీరియ‌ల్ కిల్ల‌ర్ మూవీ! ఒంటరిగా చూడొద్దు!

  • Published May 22, 2024 | 4:47 PMUpdated May 22, 2024 | 4:47 PM

కొన్ని సినిమాలు ఓటీటీ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ అయిపోతూ ఉంటాయి. ఎటువంటి బజ్ లేకుండా వచ్చినా కూడా ఆ సినిమాలు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ ను సంపాదించుకుంటాయి. ఇక ఇప్పుడు మరో సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.

కొన్ని సినిమాలు ఓటీటీ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ అయిపోతూ ఉంటాయి. ఎటువంటి బజ్ లేకుండా వచ్చినా కూడా ఆ సినిమాలు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ ను సంపాదించుకుంటాయి. ఇక ఇప్పుడు మరో సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.

  • Published May 22, 2024 | 4:47 PMUpdated May 22, 2024 | 4:47 PM
Garuda Purana OTT: OTTలో  గరుడ పురాణ పేరుతో సీరియ‌ల్ కిల్ల‌ర్ మూవీ! ఒంటరిగా చూడొద్దు!

కొన్ని సినిమాలు విపరీతమైన బజ్ తో ఓటీటీ లో రిలీజ్ అవుతుంటే కొన్ని సినిమాలు మాత్రం సైలెంట్ గా స్ట్రీమింగ్ అయిపోతూ ఉంటాయి, అయితే ఆయా సినిమాలు ఎలా వచ్చినా కానీ ఓటీటీ లోకి వచ్చే ప్రతి సినిమాకు, సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అసలే ఈ వారం అటు థియేటర్ లో సినిమాలు లేవని.. ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు కళ్ళు ఓటీటీ వైపుకు మళ్ళాయి, ఇటు ఓటీటీ లోను చెప్పుకోదగిన సినిమాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో మరొక కొత్త సినిమా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం .

ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా ఏడు నెలల తర్వాత సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సైకో కిల్లర్ సినిమాలను ఇప్పటివరకు ఎన్నో చూసి ఉంటారు కానీ ఇలాంటి ఓ సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. ఊహకు అందని ఎన్నో విషయాలు ఈ సినిమాలో ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఈ సినిమా పేరేంటంటే ” గరుడ పురాణం”. ఇది ఒక కన్నడ సినిమా. మంజునాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. థియేటర్ లో ఈ సినిమా భారీగానే వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి మాత్త్రం కేవలం రెంటల్ బేసిస్ లోనే అందుబాటులో ఉంది. త్వరలో ఈ సినిమాను ఫ్రీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారని సమాచారం.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ సీరియల్ కిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. కర్ణాటక బోర్డర్ లో వరుసగా అమ్మాయిలంతా హత్యలకు గురి అవుతూ ఉంటారు. కానీ ఆ హత్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉండవు. దీనితో ఈ మర్డర్ మిస్టరీస్ ను సాల్వ్ చేసేందుకు.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో వారికి ఊహించని పరిణామాలు ఎదురౌతాయి. ఓ ముగ్గురు స్నేహితులకు ఈ హత్యలతో సంబంధం ఉన్నట్లు గుర్తిస్తారు పోలీసులు. అసలు ఆ అమ్మాయిలు ఎలా చనిపోతారు ? ఆ ముగ్గురు స్నేహితులు ఎవరు ? ఈ హత్యలకు వారికి సంబంధం ఏంటి ? పోలీసులకు ఎలాంటి క్లూస్ లభిస్తాయి? చివరికి ఈ కేసును ఎలా సాల్వ్ చేస్తారు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి