iDreamPost

25 కోట్లకు న్యాయం చేసిన స్టార్క్.. బిగ్ మ్యాచ్​లు అనగానే కంగారూలకు శక్తులన్నీ తిరిగొస్తాయా?

  • Published May 22, 2024 | 3:59 PMUpdated May 22, 2024 | 3:59 PM

ఐపీఎల్-2024 గ్రూప్ స్టేజ్​లో డామినేషన్ చూపించిన కోల్​కతా ప్లేఆఫ్స్​లోనూ అదరగొట్టింది. సన్​రైజర్స్​ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ గడప తొక్కింది. ఆ టీమ్ గెలుపులో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్-2024 గ్రూప్ స్టేజ్​లో డామినేషన్ చూపించిన కోల్​కతా ప్లేఆఫ్స్​లోనూ అదరగొట్టింది. సన్​రైజర్స్​ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ గడప తొక్కింది. ఆ టీమ్ గెలుపులో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు.

  • Published May 22, 2024 | 3:59 PMUpdated May 22, 2024 | 3:59 PM
25 కోట్లకు న్యాయం చేసిన స్టార్క్.. బిగ్ మ్యాచ్​లు అనగానే కంగారూలకు శక్తులన్నీ తిరిగొస్తాయా?

క్రికెట్​లో ద్వైపాక్షిక టోర్నీల్లో నెగ్గడం కంటే ఐసీసీ టోర్నీల్లో నెగ్గడం చాలా కష్టమనే విషయం తెలిసిందే. వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలాంటి బిగ్ టోర్నమెంట్స్​లో విజేతగా నిలవడం అంత ఈజీ కాదు. చాలా దేశాలను ఓడించి నాకౌట్, ఫైనల్ గండాన్ని దాటి కప్పు చేతబట్టడం అంటే మామూలు విషయం కాదు. చాలా మటుకు దేశాలు గ్రూప్ స్టేజ్​లో అదరగొట్టినా నాకౌట్, ఫైనల్స్​లో ఓడి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తాయి. కానీ ఆస్ట్రేలియా అలా కాదు.. ఒత్తిడిని చిత్తు చేయడం వాళ్లకు ఎంతో ఇష్టం. బిగ్ మ్యాచెస్​ను ఛాలెంజింగ్​గా తీసుకొని ఆడటం వాళ్లకు అలవాటైన సంప్రదాయం. వరల్డ్ కప్ అనే కాదు.. ఐపీఎల్ లాంటి లీగ్స్, ఇతర బడా టోర్నీల్లోనూ ఆసీస్ ప్లేయర్లు ఇదే తరహాలో ఆడి సక్సెస్ అవుతున్నారు.

ఐపీఎల్-2024లో భాగంగా సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన క్వాలిఫయర్-1లో కోల్​కతా నైట్ రైడర్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అదరగొట్టాడు. 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. డేంజరస్ ట్రావిస్ హెడ్​తో పాటు నితీష్​ రెడ్డి, షాబాజ్ అహ్మద్​ వికెట్లను పడగొట్టాడు. నితీష్, షాబాజ్​ను వెంటవెంటనే ఔట్ చేసి మ్యాచ్​ను కేకేఆర్ వైపు తిప్పాడు. ఈ సీజన్ మొత్తం దారుణంగా పెర్ఫార్మ్ చేసిన ఈ ఆసీస్ పేసర్.. కీలకమైన ప్లేఆఫ్స్ ఫైట్​లో మాత్రం సత్తా చాటాడు. కోల్​కతా తన మీద పెట్టిన 25 కోట్ల ధరకు న్యాయం చేశాడు. ఒంటిచేత్తో జట్టును ఫైనల్స్​కు చేర్చాడు. స్టార్క్ అనే కాదు.. నిన్నటి మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్ కెప్టెన్ కమిన్స్ కూడా అదరగొట్టాడు. బ్యాటింగ్​లో 30 పరుగులు చేసి టీమ్​ను కాపాడాడు. బౌలింగ్​లోనూ 1 వికెట్​ తీశాడు. వీళ్లు రాణించినా.. ఇంకో ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ ఒక్కడే ఫెయిలయ్యాడు.

ఇన్నాళ్లూ తుస్సుమన్న స్టార్క్.. క్వాలిఫయర్-1 చెలరేగడంతో అందరూ షాకవుతున్నారు. అయితే స్టార్క్, కమిన్స్ అనే కాదు.. దాదాపుగా అందరు కంగారూ క్రికెటర్లు నాకౌట్, ఫైనల్స్​లో బాగా ఆడతారు. కీలకమైన బిగ్ మ్యాచెస్​లో చెలరేగి ఆడటం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి మ్యాచ్​లు ఉంటే వాళ్ల శక్తులన్నీ తిరిగి వచ్చేస్తాయి. ఆస్ట్రేలియా క్రికెటర్లకు స్మాల్ ఏజ్ నుంచే భయపడకుండా ఆడటం అలవాటు చేస్తారు. ఫియర్​లెస్ అప్రోచ్​ వాళ్ల రక్తంలో కలసిపోయేలా కోచింగ్ ఇస్తారు. అందుకే వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీల్లో ఆసీస్ పోతే గ్రూప్ దశలోనే బయటకు వెళ్లిపోతుంది. ఒకవేళ ప్రత్యర్థుల కర్మ కాలి నాకౌట్​ దశకు చేరుకుందా కప్పు కొట్టనిదే వదలదు. అప్పటిదాకా విఫలమవుతూ వచ్చిన ఆటగాళ్లు కూడా శక్తులన్నీ తిరిగి పొందినట్లు అదరగొడతారు. ఆ మ్యాచ్​ల్లో రాణించాలనే ఉత్సాహం, ప్రెజర్​ను అవతలి వాళ్ల మీదకు నెట్టాలనే కసి, గెలవాలనే తపనే వాళ్లు అంతగా పెర్ఫార్మ్ చేయడానికి కారణాలుగా అనలిస్టులు చెబుతున్నారు. మరి.. కంగారూ క్రికెటర్లు బిగ్ మ్యాచెస్​లో అదరగొట్టడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి