iDreamPost

టీ 20 వరల్డ్ కప్ సెలక్షన్ లో ట్విస్ట్! టీమిండియాలోకి ఆ రాక్షసుడు! ఇక ప్రత్యర్ధులకి చావే!

  • Published Apr 27, 2024 | 8:01 AMUpdated Apr 27, 2024 | 4:51 PM

ఈ ఐపీఎల్​లో విధ్వంసక బ్యాటింగ్​తో బౌలర్లను ఊచకోత కోస్తున్న వారిలో పంజాబ్ కింగ్స్ ఫినిషర్ శశాంక్ సింగ్ ఒకడు. నిన్న కోల్​కతా నైట్ రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లోనూ అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అలాంటి శశాంక్​కు గోల్డెన్ ఛాన్స్.

ఈ ఐపీఎల్​లో విధ్వంసక బ్యాటింగ్​తో బౌలర్లను ఊచకోత కోస్తున్న వారిలో పంజాబ్ కింగ్స్ ఫినిషర్ శశాంక్ సింగ్ ఒకడు. నిన్న కోల్​కతా నైట్ రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లోనూ అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అలాంటి శశాంక్​కు గోల్డెన్ ఛాన్స్.

  • Published Apr 27, 2024 | 8:01 AMUpdated Apr 27, 2024 | 4:51 PM
టీ 20 వరల్డ్ కప్ సెలక్షన్ లో ట్విస్ట్!  టీమిండియాలోకి ఆ రాక్షసుడు! ఇక ప్రత్యర్ధులకి చావే!

ఐపీఎల్​లో విధ్వంసక బ్యాటింగ్​తో బౌలర్లను ఊచకోత కోస్తున్న వారిలో పంజాబ్ కింగ్స్ ఫినిషర్ శశాంక్ సింగ్ ఒకడు. నిన్న కోల్​కతా నైట్ రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లోనూ అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రికార్డు ఛేజింగ్​లో పంజాబ్ గెలుపులో అతడిదే కీలకపాత్ర. ఆఖర్లో వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్​తో మ్యాచ్​ను పంజాబ్ వైపు తిప్పాడతను. కేవలం 28 బంతుల్లోనే 68 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఈ క్రమంలో 2 బౌండరీలు బాదిన ఈ పించ్ హిట్టర్ ఏకంగా 8 సిక్సులు కొట్టాడు. దీన్ని బట్టే అతడి బాదులు ఏ రేంజ్​లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్ ఘనవిజయంలో కీలకపాత్ర పోషించిన శశాంక్​ సింగ్​కు గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

ఐపీఎల్ ముగిసిన కొద్ది గ్యాప్​లోనే మరో మెగా టోర్నీ మొదలుకానుంది. అదే టీ20 వరల్డ్ కప్. జూన్ 2వ తేదీ నుంచి పొట్టి ప్రపంచ కప్​కు తెరలేవనుంది. ఈ టోర్నీలో ఆడే టీమ్స్​ను త్వరలో ప్రకటించనున్నారు. టీమిండియా స్క్వాడ్ ఎనౌన్స్​మెంట్ కూడా మూడ్నాలుగు రోజుల్లో ఉండనుందని అంటున్నారు. ఇప్పటికే భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సహా ఇతర సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు ఓ దఫా ఢిల్లీలో సమావేశం అయ్యారని సమాచారం. బౌలర్లతో పాటు వికెట్ కీపర్‌‌ విషయంలో క్లారిటీకి వచ్చారని.. తదుపరి బ్యాటింగ్ యూనిట్ ఖాయం అయిపోతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ టీమ్​లో తాజాగా శశాంక్ సింగ్ పేరు వినిపిస్తోంది.

Golden chance for Shashank

ఫినిషర్ రోల్ కోసం శశాంక్ సింగ్ పేరును సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా కమ్​బ్యాక్​లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఐపీఎల్​లో అటు బ్యాటర్​గా, ఇటు బౌలర్​గా అతడు దారుణంగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అదే టైమ్​లో చెన్నై సూపర్ కింగ్స్ పించ్ హిట్టర్ శివమ్ దూబె సూపర్​ ఫామ్​లో ఉన్నాడు. దూబె విధ్వంసక ఇన్నింగ్స్​లతో విరుచుకుపడుతున్నాడు. కాబట్టి అతడ్ని ఫినిషర్ రోల్​కు సెలక్ట్ చేయాలని భావిస్తున్నారట. అలాగే దూబెకు బ్యాకప్​గా శశాంక్​ను కూడా వరల్డ్ కప్​కు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఐపీఎల్​లో ఇప్పటిదాకా ఆడిన 9 మ్యాచుల్లో 262 రన్స్ చేసిన శశాంక్.. నిన్న పంజాబ్ కింగ్స్​తో మ్యాచ్​లో సిక్సర్లతో శివతాండవం చేశాడు. అతడి సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ, మ్యాచ్ ఫినిష్ చేసే క్వాలిటీస్ బీసీసీఐ పెద్దల్ని అట్రాక్ట్ చేశాయట. అందుకే వరల్డ్ కప్ టీమ్​లో శశాంక్​ను తీసుకునేందుకు జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయని వినిపిస్తోంది. మరి.. శశాంక్​ వరల్డ్ కప్ టీమ్​లో ఉండాలని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి