iDreamPost

టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం.. Jr NTR అభిమానులపై దాడి

  • Published Jan 08, 2024 | 1:45 PMUpdated Jan 08, 2024 | 1:45 PM

టీడీపీ సభలు, మీటింగుల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినపడితే చాలు టీడీపీ నేతలు రెచ్చి పోతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..

టీడీపీ సభలు, మీటింగుల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినపడితే చాలు టీడీపీ నేతలు రెచ్చి పోతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..

  • Published Jan 08, 2024 | 1:45 PMUpdated Jan 08, 2024 | 1:45 PM
టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం.. Jr NTR అభిమానులపై దాడి

రానున్న ఎన్నికల కోసం రెడీ అవుతోన్న టీడీపీకి అడగడుగునా ఆటంకాలే ఎదరవుతున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో.. చాలా చోట్ల ఇరు పార్టీల నేతల మధ్య కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయి. ఆ విషయం పక్కకు పెడితే.. తన తర్వాత కొడుకు లోకేష్ కి సీఎం పట్టం కట్టాలని భావించిన చంద్రబాబు.. దొడ్డి దారిలో లోకేష్ ని మంత్రిని చేశాడు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన లోకేష్ ఓటమి పాలయ్యాడు. టీడీపీ కూడా దారుణ ఓటమి చవి చూసింది. అయినా సరే చంద్రబాబు మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు.

ప్రజలు, ఆఖరికి పార్టీ కార్యకర్తలు కూడా లోకేష్ ని ఆమోదించకపోయినా సరే.. బలవంతంగా కొడుకుని వారిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ వస్తే.. పార్టీ గెలుస్తుందని చెప్తున్నా.. స్వయంగా చంద్రబాబుకు ఆ విషయం తెలిసినా సరే.. ఆయన మాత్రం జూనియర్ ని పార్టీలోకి తీసుకు రావడానికి ఆసక్తి చూపడం లేదు అనే అభిప్రాయం ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అంతేకాక పార్టీ మీటింగులు, సభల్లో జూనియర్ పేరు ఎత్తినా తట్టుకోలేకపోతున్నారు టీడీపీ నేతలు. జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తితే దాడులకు సైతం తెగబడుతున్నారు. తాజాగా టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద దాడి చేసిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..

పశ్చిమ­గోదావరి జిల్లా ఆచంట, ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో “రా… కదలి రా..” పేరిట టీడీపీ సభ నిర్వహించింది. దీనికి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా హాజరయ్యారు. సభ జరుగుతుండగా.. కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. టీడీపీ కార్యకర్తలు దీన్ని సహించలేకపోయారు. వెంటనే జూనియర్ అభిమానులపై విరుచుకు పడ్డారు. అసలు టీడీపీ మీటింగుల్లో ఎన్టీఆర్ ఫోటోలు ఎందుకు ప్రదర్శిస్తున్నారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని దూషించారని సమాచారం.

ఇదే సమయంలో జనసేన అభిమానులు కూడా వారి పార్టీ జెండాలతో సభా ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఇది గమనించిన టీడీపీ క్యాడర్.. వారి చేతుల్లోని జెండాలను లాక్కుని.. బయటకు విసిరేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది అని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై జూనియర్ అభిమానుుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి