iDreamPost

YouTuber Irfan: ప్రముఖ యూట్యూబర్ అత్యుత్సాహం.. వార్నింగ్ ఇచ్చిన ప్రభుత్వం.. ఏమైందంటే?

సెలబ్రిటీలు, ఇతర యూట్యూబ్ స్టార్లు అనుకోకుండా వారు చేసే పనులు..చిక్కుల్లో పడేస్తాయి. తాజాగా ఓ యూట్యూబర్ చేసిన ప్రకటన..అతడికి తల నొప్పి తెచ్చిపెట్టింది. చివరకు ప్రభుత్వం నుంచి అతడికి కీలక ఆదేశాలు వెళ్లాలి.

సెలబ్రిటీలు, ఇతర యూట్యూబ్ స్టార్లు అనుకోకుండా వారు చేసే పనులు..చిక్కుల్లో పడేస్తాయి. తాజాగా ఓ యూట్యూబర్ చేసిన ప్రకటన..అతడికి తల నొప్పి తెచ్చిపెట్టింది. చివరకు ప్రభుత్వం నుంచి అతడికి కీలక ఆదేశాలు వెళ్లాలి.

YouTuber Irfan: ప్రముఖ యూట్యూబర్ అత్యుత్సాహం.. వార్నింగ్ ఇచ్చిన ప్రభుత్వం.. ఏమైందంటే?

ఎవరైనా, ఎలాంటి పనులైన చేసుకోవచ్చు. అయితే ఆ పనులు అనేవి చట్టాలకు లోపడి, నేరాలు కానటువంటి పనులు అయ్యి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం చేసే కొన్ని పనులు నేరాలు కాదు అనుకుంటాము. అయితే అవే చివరకు మనల్ని చిక్కుల్లో పడేస్తుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇతర యూట్యూబ్ స్టార్లు అనుకోకుండా వారు చేసే పనులు..చిక్కుల్లో పడేస్తాయి. తాజాగా ఓ యూట్యూబర్ చేసిన ప్రకటన..అతడికి తల నొప్పి తెచ్చిపెట్టింది. చివరకు ప్రభుత్వం నుంచి అతడికి కీలక ఆదేశాలు వెళ్లాలి. ఇంతకీ ఆ యూట్యాబర్ ఎవరు, ఆ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ్ తమిళ్ యూట్యూబర్ ఇర్భాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా కోలివుడ్ ఆడియాన్స్ కి ఇతడు సుపరిచుతుడు. అనేక రకాల వీడియోలు చేస్తూ… అందరిని ఆకట్టుకుంటాడు. ఆయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకా పెద్ద సంఖ్యలోనే సబ్ సబ్ స్కైబర్లు ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా అతడు చేసిన ఓ ప్రకటన చర్చనీయాశంగా మారింది. తనకు పుట్టబోయే బిడ్డ జండర్ ను తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. కొన్ని రోజుల క్రితం తన భార్యతో కలిసి దుబాయ్ టూర్ వెళ్లాడు. అక్కడ ఇర్ఫాన్  తన భార్యకు లింగనిర్థారణ పరీక్ష చేయించాడు.

ఈనెల19న తన కుటుంబ వేడుకను నిర్వహించాడు. ఆ ఫంక్షన్ రోజున తనకు పుట్టబోయేది పాప అని ప్రకటించాడు. అంతేకాక అలా తాను చేసిన ప్రకటనకు సంబంధించిన  ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అంతేకాక ఇర్ఫాన్ చేసిన ప్రకటనను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా సీరియస్ గా తీసుకుంది. భారత దేశంలో లింగనిర్థారణ పరీక్షలు చట్టరిత్యా నేరం. కాబట్టి యూట్యూబర్ ఇర్ఫాన్‌ ఆ వీడియో డిలీట్ చేయాలని తమిళనాడు ఆరోగ్య శాఖ ఆదేశిస్తూ నోటీసులు పంపింది. సైబర్ క్రైం డిపార్ట్ మెంట్ కు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇర్ఫాన్ కి సంబంధింన ఆ వీడియో ఇంటర్నెట్ నుంచి తీసేయాలని సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కి లేఖ రాసింది.

ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్-1994 ప్రకారం లింగ నిర్ధారణను స్కానింగ్ చేయించొద్దు. ఇలా చేస్తే నేరమే కాక.. అందుకు శిక్ష కూడా పడుతుంది. అలా లింగ నిర్ధారణ చేసిన వైద్యులు, ఆస్పత్రులపై ప్రభుత్వాలు, అధికారులు చర్యలు తీసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అంతేకాక ఇలాంటి ఇల్లిలీగర్ యాక్టివిటీస్ ను ప్రోత్సహించే వారిపై కూడా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా తాను ఏదో అనుకుని..పుట్టబోయే బిడ్డ గురించి షేర్ చేసిన ఇర్ఫాన్ ప్రభుత్వం నుంచి హెచ్చరికలు అందుకున్నాడు. ఇలా గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు అనుకోకుండా చేసిన పనులు వారిని చిక్కుల్లో పడేశాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి