iDreamPost

AP రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలర్ట్.. పలు రైళ్లు రద్దు

ఏపీ రైలు ప్రయాణీకులకు బిగ్ అలర్ట్. విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. ఇంతకు ఏఏ రైళ్లు ఏఏ రోజుల్లో రద్దు కానున్నాయంటే..?

ఏపీ రైలు ప్రయాణీకులకు బిగ్ అలర్ట్. విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. ఇంతకు ఏఏ రైళ్లు ఏఏ రోజుల్లో రద్దు కానున్నాయంటే..?

AP రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలర్ట్.. పలు రైళ్లు రద్దు

ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలర్ట్. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైల్వే డివిజన్ పరిధిలోని మరమ్మత్తులు, ఇతర నిర్వాహణ పనుల కారణంగా పలు ట్రైన్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నుండి లేదా విజయవాడ మీదుగా చెన్నై రాకపోకలు సాగిస్తున్న ప్రయాణీకులకు అలర్ట్.  ఈ వార్త మీ కోసమే. బిట్ర గుంట- విజయవాడ- చెన్నై రైల్వే స్టేషన్ల మధ్య రైళ్లు రద్దు కానున్నాయి. కొన్ని రోజుల పాటు ఈ మార్గంలో పలు రైళ్లు క్యాన్సిల్ కాబోతున్నాయి. కాకినాడ పోర్ట్, విశాఖ పట్నం మధ్య నడిచే ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అవ్వనున్నాయి. ఇంకా ఏమేమీ ట్రైన్స్, ఎప్పటి వరకు రద్దు కానున్నాయో పూర్తి వివరాల్లోకి వెళితే..

07977/07978 నంబర్ గల విజయవాడ- బిట్రగుంట మధ్య నడిచే రైళ్ల రాకపోకలను ఈ నెల 27 నుండి జూన్ 23 వరకు నిలిపివేస్తున్నారు అధికారులు. అలాగే ఈ నెల 27 నుండి 31వ తేదీ వరకు 17237/17238 నంబర్ గల బిట్రగుంట-చెన్నై సెంట్రల్ మధ్య రాకపోకలు సాగించే మెమూ రైలును కూడా ఆపేస్తున్నారు. అలాగే ఈ జూన్ 3 నుండి 7వ తేదీ వరకు అలాగే జూన్ 10 నుండి 14 వరకు, అదేవిధంగా 17 నుండి 21 తేదీల మధ్య కూడా ఈ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు-రాయగడ మధ్య నడిచే 17243/17244 నంబర్ ట్రైన్ కూడా మే 27 నుండి జూన్ 24 వరకు క్యాన్సిల్ కానుంది. కాకినాడ పోర్ట్, విశాఖల మధ్య నడిచే 17267/17268 నంబర్ ట్రైన్ కూడా రద్దు కానుంది.

విజయవాడ-మచిలీ పట్నం మధ్య నడిచే 07896 నంబర్ మెమూ రైలు కూడా రద్దు చేయనుంది. 07769 నంబర్ గల విజయవాడ-మచిలీపట్నం ట్రైన్‌, విజయవాడ-మచిలీపట్నం (07866), మచిలీపట్నం-విజయవాడ (07770), మచిలీపట్నం-విజయవాడ (07870), విజయవాడ-నర్సపూర్‌ (07861), నర్సపూర్‌-విజయవాడ (07863), విజయవాడ-భీమవరం జంక్షన్ (07283) రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని రైళ్లను విజయవాడ-గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. ఎర్నాకులం-పాట్నా (22643) రైలును మే 27, జూన్ 3, 10, 17న తేదీల్లో దారి మళ్లించారు. భావనగర్-కాకినాడ పోర్ట్ మధ్య నడిచే 12756 నంబర్ ట్రైన్‌ను జూన్‌ 1, 8, 15, 22 తేదీల్లో దారి మళ్లించనున్నారు. దీంతో పాటు 12509 నంబర్ గల బెంగళూరు-గౌహతి ట్రైన్ మే 29, 31 తేదీల‌తో పాటు జూన్‌ 5, 7, 12, 14, 19, 21 తేదీల్లో కూడా దారి మళ్లించారు. ధన్‌బాద్‌-అల్లపూజ (13351) ట్రైన్ మే 27వ తేదీ నుంచి జూన్‌ 23 వరకు కూడా దారి మళ్లనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి