iDreamPost
android-app
ios-app

బాబు అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్‌కి 10 ప్రశ్నలు! వైరల్ అవుతున్న పోస్ట్!

  • Published Sep 11, 2023 | 2:25 PM Updated Updated Sep 11, 2023 | 3:38 PM
  • Published Sep 11, 2023 | 2:25 PMUpdated Sep 11, 2023 | 3:38 PM
బాబు అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్‌కి 10 ప్రశ్నలు! వైరల్ అవుతున్న పోస్ట్!

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ స్కామ్‌ కేసులో భాగంగా ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీరుపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవినీతిని, అక్రమార్జనను సహించేది లేదు.. ప్రశ్నిస్తాను అనే పవన్‌ కళ్యాణ్‌.. వందల కోట్ల రూపాయల స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబుకు మద్దతు పలకడమే కాక.. అరెస్ట్‌ను ఖండించడం చూసి జనసేన పార్టీ నేతలే విస్తుపోతున్నారు. స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబును స్వయంగా కలిసి.. మద్దతు ప్రకటించేందుకు.. పవన్‌ ఏకంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో వెళ్లే ఏర్పాట్లు చేసుకోవడాన్ని జనసేన నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సామాన్య ప్రజలైతే పవన్‌ తీరును ఎండగట్టడమే కాక.. సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీటిల్లో ప్రధానంగా 10 ప్రశ్నలకు పవన్‌ ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నిస్తున్నారు జనాలు.. ఆ వివరాలు..

1) పవన్‌ కళ్యాణ్‌.. 2014 సమయంలో.. నువ్వు చంద్రబాబుకి మద్దతు తెలిపావు. ఈ స్కామ్‌ చోటు చేసుకుంది కూడా అదే సమయంలో. స్కామ్‌కు సంబంధించిన ఆధారాలన్ని కళ్ల ముందు స్వయంగా కనపడుతుంటే.. పవన్‌.. బాబుని ప్రశ్నించాల్సింది పోయి.. అరెస్ట్‌ను ఖండిస్తున్నారు.. చంద్రబాబుకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.. అంటే ఇప్పుడు పవన్‌కి.. చంద్రబాబుని ప్రశ్నించే బాధ్యత, ధైర్యం లేవా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి పవన్‌ ఏం సమాధానం చెబుతారో అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

2) యువతకు ఉపాధి కల్పన పేరుతో తీసుకువచ్చిన ఈ పథకంలో.. భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్పష్టం అవుతుంది. కానీ నువ్వు మాత్రం.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్‌ చేశారు అంటున్నావు. స్కామ్‌ జరిగిందనే కదా.. ఇన్ని సంస్థలు కేసు బుక్‌ చేసింది. దీని వల్ల తీవ్రంగా నష్ట పోయింది నిరుద్యోగ యువత. మరి దీనిపై పవన్‌ ఎందుకు స్పందించడం లేదు. ఈ స్కామ్‌ వల్ల రాష్ట్రానికి, యువతకు నష్టం జరిగింది.. అయినా కూడా మీరు ఎందుకు స్పందించడం లేదని జనాలు.. పవన్‌ కళ్యాణ్‌ని ప్రశ్నిస్తున్నారు.

3) అవినీతి ఆరోపణల్లో అరెస్ట్‌ అయిన వ్యక్తికి నువ్వు మద్దతుగా నిలబడటం.. ఆయన అరెస్ట్‌ను ఖండించడం, ఆయనను కలవడం కోసం వెళ్లడం.. రోడ్డు మీద పడుకుని నిరసన తెలపడం ఏంటి. నేరం రుజువయ్యి.. అరెస్ట్‌ కాబడ్డ వ్యక్తి కోసం మీరు నువ్వు ఎందుకు ఇంతలా పాకులాడుతున్నారు.. పోనీ చంద్రబాబు ఏమైనా చట్టాలకు, న్యాయానికి అతీతుడా.. ఆయన అవినీతి చేస్తే జనాలు చూస్తూ ఊరుకోవాలా అని పవన్‌ని ప్రశ్నిస్తున్నారు.

4) నిద్రలేస్తే.. ఉద్యోగాలు, యువత, అభివృద్ధి, పెట్టుబడులు అని గొంతు చించుకుని అరుస్తావు. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తావు. అలాంటిది.. ఉపాధి కల్పన పేరుతో.. చంద్రబాబు.. యువతని ఇంతలా మోసం చేసి.. వందల కోట్లు కాజేస్తే.. నువ్వు ఆయనకు మద్దతుగా నిలుస్తావా.. ఇదేనా నీ బాధ్యత.. జనాల పట్ల నీకున్న అభిమానం అని పవన్‌ని క్వశ్చన్‌ చేస్తున్నారు జనాలు.

5) చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే.. అర్థరాత్రి వేళ అరెస్ట్‌.. ఫేక్‌ అరెస్ట్‌ అంటూ.. నానా హంగామా చేశావు.. అర్థరాత్రి రోడ్ల మీదకు వచ్చి సీన్‌ క్రియేట్‌ చేశావు. అసలు ఈ కేసు ఏంటి.. ఏం జరిగింది అనే మూలాల్లోకి నువ్వు ఎందుకు పోవడం లేదని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

6) 2019 ఎన్నికల ముందు.. అనేక సందర్భాల్లో చంద్రబాబు, ఆయన పాలనలో చోటు చేసుకున్న అవినీతి గురించి ప్రశ్నించావు. 2014లో టీడీపీకి మద్దతిస్తే.. సీఎం, మంత్రులు అవినీతికి బాటలు వేసి రాష్ట్రాన్ని దోచుకున్నారన్నావు. కాంగ్రెస్‌ కంటే రెట్టింపు స్థాయిలో చంద్రబాబు అవినీతి, దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించావు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు అవినీతి గురించి ప్రశ్నించిన నువ్వు.. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎందుకు యూటర్న్‌ తీసుకున్నావు.. అంటే అప్పుడు కేవలం ఎన్నికల్లో ఓట్లు చీల్చడం కోసమే మాత్రమే.. చంద్రబాబు అవినీతిపై ప్రశ్నించావా.. ఇప్పుడు ఎందుకు ఇలా యూటర్న్‌ తీసుకుంటున్నావు.. నిన్ను నమ్మిన కార్యకర్తలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని జనాలు.. పవన్‌ని ప్రశ్నిస్తున్నారు.

7) స్కిల్‌ స్కామ్‌ కేసులో.. ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకి జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించగానే.. బాబుకు అన్ని వేళలా నా మద్దతు ఉంటుందని బహిరంగంగానే ప్రకటించావు. అంటే.. చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా.. నువ్వు ఆయనకు మద్దతుగా ఉండి.. భాగస్వామిగా ఉండాలని నిర్ణయించుకున్నావా.. అంటే చంద్రబాబు అవినీతికి డైరెక్ట్‌గానే మద్దతిస్తున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు జనాలు.

8) వందల కోట్ల అవినీతి కేసులో అరెస్టైన చంద్రబాబుకు నువ్వు మద్దతు ఇవ్వడమే కాక.. టీడీపీ ప్రకటించిన ఏపీ బంద్‌కు నువ్వు మద్దతు తెలపడం ఎంత వరకు సబబు. టీడీపీ బంద్‌కు జనసేన మద్దతు తెలిపడం హీనమైన చర్యగా అనిపించడం లేదా అని జనాలు ప్రశ్నిస్తున్నారు.

9) స్కిల్‌ స​ఆమ్‌ కేసులో.. బీజేపీ దూరంగా ఉంది. మౌనం పాటిస్తుంది. ప్రస్తుతానికైతే జనసేన, బీజేపీ కూటమిగానే ఉన్నాయి కదా. మరి మీ మిత్రపక్షమైన బీజేపీ దూరంగా ఉన్నప్పుడు నీకు ఎందుకు ఈ కేసుపై పాకులాట అని జనాలు పవన్‌ కళ్యాణ్‌ని ప్రశ్నిస్తున్నారు.

10) స్కామ్‌ జరిగింది.. వందల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి అని ఇంత క్లియర్‌గా అర్థం అవుతుంటే.. నువ్వు మాత్రం బాబుకు ఇన్ని విధాల మద్దతు తెలియజేస్తున్నావు. నువ్వు కూడా ఈ స్కామ్‌లో భాగమని అనుమానం వస్తుంది. ఈ స్కామ్‌లో నీకు వాటా లేదంటే.. జనాలు ఎలా నమ్ముతారు అని ప్రశ్నిస్తున్నారు.

మరి సోషల్‌ మీడియా వేదికగా తలెత్తుతున్న ఈ ప్రశ్నలకు పవన్‌ కళ్యాణ్‌ ఏం సమాధానం చెబుతారు అని జనాలు ప్రశ్నిస్తున్నారు. మరి పవన్‌ కళ్యాణ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి అని చర్చించుకుంటున్నారు జనాలు.