iDreamPost

Vallavan Vaguthadhada OTT: డబ్బు- బంగారం- గ్యాంగ్ వార్.. OTTలోకి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్!

  • Published May 22, 2024 | 4:09 PMUpdated May 24, 2024 | 11:16 AM

తెలుగు తమిళం అని తేడా లేకుండా ఓటీటీ లోకి వచ్చిన సినిమాలన్నిటిని కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందులోను ఇతర భాషల చిత్రాలను మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు, ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ లోకి రాబోతుంది.

తెలుగు తమిళం అని తేడా లేకుండా ఓటీటీ లోకి వచ్చిన సినిమాలన్నిటిని కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందులోను ఇతర భాషల చిత్రాలను మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు, ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ లోకి రాబోతుంది.

  • Published May 22, 2024 | 4:09 PMUpdated May 24, 2024 | 11:16 AM
Vallavan Vaguthadhada OTT: డబ్బు- బంగారం- గ్యాంగ్ వార్.. OTTలోకి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్!

తెలుగులో ఉంటేనే సినిమాలు చూస్తాం అనుకుంటే.. ఎన్నో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మిస్ చేసినట్లే. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూస్తూ ఉన్నారు. కాబట్టి దాదాపు ప్రతి వారం ఓటీటీ లోకి వచ్చే అన్ని సినిమాలను, సిరీస్ లను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక కొత్త సినిమా ఓటీటీ లోకి రాబోతుంది. అసలే ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు ఓటీటీ లోకి వస్తాయా అని చూస్తున్న క్రమంలో.. ఇప్పుడు ఈ సినిమా కూడా రావడంతో ప్రేక్షకులకు ఈ వారం మరింత ఎంటర్టైన్మెంట్ లభిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

తమిళ సినిమా క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్లకు ఇప్పుడు చెప్పుకునే సినిమా ఖచ్చితంగా.. నచ్చేస్తుంది. ఈ సినిమా పేరు కంటే ముందు.. ఈ సినిమా కథేంటో చూసేద్దాం. ఈ సినిమా మొత్తం కూడా ఐదుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. వారి వారి వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఆర్థిక సహాయాన్ని కోసం ఎదురుచూస్తూ ఉంటారు. సొంతంగా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వారంతా ఏకమయ్యి ఓ మిషన్ లో పాలుపంచుకుంటారు. ఆ తర్వాత వారి జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎలాంటి పరిస్థితులను వారంతా ఎదురుకున్నారు. అనేది ఈ సినిమా కథ. ఇది ఒక తమిళ సినిమా. ఈ సినిమా పేరు వల్లవన్ వాగుతాధడ. ఈ సినిమా ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో అత్యధికంగా 9.8 రేటింగ్ దక్కించుకుంది.

ఈ సినిమాలో క్రైమ్, డ్రామా, ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను చివరి వరకు ఎంగేజింగ్ ఉంచుతుంది. అందులోను ఈ తరహా చిత్రాలను తీయడంలో తమిళ మూవీ మేకర్స్ ఆరితేరిపోయి ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమా ప్రస్తుతానికి అయితే కేవలం తమిళ్ లోనే అందుబాటులోకి రానుంది. ఇక ఈ సినిమా మే 24నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు ఓటీటీ లో లభించే ఆదరణను బట్టి తెలుగులో కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి