iDreamPost

IPL 2024: IPLల్లో పూర్తి డామినేషన్.. సరికొత్త చరిత్ర సృష్టించిన CSK!

తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో సరికొత్త చరిత్ర సృష్టించి.. ఐపీఎల్లో ఆ రికార్డు సాధించిన ఏకైక జట్టుగా ప్రశంసలు దక్కించుకుంటోంది చెన్నై సూపర్ కింగ్స్. ఆ రికార్డుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో సరికొత్త చరిత్ర సృష్టించి.. ఐపీఎల్లో ఆ రికార్డు సాధించిన ఏకైక జట్టుగా ప్రశంసలు దక్కించుకుంటోంది చెన్నై సూపర్ కింగ్స్. ఆ రికార్డుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024: IPLల్లో పూర్తి డామినేషన్.. సరికొత్త చరిత్ర సృష్టించిన CSK!

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ మెగాటోర్నీలో డామినేషన్ చేస్తూ వచ్చిన జట్లు కేవలం రెండే రెండని చెప్పాలి. అందులో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ కాగా.. రెండోది ముంబై ఇండియన్స్. ఈ రెండు జట్లు ఐపీఎల్ ను పూర్తిగా డామినేషన్ చేశాయి. ఇరు జట్లు చెరో ఐదు టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ముంబై కంటే ఓ విషయంలో ముందుంది చెన్నై టీమ్. తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో సరికొత్త చరిత్ర సృష్టించి.. ఐపీఎల్లో ఆ రికార్డు సాధించిన ఏకైక జట్టుగా ప్రశంసలు దక్కించుకుంటోంది. ఆ రికార్డుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై-గుజరాత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 63 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. శివమ్ దూబే (51), కెప్టెన్ రుతురాజ్(46), రచిన్ రవీంద్ర(46) పరుగులతో రాణించారు. చివరల్లో యంగ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ 6 బంతుల్లో 14 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. అనంతరం 207 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. ఇక ఈ మ్యాచ్ లో 200+ స్కోర్ చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది చెన్నై టీమ్. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా చెన్నై నిలిచింది. ఇంతకీ ఆ ఘనత ఏంటంటే?

This record is only possible for CSK

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎక్కువ సార్లు 200+ స్కోర్లు సాధించిన జట్టుగా చెన్నై నిలిచింది. ఈ మెగాటోర్నీలో ఏకంగా 29 సార్లు 200కు పైగా పరుగులు చేసింది. ఏ జట్టు కూడా ఇన్నిసార్లు ఈ ఘనతను సాధించలేదు. ఇక ఈ లిస్ట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ రెండో ప్లేస్ లో ఉంది. ఆర్సీబీ 24 సార్లు 200కు పైగా స్కోర్లు చేసింది. ముంబై 22, పంజాబ్ 21, కేకేఆర్ 19 సార్లు ఈ ఘనతను సాధించాయి. మరి ఐపీఎల్ ను పూర్తిగా డామినేట్ చేస్తూ.. రేర్ ఫీట్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024: తొలి బంతికే సిక్సర్.. రషీద్ ఖాన్ కి చుక్కలు చూపించిన 20 ఏళ్ల కుర్రాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి