iDreamPost

Samantha: సమంత పోస్ట్‌పై RCB ఫ్యాన్స్‌ రచ్చ.. ఏం జరిగిందంటే

  • Published May 22, 2024 | 2:23 PMUpdated May 22, 2024 | 2:23 PM

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌కు ఆర్సీబీ ఫ్యాన్స్‌ థాంక్స్‌ చెబుతున్నారు. ఆమె చేసిన ఓ పోస్ట్‌ను తెగ వైరల్‌ చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌కు ఆర్సీబీ ఫ్యాన్స్‌ థాంక్స్‌ చెబుతున్నారు. ఆమె చేసిన ఓ పోస్ట్‌ను తెగ వైరల్‌ చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..

  • Published May 22, 2024 | 2:23 PMUpdated May 22, 2024 | 2:23 PM
Samantha: సమంత పోస్ట్‌పై RCB ఫ్యాన్స్‌ రచ్చ.. ఏం జరిగిందంటే

ఐపీఎల్‌ 2024 తుది దశకు చేరుకుంది. ఇక మంగళవారం నాడు జరిగిన తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ ఓటమి పాలైంది. కేకేఆర్‌ చేతిలో ఏకంగా 8 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవి చూసింది. ఈ ఓటమి వల్ల ఎస్‌ఆర్‌హెచ్‌ క్వాలిఫైయర్‌ 2 ఆడాల్సి వస్తుంది. ఇక నేడు అనగా మే 22, బుధవారం జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ.. రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలని చాలా మంది కోరుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలు సైతం నిర్వహిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇప్పుడిదే ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఆర్సీబీ ఫ్యాన్స్‌ రచ్చ చేస్తున్నారు. అసలు సమంత చేసిన పోస్ట్‌కు.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు సంబంధం ఏంటి అంటే..

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా ఈ గ్యాప్‌ తీసుకుంది. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. వరుసగా పోస్ట్‌లు చేస్తూ.. అప్డేట్స్‌ ఇస్తూ.. తన అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సమంత చేసిన పోస్ట్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ చూస్తే.. ఆమె ఎవరిపి ఉద్దేశించి చేసిందో అర్థం కావడం లేదు.

కానీ నెటిజనులు మరీ ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్‌ మాత్రం.. రచ్చ రచ్చ చేస్తున్నారు. కారణం ఏంటంటే.. సమంత తన ఇన్‌స్టాలో.. ఎవరిని ఉద్దేశించి అనేది చెప్పకుండానే.. నువ్వు గెలవడం నేను చూడాలి అని పోస్ట్‌ చేసింది. అంతేకాక నీ హృదయం ఏది కోరుకున్నా.. నీ ఆకాంక్షలు ఏవైనా.. నేను నీ కోసం నిలబడతాను.. నువ్వు గెలవడానికి అర్హుడివి అనే క్యా‍ప్షన్‌ జత చేసింది. ఇప్పుడీ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

సామ్‌ చేసిన ఈ పోస్ట్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్‌ రచ్చ చేస్తున్నారు. ఈరోజు ఆర్సీబీ మ్యాచ్‌ ఉండటంతో చాలా మంది సమంత.. కోహ్లిని ఉద్దేశించే ఈ పోస్ట్‌ చేసిందని.. ఆమె కూడా ఆర్సీబీ గెలుపునే కోరుకుంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే నెటిజనులు ఇలా ఊహించుకోవడానికి కారణం కూడా ఉంది. గతంలో చాలా ఇంటర్వ్యూల్లో.. సమంత విరాట్‌ కోహ్లిపై ప్రశంసలు కురిపించింది. దాంతో ఈరోజు సమంత చేసిన పోస్ట్‌ కోహ్లి గురించే అని ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఫిక్సయ్యారు. సామ్‌కు థాంక్స్‌ చెబుతూనే.. ఈ రోజు మీ కోరిక కచ్చితంగా నెరవేరుతుంది అని కామెంట్స్‌ చేన్నారు. మరి నేటి ఆర్సీబీ వర్సెస్‌ ఆర్‌ఆర్‌ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో.. ఎవరు గెలుస్తారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి